మాయావతికి మరో షాక్! | Senior BSP leader and former minister RK Chaudhary quits party | Sakshi
Sakshi News home page

మాయావతికి మరో షాక్!

Published Thu, Jun 30 2016 2:52 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

మాయావతికి మరో షాక్!

మాయావతికి మరో షాక్!

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో బీఎస్పీ అధినేత్రి మాయావతికి వరుస ఎదురుదెబ్బలు తగులున్నాయి. ప్రతిపక్ష నేత, బీఎస్పీ సీనియర్ నాయకుడు, పార్టీ శాసనసభాపక్ష నేత స్వామి ప్రసాద్ మౌర్య పార్టీకి గుడ్ బై చెప్పి 10 రోజులు కూడా గడవకముందే మరో సీనియర్ నాయకుడు పార్టీకి దూరమయ్యారు. మాజీ మంత్రి ఆర్కే చౌదరి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. మాయావతి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ప్రసాద్ మౌర్య కూడా మాయావతిపై సరిగ్గా ఇలాంటి ఆరోపణలే చేశారు. 'మాయావతి స్వయంగా టికెట్లను వేలం వేస్తున్నారు. ఆమె సొంత నిర్ణయం ప్రకారమే ఇప్పటినుంచి టికెట్ల కేటాయింపు జరుగుతోంది. ఆమె సరైన అభ్యర్థులను ఎంచుకోవడం లేదు' అంటూ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు సీనియర్ నాయకులు పార్టీని వీడుతుండడం పట్ల బీఎస్పీలో కలవరం రేపుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement