
మృతి చెందిన భవిత (ఫైల్)
కర్ణాటక, బొమ్మనహళ్లి : ఓ యువతి హోటల్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం హాసన్ పట్టణంలో వెలుగు చూసింది. మృతురాలిని అరుకలగూడుకు చెందిన భవిత (23)గా గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు... ఈ యువతి 18వ ఏటనే తల్లిదండ్రులను వదిలి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఓ యువకుడితో ప్రేమలో పడితే తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా తాను మేజర్‌నని, తన ప్రేమికుడితోనే ఉంటానని వెళ్లింది. దీంతో అప్పటి నుంచి ఈ యువతిని తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే ఆదివారం ఉదయం హాసన్ పట్టణంలో ఉన్న సరయు హోటల్ వెనుక భాగంలో యువతి మృతదేహం ఉన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని హత్య చేశారా, ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
యువతి చేయిపై పునీత్ అనే పేరుతో పచ్చబొట్టు ఉంది. అతే కాకుండా ఇప్పటి వరకు సుమారు ముగ్గురు యువకులను భవిత ప్రేమించినట్లు పోలీసుల విచారణలో తేలింది. 12 రోజులకు ముందు ఇక్కడికి వచ్చిన భవిత ఇదే హోటల్లో దిగింది. తాను ఇదే హోటల్ గదిలో ఉన్నట్లు తన ఫేస్‌బుక్ స్టేటస్‌లో ఫొటోలను కూడా అప్‌లోడ్ చేసింది. శనివారం రాత్రి కూడా భవిత పునిత్‌తో కలిసి హోటల్ రూంకు రావడం జరిగింది. ఆదివారం ఉదయం భవిత హోటల్ వెనుకాల విగతజీవిగా పడి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment