పొలిటీషియన్‌ హోటల్లో ఆరు జంటల అరెస్టు | Six couples held in BSP leader's hotel | Sakshi
Sakshi News home page

పొలిటీషియన్‌ హోటల్లో ఆరు జంటల అరెస్టు

Published Mon, May 22 2017 7:21 PM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

పొలిటీషియన్‌ హోటల్లో ఆరు జంటల అరెస్టు - Sakshi

పొలిటీషియన్‌ హోటల్లో ఆరు జంటల అరెస్టు

ఘజియాబాద్‌: బీఎస్పీ నాయకుడికి చెందిన హోటల్‌లో అభ్యంతరకర పొజిషన్లలో ఉన్న ఆరు యువ జంటలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువ జంటలకు గంటల చొప్పున గడపడానికి రూంలను హోటల్‌ రాయల్‌ప్యాలెస్‌ ఇస్తున్నట్లు సమాచారం వచ్చినట్లు తెలిపారు. దీంతో మహిళా పోలీసులు, యాంటీ రోమియో స్క్వాడ్‌లు సంయుక్తంగా హోటల్‌పై రైడింగ్‌ నిర్వహించినట్లు వెల్లడించారు.

రైడింగ్‌లో ఆరు యువ జంటలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. హోటల్‌ బీఎస్పీ లీడర్‌ కమల్‌ జాదవ్‌కు చెందినదిగా వివరించారు. జంటలను విచారించిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement