వనపర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు వరుస కట్టి అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు.
వనపర్తి: వనపర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు వరుస కట్టి అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా బుదవారం వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదారాబాద్‌కు వెళ్లి ముఖ్యమంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వనపర్తి పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మునిసిపల్ మాజీ వైస్‌చైర్మన్, ప్రస్తుత కౌన్సిలర్ ఆర్. లోక్‌నాథ్‌రెడ్డి నేతృత్వంలో కాశీంనగర్ సర్పంచ్ గోపాల్‌నాయక్, శ్రీనివాసపురం సర్పంచ్ సురేష్, మాజీ సర్పంచ్ నరసింహా, సూగుర్ సర్పంచ్ రాజశేఖర్‌గౌడ్, శ్రీరంగాపురం ఎంపీటీసీ, కౌన్సిలర్ హెచ్‌ఎన్ కుమార్, చీర్ల విష్ణుసాగర్ తదితరులు తెలంగాణ భవన్‌లో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి వారిని డిప్యూటీ సీఎంకు పరిచయం చేశారు. అలాగే పార్టీలో చేరిన వారిలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు రం గం నరసింహా, పూజారి వెంకటస్వామి, మెట్‌పల్లికి చెందిన సత్యానాయక్, బల్‌రాం, కృష్ణయ్యతో మరో 300మంది ఉన్నా రు. కార్యక్రమంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఉన్నారు.