wanaparthy constituency
-
వనపర్తిలో ఓ డాక్టర్ మౌనపోరాటం..
వనపర్తి: వనపర్తికి చెందిన ఒక మహిళా డాక్టర్ పట్ల ఆమె భర్త అమానుష వైఖరితో వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ మౌనపోరాటం చేస్తున్నారు. ఈ మేరకు సంబంధిత మంత్రి కల్పించుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ వనపర్తి జిలా కలెక్టరుకు లేఖ రాశారు. డా. లక్ష్మి కుమారి వనపర్తిలో ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తోన్న చర్మవ్యాధి నిపుణురాలు. ఆమె భర్త ఎం.ఎన్. ప్రమోద్ కుమార్ గృహ నిర్వహణలో ఏమాత్రం సహాయపడకపోగా తనను చాలాకాలంగా వేధిస్తున్నారని, 23 ఏళ్లుగా అతనితో నరకాన్ని అనుభవిస్తున్నానని ఆమె లేఖలో రాశారు. చిన్న క్లినిక్ నడుపుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నానని ఇప్పుడైతే భర్త వేధింపులు మరీ ఎక్కువయ్యాయని.. శారీరకంగానూ, మానసికంగానూ, మాటలతోనూ ఇబ్బంది పెడుతూ క్లినిక్ మూసివేయాలని ఒత్తిడి చేస్తూ నానా హింసలకు గురిచేస్తూ శాడిస్టులా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. నా పని నన్ను చేసుకోనీయకుండా ఇంట్లోనే ఉంచి బంధించడం, క్లినిక్ కు తాళాలు వేసేయడం వంటి పిచ్చి పనులు చేస్తున్నాడు. దీంతో నేను పేషేంట్ లకు క్లినిక్ బయట రోడ్డు మీదే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తోంది. దయచేసి సంబంధిత మంత్రిగారు కల్పించుకుని నన్ను, నా బిడ్డను కాపాడాలని కోరుతూ మౌనపోరాటం చేస్తున్నాను. ఇంతవరకు జిల్లా అధికారులు ఎవ్వరూ నా క్లినిక్ విషయమై నాకు ఎలాంటి అభయం ఇవ్వలేదని తెలిపారు. ఇది కూడా చదవండి: Karimnagar: గుండెపోటు.. వ్యక్తి ప్రాణాలు బలిగొన్న రైల్వేగేటు.. -
పాలమూరి చేతికి షాక్‌లు..చిన్నారెడ్డి రూటు ఎటు?
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సీనియర్ నేత మీదే తిరుగుబాటు మొదలైంది. సీనియర్ స్వార్థపూరిత వ్యవహారాల్ని ఇంక సహించేది లేదంటూ గాంధీభవన్‌కు ఫిర్యాదులు వెళ్ళాయి. ఒక్కసారిగా పార్టీలో అసమ్మతి రేగడంతో హైదరాబాద్ నాయకత్వం కూడా దిక్కులు చూస్తున్నట్లు సమాచారం. చిన్నారెడ్డి రూటు ఎటు? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం ఓటర్లు విలక్షణ తీర్పును ఇస్తూ ఉంటారు. అక్కడి నుంచి గెలిచిన ప్రతినాయకుడు ఆయాపార్టీల్లో అధినేతలకు సన్నిహితంగా ఉండటంతో నియోజకవర్గ అభివృద్దికి ఎవరిస్దాయిలో వారు పనిచేశారు. మాజీమంత్రి, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదోసారి గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఓటమి తర్వాత చిన్నారెడ్డి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవటం లేదని స్థానిక నేతలు మండిపడుతున్నారు. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీ చేస్తానంటూ చిన్నారెడ్డి ప్రచారం చేసుకుంటుండటం వారికి మింగుడు పడటం లేదు. ఈ ఎన్నిక లాస్ట్..! జిల్లా పార్టీకి నూతన అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ నియామకం పెద్దదుమారమే రేపింది. జడ్పీటీసీగాను.. రాష్ట్ర బీసీ సెల్లో పదవి అనుభవిస్తున్న వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం వనపర్తిలో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో హాత్‌సే హాత్ జోడో అభియాన్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. అసమ్మతి నేతలు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని ఓ కన్వెన్షన్ హాల్లో సమావేశం కావటం కలకలం రేపింది. చిన్నారెడ్డి హాటావో...కాంగ్రేస్కు బజావో అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసి నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇస్తే పార్టీ ఓడిపోతుందని.. ఆయనకు వ్యతిరేకంగా తామంతా పనిచేస్తామని అసమ్మతినేతలు హెచ్చరించటం చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఎన్నికల్లోనూ ఇదే చివరిసారి అని చెప్పటం చిన్నారెడ్డికి అలవాటుగా మారిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తి వాదులు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసి చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకే సీటిస్తే సహకరించేదని కూడా తేల్చిచెప్పినట్టు సమాచారం. గాంధీభవన్ వద్ద నిరసన తెలిపిన నేతలు దిగ్విజయ్ సింగ్‌కు సైతం ఫిర్యాదు చేశారు. కొత్త చేతులకు ఎప్పుడు అవకాశం? వచ్చే ఎన్నికల్లో కొత్తవారికి టికెట్ ఇవ్వాలని వనపర్తి నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సీనియర్లు.. రేవంత్‌వర్గం అంటూ రచ్చకెక్కి అధిష్టానానికి తలనొప్పి తెప్పించారు. తాజాగా వనపర్తిలో ఇలాంటి ఘటనలు జరగటం హాట్ టాపిక్‌గా మారింది. తనకు వ్యతిరేకంగా గ్రూపులు కూడగడుతున్నట్టు ఆరోపిస్తున్న చిన్నారెడ్డి.. మాజీ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్‌ను పార్టీనుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు యువజన కాంగ్రెస రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి మద్య విభేదాలు ఉన్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో తరచు పర్యటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో సైతం శివసేనారెడ్డి ఉత్సహాంగా పాల్గొని తన వర్గీయులతో హడావిడి చేశారు. వయస్సు మీద పడిన చిన్నారెడ్డికి కాకుండా యువకుడికి సీటిస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోనేత నాగం తిరపతిరెడ్డి సైతం పోటీకి సై అంటున్నట్టు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాని చిన్నారెడ్డి మాత్రం తాను పోటీకి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కలిసి వచ్చి పార్టీ గెలుస్తుందే ధీమాను కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్‌రెడ్డిని ఎదుర్కొవటం అంతా సులువు కాదని భావిస్తున్న పార్టీ నేతలకు తాజా విభేదాలు తలనొప్పిగా మారాయంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బుజ్జగింపుల్లేవ్!
సాక్షి, వనపర్తి: ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు లేరు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ధైర్యంగా నామినేషన్ దాఖలు చేసినవారు లేరూ.. దీంతో నామినేషన్ల ఉపసంహరణ దశలో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాంటి బుజ్జగింపుల పర్వానికి ఎలాంటి ఆస్కారం లేదని స్పష్టమవుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ రెబల్స్‌గా నామినేషన్ వేసిన దాఖలాలు లేవు. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులంతా ప్రధాన పార్టీలకు చెందినవారు కావడం, పైగా, రాష్ట్ర, జాతీయస్థాయి హోదాలో పలుకుబడి కలిగిన నేతలు ఉండటంతో తిరుబాటుదారుల భయం లేదని చెప్పొచ్చు. బరిలో నిలిచేదెవరో? ఎన్నికల్లో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఈనెల 19వ తేదీ వరకు 18 మంది 39 నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో అఫిడవిట్లో లోపాలు ఉన్నాయని ఆరుగురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. 12 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాట అయ్యాయి. వీరిలో టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ అభ్యర్థులతో పాటు పలు జాతీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మొదటిరోజు గడువు పూర్తయింది. ఇప్పటి వరకు ఏ ఒక్కరు నామినేషన్లను వెనక్కి తీసుకోలేదు. అభ్యర్థులు వీరే.. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నుంచి సత్యం సాగరుడు, బీజేపీ నుంచి కొత్త అమరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి డాక్టర్ జి.చిన్నారెడ్డి, టీఆర్ఎస్ నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బహుజన లెఫ్ట్ పార్టీ నుంచి జి.క్రిష్ణయ్య, సమాజ్‌వాదీ పార్టీ అక్కల బాబుగౌడ్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి సీఆర్. మునిస్వామి, స్వతంత్ర అభ్యర్థులు పుట్ట ఆంజనేయులు, పోల ప్రశాంత్, బూజుల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.రాజ్‌కుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇండిపెండెంట్‌గా టీజేఎస్ నేత మహాకూటమితో జతకట్టిన ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితిలో పార్టీ ఆవిర్భావం నుంచీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తాను కూడా పోటీలో ఉంటాననే సందేశం బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలాఉండగా, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధానపార్టీల ఓట్లను తీల్చే అవకాశం ఉండదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరి బలం ఏమిటో తేలాలంటే డిసెంబర్ 11న నిర్వహించే ఓట్ల లెక్కింపు దాకా ఆగాల్సిందే. -
100 మంది.. 184 సెట్లు
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గడువు సోమవారంతో ముగియగా పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని మొత్తం ఐదు నియోజకవర్గాలకు గాను 100 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వీరందరు కలిపి 184 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని సోమవారం రాత్రి అధికారులు వెల్లడించారు. అత్యధికం.. అత్యల్పం జిల్లాలో అత్యధికంగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ 25 మంది అభ్యర్థులు 51 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక నారాయణపేటలో అతి తక్కువగా 15 మంది అభ్యర్థులు 25 సెట్ల నామినేషన్లు, మక్తల్‌లో 15 మంది అభ్యర్థులు 32 సెట్ల నామినేషన్లు అందజేశారు. అదేవిధంగా దేవరకద్రలో 22 మంది అభ్యర్థులు 40 సెట్ల నామినేషన్లు, జడ్చర్లలో 23 మంది అభ్యర్థులు 36 సెట్ల నామినేషన్లు సమర్పించారు. అయితే నామినేషన్ పత్రాలన్నింటినీ మంగళవారం స్క్రూటినీ నిర్వహించిన అనంతరం వివరాలు సరిగ్గా లేని వాటిని తిరస్కరించనున్నారు. ఆ తర్వాత అధికారులు పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఇక ఈనెల 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. పరిస్థితులపై సమీక్ష నామినేషన్ల దాఖలు గడువు సోమవారం ముగియనుండడం తో అన్ని రిజర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉండడంతో పోలీసు బందోబస్తుతో పాటు అదనపు సిబ్బందిని నియమించారు. ఇక మూడు గంటల వరకే నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండడంతో అంతకు ముందు వచ్చిన వారినే కార్యాలయాలకు అనుమతించాలని ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. అలాగే, జిల్లా కలెక్టరేట్ నుంచి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. -
మహకూటమితోనే అభివృద్ధికి బాటలు..
సాక్షి, ఆత్మకూర్: రాష్ట్ర ప్రజలను మోసంచేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలంటే మహాకూటమిని గెలిపించాలని మహాకూటమి అభ్యర్థి కొత్తకోట దయాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.వీరారెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూర్ మండలంలోని బాలకిష్టాపూర్, పిన్నంచర్ల, మూళమల్లలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహాకూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లను డబుల్ చేస్తామని, ఇంటి స్థలం ఉన్న వారందరికీ ఇంటినిర్మాణం కోసం రూ.5లక్షలు మంజూరు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బాలకిష్టన్న, కాంగ్రెస్, టీడీపీ నాయకులు అయూభ్‌ఖాన్, రామలక్ష్మారెడ్డి, రహ్మతుల్లా, బాలకిష్ణారెడ్డి, ఎస్టీడీ శ్రీను, అశ్విన్‌కుమార్, పుట్నాల రమేష్, వెంకటేష్, శేఖర్, గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వండిపెడతా.. ఓటేయమ్మా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి అభ్యర్థి కొత్తకోట దయాకర్ రెడ్డి ఆత్మకూర్ మండలంలోని గోపన్‌పేట గ్రామంలో వంటింట్లోకి వెళ్లిమరీ వంటచేస్తు తనకు ఓటువేయాలని అభ్యర్థించారు. టీఆర్ఎస్ను సాగనంపాలి మదనాపురం: కల్లబొల్లి హామీలతో గద్దెనెక్కిన టీఆర్ఎస్ను సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కరివెన, గోపన్‌పేటలో ఇంటింటి ప్రచారం చేశారు.కార్య క్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బాలకిష్టన్న, టీడీపీ మండల అధ్యక్షుడు నాగన్న యాదవ్, బాలకిష్ణారెడ్డి, రామలక్ష్మారెడ్డి, ఎస్టీడీ శ్రీను, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చిన్నారెడ్డి గెలుపునకు పూజలు పెబ్బేరు: మండలంలోని సూగూర్‌లో కాంగ్రెస్ నాయకులు నర్సింహ్మనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం రామాలయంలో పూజలు చేశారు. వనపర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నారెడ్డి గెలువాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌లో మచ్చలేని నాయకుడని కొనియాడారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామలక్ష్మన్, బుచ్చన్నయాదవ్, మండగిరి రాముడు, గోవిందు, మధు పాల్గొన్నారు. -
నామినేషన్ ఫైట్.. నేతల బల ప్రదర్శన..!
సాక్షి, వనపర్తి: నామినేషన్ దాఖలు చేసిన రోజే తమ జనబలాన్ని ప్రదర్శిస్తే ఇక గెలిచినట్లేనని రాజకీయ పరిభాషలో చెబుతుంటారు. అలాంటి సందర్భం కోసమే ప్రస్తుతం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్నేళ్లుగా ఇదే సంస్కృతి కొనసాగుతోంది. అదే తరహాలో మహాకూటమి అభ్యర్థి, వనపర్తి తాజామాజీ ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేసేందుకు భారీగా జనసమీకరణ చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ రోజున రావాలని శ్రేణులను కోరినట్లు తెలిసింది. ఐదోరోజు శుక్రవారం వరకు ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అ«ధికారపార్టీ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రెండుసెట్ల నామినేషన్లు, స్వతం త్ర అభ్యర్థులు మూడుసెట్ల నామిషన్లు, సమాజ్‌వాది పార్టీ నుంచి అక్కల బాబుగౌడ్ నామినేషన్ వేశారు. ఆరో రోజు తాజామాజీ ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి, బీజేపీ అభ్యర్థి కొత్త అమరేందర్‌రెడ్డితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. రోజు మూడురోజులుగా భారీ సంఖ్యలో జనసమీకరణలో నిమగ్నమయ్యారు. ఏర్పాట్లలో నాయకులు 2014 ఎన్నికల సమయంలో చిన్నారెడ్డి స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో వేల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జనసమీకరణ చేసి అక్కడి నుంచి ర్యాలీగా ఆర్ఓ కార్యాలయం వరకు వెళ్లారు. ప్రధాన కూడళ్ల గుండా ర్యాలీలు, నృత్యాలు చేస్తూ డప్పులు కొడుతూ ఒంటెలు, ఎద్దుల ప్రదర్శనలతో నియోజకవర్గంలో తన బలాన్ని ప్రదర్శిస్తూ నామినేషన్‌కు బయలుదేరారు. అదే తరహాలో టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సైతం 2014లో నామినేషన్ వేశారు. కానీ ఈసారి ఎన్నికల సందర్భంగా నిరంజన్‌రెడ్డి ట్రెండ్ మార్చి అతి సాధారణంగా ఆలయాల్లో పూజలు చేసి నలుగురు వ్యక్తులతో కలిసి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి నామినేషన్ వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
టీఆర్ఎస్ గెలిస్తే..నిరంజన్‌రెడ్డి సర్వీస్ ట్యాక్స్..
సాక్షి, ఖిల్లాఘనపురం: డిసెంబర్ 11 తరువాత నీళ్ల నిరంజన్‌రెడ్డి.. కన్నీళ్ల నిరంజన్‌రెడ్డిగా పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సవాల్ విసిరారు. బుధవారం స్థానిక పద్మశాలి కల్యాణ మండపంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతా సిద్ధం చేసిన తరువాత వచ్చి నీళ్లు తెచ్చానని, నీళ్ల నిరంజన్‌రెడ్డి గా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. నిరంజన్‌రెడ్డి గెలిస్తే జీఎస్టీ తరహాలో ఎన్ఎస్టీ (నిరంజన్‌రెడ్డి సర్వీస్ ట్యాక్స్) వేస్తారని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు రోజు రాత్రి రూ.12 కోట్ల అవినీతి సొమ్ముతో 29 కిలోల బంగారం కొన్న అవినీతి పరుడా వనపర్తిలో గెలిచేది? అని నిలదీశారు. ఇప్పటివరకు వనపర్తి నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా తాను, రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రజలకు సేవ చేశామన్నారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి కృష్ణుడిగా, తాను అర్జునుడిగా ఎన్నికల యుద్ధంలో దిగుతున్నామని చిన్నారెడ్డి అభివర్ణించుకుంటూ ఎన్నికల బరిలో తమను తట్టుకునేవారు ఉండబోరని చెప్పారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరిస్తాన్న వారు కొత్తగా 12వేల ఎకరాలకే ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా సింగిల్‌విండో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రమేశ్‌గౌడ్ మాట్లాడుతూ నిరంజన్‌రెడ్డికి వ్యతిరేకంగా తమ సత్తా ఏమిటో చూపుతామని ప్రతినబూనారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, శివసేనారెడ్డి, నాగం తిరుపతిరెడ్డి, సతీష్, డాక్టర్ నరేందర్‌గౌడ్, నాగేందర్‌గౌడ్, కొండారెడ్డి, కృష్ణయ్యయాదవ్, బాల్‌రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఓటును అమ్ముకోవద్దు
సాక్షి, ఖిల్లాఘనపురం: మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్నికలు, ఓటుహక్కు, మూఢనమ్మకాలపై గురువారం రాత్రి అవగాహన కల్పించారు. స్థానిక ఎస్ఐ నరేందర్ మండల కేంద్రంలోని బస్టాండు ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన పోలీస్ శాఖ కళాకారులు పలు విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటుహక్కు వినియోగంతోపాటు బాల్యవివాహాలు, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అంటరానితనం, మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల నివారణ, మహిళలపై లైంగిక దాడులు, హెల్మెట్ వాడకం తదితర వాటిపై పాటలు, నృత్యాలు, చలోక్తులతో చైతన్యపరిచారు. ఎస్ఐ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, సారా సీసాకు, డబ్బులకు ఓటును అమ్ముకోవద్దన్నారు. ఒక్కసారి లొంగిపోతే ఐదేళ్లపాటు నాయకుడు ఎన్ని తప్పులు చేసిన, మోసాలు చేసిన బానిసలుగా బతకాల్సిందేనని, ఓటు ప్రతి ఒక్కరికి వజ్రాయుధం లాంటిదన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ వారు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది, కళాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించండి వనపర్తి: అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగుల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సెక్టోరల్ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ చంద్రారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆర్డీఓ తన చాంబర్లో సెక్టోరల్ అధికారులు, మండలాల ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులను పోలింగ్ స్టేషన్‌కు తీసుకువచ్చేందుకు ఆటో సౌకర్యం కల్పించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు నిర్మించాలని, దివ్యాంగులను పోలింగ్ కేంద్రంలోకి తీసుకువెళ్లేందుకు వలంటీర్లను ఏర్పాటు చేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుత్, బాతురూం, నెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలో 278 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. కావాల్సిన కంటే ఎక్కువ గానే.. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్‌ను ఎన్నికల సంఘం అధికారులు నియోజకవర్గానికి పంపించారన్నారు. సమావేశంలో డీఆర్డీఓ గణేష్, తహసీల్దార్ శాంతిలాల్, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లోకి క్యూ!
వనపర్తి: వనపర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు వరుస కట్టి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా బుదవారం వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదారాబాద్‌కు వెళ్లి ముఖ్యమంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వనపర్తి పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మునిసిపల్ మాజీ వైస్‌చైర్మన్, ప్రస్తుత కౌన్సిలర్ ఆర్. లోక్‌నాథ్‌రెడ్డి నేతృత్వంలో కాశీంనగర్ సర్పంచ్ గోపాల్‌నాయక్, శ్రీనివాసపురం సర్పంచ్ సురేష్, మాజీ సర్పంచ్ నరసింహా, సూగుర్ సర్పంచ్ రాజశేఖర్‌గౌడ్, శ్రీరంగాపురం ఎంపీటీసీ, కౌన్సిలర్ హెచ్ఎన్ కుమార్, చీర్ల విష్ణుసాగర్ తదితరులు తెలంగాణ భవన్లో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి వారిని డిప్యూటీ సీఎంకు పరిచయం చేశారు. అలాగే పార్టీలో చేరిన వారిలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు రం గం నరసింహా, పూజారి వెంకటస్వామి, మెట్‌పల్లికి చెందిన సత్యానాయక్, బల్రాం, కృష్ణయ్యతో మరో 300మంది ఉన్నా రు. కార్యక్రమంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఉన్నారు.