చండీగఢ్: హర్యానా అంబాల జిల్లాలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తన కారు ఆపిన ట్రాఫిక్ పోలీస్‌ను చితకబాదాడు. అంతటితో ఆగకుండా అతని చొక్కా చింపాడు. అక్టోబర్ 13న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ పోలీస్ ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ యువకుడ్ని భటిండాకు చెందిన లావిష్ బత్రాగా గుర్తించారు పోలీసులు. గాయపడ్డ ట్రాఫిక్ పోలీస్.. ఎక్సెంప్టీ సబ్ ఇన్‌స్పెక్టర్(ఈఎస్‌ఐ) అశోక్ కుమార్ అని తెలిపారు.
A man in Ambala was seen beating up a cop who stopped him for overspeeding. The accused allegedly hit two motorcycles & then tried to flee. He assaulted the victim, ESI Ashok Kumar who also claimed that his uniform tore in the brawl.#ambala #manbeatscop #ashokkumar #lavishbatra pic.twitter.com/FH6n0o6pjS
— Mirror Now (@MirrorNow) October 18, 2022
ఘటనకు ముందు రాజ్‌పుర్-అంబాలా రోడ్డులో అశోక్ కుమార్ తనిఖీలు నిర్వహిస్తున్నాడు. రెండు బైక్‌లను ఆపి పత్రాలు పరిశీలిస్తున్నాడు. ఈ సమయంలో ఓ ఎస్‌యూవీ వేగంగా రావడం చూసి ఆపాడు. అయితే దాన్ని డ్రైవ్ చేస్తున్న యువకుడు వాహనాన్ని నియంత్రించలేక ముందున్న రెండు బైక్‌లను ఢీకొట్టాడు. దీంతో వారు కిందపడి గాయాలపాలయ్యారు. వెంటనే కారులోనుంచి దిగిన యువకుడు ట్రాఫిక్ పోలీస్‌ను చితకబాదడమే గాక అతని దుస్తులు చింపాడు. స్థానికులు అక్కడికి గుంపులుగా రావడంతో భయపడి పారిపోయాడు. ఎస్‌యూవీని రోడ్డుపైనే వదిలిపెట్టాడు.
ఈ దృశ్యాలను అక్కడున్నవారు మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అతడు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.
చదవండి: ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉందో.. ఇక అంతే..!
Comments
Please login to add a commentAdd a comment