Deputy Chief Minister Mahmood Ali
-
మహమూద్ అలీ అనే నేను..
సాక్షి,సిటీబ్యూరో: మహమూద్ అలీ.. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రిగా సేవలందించారు. అంతకుమించి సీఎం కేసీఆర్‌కు ఆత్మీయుడు. కష్టాలు, నష్టాల్లోనూ నమ్మిన నేత వెంటే అలీ పయనించారు. కేసీఆర్ అంటే ఆయనకు అమితమైన అభివానం, గౌరవం. కేసీఆర్‌కు సైతం మహమూద్ అలీ అంటే ఎంతో ఇష్టం. అందుకే గురువారం తనతో పాటు మంత్రిగా మహమూద్ అలీని ఎంచుకున్నారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావంలోనే పార్టీలో చేరిన అలీ.. పార్టీ సిటీ కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర మైనారిటీ సెల్ చైర్మన్‌గా సేవలందించారు. ఆపై 2002లో ఆజంపురా కార్పొరేటర్‌గా, 2009లో సికింద్రాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. అనంతరం శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై కేసీఆర్ కేబినెట్లో రెవెన్యూశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలీ సారథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ వంటివి దిగ్విజయంగా చేపట్టారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పాల వ్యాపారంలో ఉన్న మహమూద్ అలీ, ఆజంపురాలోని తన నివాసంలో 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కోసమే ఒక ప్రత్యేక కుర్చీని వేయించారు. అక్కడ ఎన్ని పార్టీ సమావేశాలు జరిగినా.. ఎంతటి ప్రముఖులు వచ్చినా ఆ కుర్చీలో ఇప్పటి దాకా కేసీఆర్ తప్ప మరెవరినీ ఆసీనులు కాకుండా చూడటం విశేషం. తన అభిమాన నేత అక్కడే ఉన్నట్టుగా అలీ భావించడం ప్రత్యేకమైన అంశం. నమ్మకాన్ని వమ్ము చేయను: అలీ అత్యంత విశ్వాసంతో సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని రాష్ట్ర నూతన మంత్రిగా ప్రమాణం చేసిన మహమూద్ అలీ స్పష్టం చేశారు. గురువారం తనను అభినందించేందుకు భారీగా వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాలను మరింత విస్తృతం చేసే ప్రక్రియలో తనకు భాగస్వామ్యం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. -
ప్రగతి పరవళ్లు
►ఇదే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యం ►త్వరలో టీ–హబ్ 2 ఏర్పాటు ►వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాం ►అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం ►డిసెంబర్ నెలాఖరులోగాఇంటింటికీ తాగునీరు అందిస్తాం ►డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడి ►ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు రంగారెడ్డి జిల్లా: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మగా భావించే వ్యవసాయానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనుబంధ వృత్తులకూ ఆర్థిక ప్రేరణ కలిగిస్తున్నామని చెప్పారు. అందుకోసం సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని వెల్లడించారు. తద్వారా పల్లెల్లో ప్రగతిని పరవళ్లు తొక్కించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియం ఆవరణలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లా యంత్రాంగం వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ రఘనందర్‌రావు, ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, తీగల కృష్ణారెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, సంయుక్త సీపీ తరుణ్ జోషితో కలిసి జాతీయ జెండాను ఎగురవేసిన డిప్యూటీ సీఎం.. అనంతరం రాష్ట్రం, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయన ప్రసంగించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యం.. రాష్ట్రంలో వివిధ వనరుల ద్వారా సమకూరే సంపద పేదరిక నిర్మూలన కోసం ఉపయోగపడాలన్నదే తమ లక్ష్యం డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నుంచి ఒంటరి మహిళలకు జీవనభృతి కల్పిస్తున్నామన్నారు. మాతా శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన కేసీఆర్ కిట్ శనివారం నుంచి అమలవుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవిస్తే రూ.12 వేలు ప్రోత్సాహకంగా అందజేస్తాం. ఆడబిడ్డ పుడితే మరో రూ.వెయ్యి అదనంగా అందిస్తాం. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేయనున్నామన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని మహమూద్ అలీ చెప్పారు. గొల్ల, కురుమ, యాదవులకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేయనున్నామన్నారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని.. చేపల పెంపకం ద్వారా మత్స్య కార్మికులకూ అండగా నిలిచామని చెప్పారు. నాయీ బ్రాహ్మణులు నవీన క్షౌ రశాలలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు. అన్నింటా ప్రగతి.. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సదుద్దేశంతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెప్పారు. జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి 1,400 చొప్పున ఇళ్లు మంజూరయ్యాయని.. వీటిని త్వరలోనే నిర్మించి అర్హులకు అప్పగిస్తామని చెప్పారు. మిషన్ కాకతీయ పథకం కింద తొలి విడతలో 309 చెరువులను అభివృద్ధి పరిచినట్టు చెప్పారు. రెండో విడతలో 144 చెరువుల పనులు పూర్తయ్యాయని.. జిల్లాలో 526 పరిశ్రమల పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇచ్చామన్నారు. గ్రీన్ ఫార్మాసిటీ, ఇతర పారిశ్రామిక సంస్థల ఏర్పాటు కోసం 7,939 ఎకరాల భూమిని సేకరించామని.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో త్వరలోనే టీ హబ్–2ను నెలకొల్పనున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు. 200 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జిల్లాకే గర్వకారణమన్నారు. జిల్లాను గుడుంబారహిత జిల్లాగా తీర్చిదిద్దుతున్నామని.. రైతులకు మంజూరు చేస్తున్న సబ్సిడీలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయడానికి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకుని విజయవంతంగా పూర్తిచేశామని చెప్పారు. 816 మంది చిన్న సన్నకారు రైతులు సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరించి యాజమాన్య హక్కులు కల్పించినట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పంటనష్టం జరిగిన రైతులకు రూ. 26కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసి ఆదుకున్నామని.. షాద్‌నగర్, శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలను నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ పథకం కింద ఎంపిక చేశామని మహమూద్ అలీ చెప్పారు. ఈ మార్కెట్లలో ఆన్లైన్ ద్వారా క్రయవిక్రయాలు జరిపేందుకు అవసరమైన వసతులు సమకూర్చామన్నారు. మైనార్టీలు, బీసీలకు 9 చొప్పున, ఎస్సీ, ఎస్టీలకు మరో 9 గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. మహిళా సాధికారత కింద జిల్లాలో 2016–17లో 12,950 మహిళా సంఘాలకు రూ. 285.48 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేసినట్టు ఆయన వివరించారు. తెలంగాణ సాధన అనేది తొలిమెట్టు మాత్రమే. అంతటితో తృప్తి చెందితే సరిపోదు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవాలి. అభివృద్ధి పథంలో జిల్లాను నడిపించాలి. ఇందుకు అందరి కృషి అవసరమే కాదు.. సమష్టిగా పని చేయాల్సిన బాధ్యతా ప్రతి ఒక్కరిపై ఉంది’ – డిప్యూటీ సీఎం మహమూద్ అలీ -
గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగరాలి..
సాక్షి, సిటీబ్యూరో: రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబి జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావు మంగళవారం మర్యాద పూర్వకంగా ఉప ముఖ్యమంత్రిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను మహమూద్ అలీ అభినందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంగా ఉంటేనే జీహెచ్ఎంసీపై జెండా ఎగురవేయగలమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలపైనే ఉందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన షాదీ ముబారక్ పథకం పేద ముస్లింలకు వరం లాంటిదని, దీనిపై విసృత ప్రచారం చేయాలన్నారు. ప్రజల్లో మమేకమయ్యేవిధంగా ముందుకు సాగాలని ఉపముఖ్యమంత్రి సూచించారు. -
జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
⇒ రూ. 2 లక్షల వరకు ఆరోగ్య బీమా.. అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ⇒ పాత్రికేయ వృత్తి శిక్షణ కోసం యూనివర్శిటీ ఏర్పాటు ⇒ టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలో మహమూద్ అలీ, హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకప్రాత పోషించిన జర్నలిస్టుల రక్షణ, సంక్షేమం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, హెల్త్‌కార్డులు, కేజీ టూ పీజీ ఉచిత విద్య పథకాలను జర్నలిస్టు కుటుంబాలకు సైతం వర్తింపజేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, విద్యార్థులతో పాటు జర్నలిస్టులు ముఖ్యపాత్ర పోషిం చారని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. జర్నలిస్టులకు మెరుగైన ప్యాకేజీని ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తుండటం వల్లే కొంత ఆలస్యమవుతోందని చెప్పారు. ఆదివారం లళిత కళాతోరణంలో జరిగిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(టీయూడబ్ల్యూజే) ప్రథమ మహాసభలో మంత్రులిద్దరూ పాల్గొని జర్నలిస్టుల సమస్యలపై పలు హామీలిచ్చారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు రూ. 2 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడంతో పాటు రూ. 4 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ గృహాలను నిర్మించి ఇస్తామన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత గృహాలు, పట్టణాల్లో ఒక అంతస్తు(జీ+1) పద్ధతిలో ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ప్రతీ జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేస్తామన్నారు. వృత్తిలో కొనసాగుతూనే నైపుణ్యాల పెంపుదల, ఉన్నత విద్య అభ్యసించాలనుకునే జర్నలిస్టుల కోసం విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలనే ఆలోచన ఉందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డు అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీపీఐఎల్పీ నేత రవీంద్రకుమార్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడమే ఉద్యోగ భద్రతకు అసలు పరిష్కారమని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్‌కార్డులు తదితర అంశాలపై తన అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు. జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వైద్య సదుపాయాలతో హెల్త్ కార్డులు, రాష్ట్ర, జిల్లా స్థాయి కేటగిరీలుగా అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయాలని సిఫారసు చేశామన్నారు. జర్నలిస్టుల వేజ్ బోర్డు సిఫారసులు అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని ఐజేయూ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా కోరారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ నేతలు దేవులపల్లి అమర్, కె.శ్రీనివాసరెడ్డి, ప్రెస్ కౌన్సిల్ స భ్యులు అమర్నాథ్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు నగనూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నల్లి ధర్మారావు, టీఎన్జీవోల అధ్యక్షుడు కె.రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ మహాసభకు తెలంగాణ జిల్లాల నుంచి జర్నలిస్టులు తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ వార్తలు రాసి హత్యకు గురైన జర్నలిస్టు షోయబుల్లాఖాన్ పేరును సభాప్రాంగణానికి పెట్టారు. సభ ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కాగా, జర్నలిస్టుల సాక్షిగా ఈ సభలో టీడీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం సాగింది. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు సంకెళ్లు వేస్తోందని, తెలంగాణ కోసం పోరాడిన జర్నలిస్టులు తమ హక్కుల కోసం ప్రభుత్వం ముందు చేతులు చాచి అడుక్కోవాల్సి రావడం బాధాకరమని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ఆరోపించారు. దీనిపై శాసనసభ అంచనాల కమిటీ చెర్మైన్ సోలిపేట రామలింగారెడ్డితో పాటు తెలంగాణ రచయితల ఫోరం అధ్యక్షులు నందిని సిధారెడ్డి తీవ్ర స్థాయిలో ప్రత్యారోపణలు చేశారు. -
మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం
రెవెన్యూ ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి హామీ ఒక రోజు వేతనాన్ని విరాళంగా {పక టించిన ఉద్యోగ సంఘాలు హైదరాబాద్: వివిధ స్థాయిల్లో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం (ట్రెసా) శనివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘మిషన్ కాకతీయ అవగాహన సదస్సు’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పున ర్నిర్మాణ కార్యక్రమాల్లో అత్యధికంగా శ్రమించింది రెవెన్యూ ఉద్యోగులేనని కితాబిచ్చారు. టీఆర్ఎస్ ప్లీనరీ అనంతరం అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. రెవెన్యూ విభాగం పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులపై అధిక పనిభారం పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ శ్రమిస్తున్నారని చెప్పారు. రెవెన్యూ ఉద్యోగులంతా తమ ఒకరోజు వేతనాన్ని మిషన్ కాకతీయ కార్యక్రమానికి విరాళంగా ఇస్తున్నట్లుగా అంగీకార పత్రాన్ని డిప్యూటీ సీఎంకు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాదరావు, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదనరెడ్డి, ట్రెసా ప్రతినిధులు నారాయణరెడ్డి, నిరంజన్‌రావు, విష్ణుసాగర్, బాలశంకర్, మల్లేశ్ పాల్గొన్నారు. -
త్యాగాల ఫలితమే తెలంగాణ
తెయూ (డిచ్పల్లి) :ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అ న్నారు. విద్యార్థులకు, అన్ని రంగాలవారికి మరింత మేలు జరిగేలా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేతృత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నా రు. తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉర్దూ ఉత్సవాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ భాషకు మరింత ప్రాచుర్యం, ప్రాముఖ్యత లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో పాలకులు ఉర్దూ భాషను నిర్లక్ష్యం చేశారని, తెలంగాణ ప్రభుత్వం ఉర్దూ భాషోత్సవాలను నిర్వహించడం ద్వారా భాషాభివృద్ధిని ప్రోత్సహిస్తోందన్నారు. హిందూ, ముస్లింలు రెండు కళ్ల వంటివారని అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాలలో వందల యేళ్ల నుంచి ఉర్దూ ఒక భాగంగా మారిందన్నారు. ప్రజలు, విద్యార్థులు కోరుకున్న వాటినే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు. వర్సిటీ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. వర్సిటీ అభివృద్ధికి వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించే విషయూన్ని సీఎందృష్టికి తీసుకె ళతానని హామీ ఇచ్చారు. సచార్ కమిటీ నివేదిక ప్రకారం మైనార్టీలు దళితుల కన్నా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం షాదీముబారక్‌తోపాటు ఇతర సమగ్ర ప్రణాళికలు రూ పొందించి అమలు చేస్తోందన్నారు. దే శంలోనే నెంబరు వన్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు అధ్యాకులు, విద్యారు లు కృషి చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయరంగంలో ముందుందని, అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఉర్దూ అకాడ మీ ద్వారా తెయూలో కంప్యూటర్ సెం టర్ ప్రారంభించేలా చర్యలు తీసుకుం టామన్నారు. వక్ఫ్‌బోర్డ్ ఆస్తులను రక్షిస్తాం జిల్లాలో ఉన్న 5,400 ఎకరాల వక్ఫ్ బో ర్డ్ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. డిచ్పల్లి లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పా టు చేస్తే గ్రామీణ ప్రాంత రైతులు, ప్రజ లకు సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సూచించారు. ఉర్దూ అకాడమీ డెరైక్టర్ ఎస్ఏ షుకూర్ మాట్లాడుతూ ప్ర భుత్వం మైనార్టీల సంక్షేమం కోసం కొ త్త కొత్త పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. అనంతరం డిప్యూటీ సీ ఎం మహమూద్ అలీని వర్సిటీ తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ విభాగాధిపతి డాక్టర్ అఖ్తర్ సుల్తానా, అధ్యాపకులు మూసా ఇక్బాల్, గుల్-ఏ-రాణా, అబ్దుల్ ఖవి, ఎంపీపీ దాసరి ఇందిర, టీఆర్ఎస్ మై నార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు తారిఖ్ అన్సారీ, వక్ఫ్‌బోర్డ్ అధ్యక్షుడు జావేద్ అక్రం, వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థు లు పాల్గొన్నారు. తెయూను అభివృద్ధి చేస్తాం తెలంగాణ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీ ఎం మహ్మద్ మహమూద్ అలీ అన్నా రు. నిరుద్యోగ విద్యార్థి, ఇతర విద్యార్థి సంఘాల నేతృత్వంలో జరిగిన అందోళనల నేపథ్యంలో ఆయన వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న నిరుద్యోగ విద్యార్థి జే ఏసీ నాయకులు సంతోష్‌గౌడ్, రాజ్‌కుమార్‌ను డిప్యూటీ సీఎం సభ జరుగుతుండగానే పోలీసులు తెయూ సెమినా ర్ హాల్‌కు తీసుకువచ్చారు. ఈ నేపథ్యం లో విద్యార్థులను కలిసిన రిజిస్ట్రార్ వారి అందోళనను విరమింపజేసి, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించారు. వారు చెప్పిన సమస్యలు, చేసిన సూచనలు, సలహాలు విన్న తర్వాత డిప్యూటీ సీఎం మాట్లాడారు. వర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పన, కళాశాల భవనాలు, హాస్టల్ భవనాల నిర్మాణం, ఇతర సౌకర్యాల కల్పనకు నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలుస్తానని హామీ ఇచ్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వివిధ శాఖాధిప తులతో మాట్లాడి వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు సంతోష్‌గౌడ్, రాజ్‌కుమార్, రమణ, సౌందర్య, రవికుమార్,అనుదీప్, సాయినాథ్, సం తోష్నాయక్, బాలాజీ, వెంకటస్వామి, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు. సమస్యలపై స్పందించి తమతో ప్రత్యేకంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలను త్వరగా పరిష్క రించాలన్నారు. -
కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రం
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పూడూరు: కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు.మంగళవారం మండల పరిధిలోని ప్రైవేటు కార్యక్రమానికి హాజరవడానికి వచ్చిన ఆయనను పూడూరు మండల నాయకులు సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హరీశ్వర్‌రెడ్డి జిల్లాలోనే సీనియర్ నాయకుడని, ఎన్నికల్లో కొన్ని అవాంతరాల వల్ల ఓటమి పాలయ్యారనీ, గెలిస్తే కీలకమైన శాఖ వచ్చేదని తెలిపారు. ఓడినంతమాత్రాన నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందవద్దని.. త్వరలో కీలకమైన పదవి రానుందని అన్నారు. ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఈ నెల 15నుంచి రెండు నెలల పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో తెలంగాణ ఉద్యమం చేపట్టిన చెన్నారెడ్డి ఇందిరాగాంధీ మాటకు తలొగ్గి ఉద్యమాన్ని నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ ఎవరు ఎన్ని నజరానాలు ప్రకటించిన తెలంగాణా రాష్ట్రమే ధ్యేయంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారని అన్నారు. వైద్యులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని కవిత, కేటిఆర్,హరీష్‌రావులకు సూచించినా వారు వెనుకడుగు వేయలేదన్నారు. హిందూముస్లీంలు గంగాయమున నదుల వలే కలిసి పోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడుతోం దని తెలిపారు. 2015 కల్లా రైతులకు 24గంటల విద్యుత్తును అందించేందుకు ప్రణాళికలు రూపొం దిస్తున్నారని తెలిపారు.టీఆర్ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పని గట్టుకుని కొన్ని పత్రికలు తెలంగాణ ప్రభుత్వంపై దుష్పచారం చేస్తున్నాయన్నారు. తెలంగాణ ఏ ఒక్కరిదో కాదు, మనందరి సొత్తన్నారు. ఈ సందర్బంగా మండల నాయకులు మహమూద్ అలీని సన్మానించారు. అనంతరం అక్క డి నుండి హైమద్ఆలంఖాన్ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే సం జీవరా వు, నాయకులు హైదర్అలీ, పూడూరు మండల పార్టీ అధ్యక్షుడు అజీమోద్దీన్,ఎంపీపీ ఆమ్రాది భారతమ్మ, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహ్మారెడ్డి,సర్పంచ్ల సంఘం మండల అధ్యక్ష,ఉపాధ్యక్షులు మధుసూదన్, దయాకర్, నాయకులు మల్లేశం, సత్యనారాయణరెడ్డి, మాణిక్యంగౌడ్, శ్రీనివాస్‌గుప్త, అన్వర్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లోకి క్యూ!
వనపర్తి: వనపర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు వరుస కట్టి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా బుదవారం వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదారాబాద్‌కు వెళ్లి ముఖ్యమంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వనపర్తి పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మునిసిపల్ మాజీ వైస్‌చైర్మన్, ప్రస్తుత కౌన్సిలర్ ఆర్. లోక్‌నాథ్‌రెడ్డి నేతృత్వంలో కాశీంనగర్ సర్పంచ్ గోపాల్‌నాయక్, శ్రీనివాసపురం సర్పంచ్ సురేష్, మాజీ సర్పంచ్ నరసింహా, సూగుర్ సర్పంచ్ రాజశేఖర్‌గౌడ్, శ్రీరంగాపురం ఎంపీటీసీ, కౌన్సిలర్ హెచ్ఎన్ కుమార్, చీర్ల విష్ణుసాగర్ తదితరులు తెలంగాణ భవన్లో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి వారిని డిప్యూటీ సీఎంకు పరిచయం చేశారు. అలాగే పార్టీలో చేరిన వారిలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు రం గం నరసింహా, పూజారి వెంకటస్వామి, మెట్‌పల్లికి చెందిన సత్యానాయక్, బల్రాం, కృష్ణయ్యతో మరో 300మంది ఉన్నా రు. కార్యక్రమంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఉన్నారు.