రెవెన్యూ ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి హామీ
ఒక రోజు వేతనాన్ని విరాళంగా {పక టించిన ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్: వివిధ స్థాయిల్లో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం (ట్రెసా) శనివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘మిషన్ కాకతీయ అవగాహన సదస్సు’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పున ర్నిర్మాణ కార్యక్రమాల్లో అత్యధికంగా శ్రమించింది రెవెన్యూ ఉద్యోగులేనని కితాబిచ్చారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ అనంతరం అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు.
రెవెన్యూ విభాగం పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులపై అధిక పనిభారం పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ శ్రమిస్తున్నారని చెప్పారు. రెవెన్యూ ఉద్యోగులంతా తమ ఒకరోజు వేతనాన్ని మిషన్ కాకతీయ కార్యక్రమానికి విరాళంగా ఇస్తున్నట్లుగా అంగీకార పత్రాన్ని డిప్యూటీ సీఎంకు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాదరావు, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదనరెడ్డి, ట్రెసా ప్రతినిధులు నారాయణరెడ్డి, నిరంజన్‌రావు, విష్ణుసాగర్, బాలశంకర్, మల్లేశ్ పాల్గొన్నారు.
మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం
Published Sun, Apr 19 2015 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM
Advertisement