వనపర్తి: వనపర్తికి చెందిన ఒక మహిళా డాక్టర్ పట్ల ఆమె భర్త అమానుష వైఖరితో వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ మౌనపోరాటం చేస్తున్నారు. ఈ మేరకు సంబంధిత మంత్రి కల్పించుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ వనపర్తి జిలా కలెక్టరుకు లేఖ రాశారు.
డా. లక్ష్మి కుమారి వనపర్తిలో ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తోన్న చర్మవ్యాధి నిపుణురాలు. ఆమె భర్త ఎం.ఎన్. ప్రమోద్ కుమార్ గృహ నిర్వహణలో ఏమాత్రం సహాయపడకపోగా తనను చాలాకాలంగా వేధిస్తున్నారని, 23 ఏళ్లుగా అతనితో నరకాన్ని అనుభవిస్తున్నానని ఆమె లేఖలో రాశారు.
చిన్న క్లినిక్ నడుపుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నానని ఇప్పుడైతే భర్త వేధింపులు మరీ ఎక్కువయ్యాయని.. శారీరకంగానూ, మానసికంగానూ, మాటలతోనూ ఇబ్బంది పెడుతూ క్లినిక్ మూసివేయాలని ఒత్తిడి చేస్తూ నానా హింసలకు గురిచేస్తూ శాడిస్టులా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. నా పని నన్ను చేసుకోనీయకుండా ఇంట్లోనే ఉంచి బంధించడం, క్లినిక్ కు తాళాలు వేసేయడం వంటి పిచ్చి పనులు చేస్తున్నాడు. దీంతో నేను పేషేంట్ లకు క్లినిక్ బయట రోడ్డు మీదే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తోంది.
దయచేసి సంబంధిత మంత్రిగారు కల్పించుకుని నన్ను, నా బిడ్డను కాపాడాలని కోరుతూ మౌనపోరాటం చేస్తున్నాను. ఇంతవరకు జిల్లా అధికారులు ఎవ్వరూ నా క్లినిక్ విషయమై నాకు ఎలాంటి అభయం ఇవ్వలేదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Karimnagar: గుండెపోటు.. వ్యక్తి ప్రాణాలు బలిగొన్న రైల్వేగేటు..
Comments
Please login to add a commentAdd a comment