చిలకలపూడి(మచిలీపట్నం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తూ తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆవరణలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం జోనల్ ఇన్‌చార్జ్ షేక్ సలార్‌దాదా, మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డెప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, పార్టీ యువజన విభాగం జోనల్ ఇన్‌చార్జ్ పేర్ని కృష్ణమూర్తి(కిట్టు), అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు పల్లపాటి సుబ్రహ్మణ్యం, పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment