యువతి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువతి దారుణ హత్య

Published Wed, Jun 12 2024 2:32 AM | Last Updated on Wed, Jun 12 2024 8:27 AM

-

పెళ్లికి నిరాకరించడంతో హత్య చేసిన ప్రేమికుడు

గుణుపూర్‌ పోలీసుస్టేషన్‌లో లొంగుబాటు

రాయగడ: ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని ఆనందమయమైన జీవితాన్ని కొనసాగిద్దామని ప్రేమికురాలిని ప్రియుడు ఒప్పించాడు. అయితే వీరిద్దరి పెళ్లికి ప్రేమికురాలి తల్లిదండ్రులు ససేమిరా అంగీకరించకపోవడంతో కోపోద్రేక్తుడైన ప్రేమికుడు పథకం ప్రకారం ప్రేమికురాలిని పిలిచి హత్య చేసిన అనంతరం ఒక అడవిలో మృతదేహాన్ని పారేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. తన కూతురుని హత్య చేశాడంటూ బిసంకటక్‌ పోలీసుస్టేషన్‌లో ప్రేమికుడిపై యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో తప్పించుకోలేనని తెలిసి, సరాసరి జిల్లాలోని గుణుపూర్‌ పోలీసుస్టేషన్‌లో ప్రేమికుడు లొంగిపొయాడు.

మనస్థాపంతో హత్య
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బిసంకటక్‌లో నివాసముంటున్న నిటు నౌరి (23) అనే యువతితో గుణుపూర్‌లోని మరాటిగుడ గ్రామానికి చెందిన మేన్యూవ్‌ సబర్‌ (28) అనే యువకుడు ప్రేమలో పడ్డాడు. ఇదే క్రమంలో తన ప్రేయసిని కలిసేందుకు సరాసరి బిసంకటక్‌ వెళ్లి మాట్లాడి వస్తుండేవాడు. అయితే ఇక పెళ్లి చేసుకుందామని అందుకు తల్లిదండ్రులకు ఒప్పించమని ప్రేయసిని అడిగాడు. తమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవడం లేదని యువతి తన ప్రియుడితో చెప్పడంతో మనస్థాపానికి గురయ్యాడు.

ఈ నేపథ్యంలోనే సోమవారం తన ప్రేయసికి ఫోన్‌చేసి ఒకసారి మాట్లాడాలని రమ్మన్నాడు. అందుకు అంగీకరించిన ఆమె కలిసేందుకు వెళ్లింది. అప్పటికే బిసంకటక్‌లో ఉన్న సబర్‌ తన వ్యూహం ప్రకారం ప్రేమికురాలిని హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని బిసంకటక్‌ సమీపంలోని కిరిబిరి అడవుల్లో పడేశాడు. తిరిగి ఏమీ తెలియని వాడిలా తన స్వగ్రామమైన గుణుపూర్‌ వెళ్లిపోయాడు. ఇంట్లో కుమార్తె లేకపోవడంతో అంతా వెతికిన తల్లిదండ్రులు మంగళవారం ఉదయం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న సబర్‌ సరాసరి గుణుపూర్‌ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. తానే హత్య చేసి మృతదేహాన్ని పారివేసిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో బిసంకటక్‌ పోలీసులు అడవిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement