చలో ఢిల్లీని జయప్రదం చేయండి
Published Wed, Dec 4 2013 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి కోనాల భీమారావు కార్మికులకు పిలుపునిచ్చారు. ఏలూరులో మంగళవారం ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. భీమారావు మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనం నెలకు రూ.12 వేల 500లు ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, కార్మిక చట్టాలు, ధరల నియంత్రణ కోరుతూ 11 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నామని వివరించారు.
20న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
మునిసిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్, హెల్త్ కార్డుల వర్తింప చేయాలని కోరుతూ ఈ నెల 20న డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని చెప్పారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు, నాయకులు బండి వెంకటేశ్వరరావు, డి.లక్ష్మణమూర్తి, కందుల బాబ్జి, తాడికొండ వాసు, ఎ. కొండాజీ, గంధం అంజమ్మ, డీవీఏవీ ప్రసాదరాజు , పి.విజయ, వీఎస్ మల్లికార్జున్, బి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు
Advertisement
Advertisement