క్రమబద్ధీకరణ వెంటనే చేయాలి
నిర్మల్‌టౌన్ : కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే క్రమబద్దీకరించాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు డి మాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు నిరవధిక దీక్షలో భాగంగా సోమవారం మౌన దీక్ష చేశారు. అంతకుముందు వారు మాట్లాడారు. క్రమబద్దీకరణను చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఆలçస్యం చేస్తుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమబద్దీకరణ ఆలస్యం అవుతుండడం వల్ల అప్పటి వరకు 10వ పీఆర్‌సీ ప్రకారం బేసిక్ పే చెల్లించడంతో పాటు డీఏ ఇవ్వాలని కోరారు.
మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాన్ సాంక్షన్ పోస్టులను వెంటనే సాంక్షన్ పోస్టులుగా మర్చాలని అన్నారు. ఇందులో నాయకులు సంజీవ్, పురుషోత్తం, లక్షీ్మకాంత్, నాగేశ్వర్‌రావు, సుధారాణి, సురేఖ, సుమన్ గౌడ్, సవిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.