తెయూ (డిచ్‌పల్లి) :ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అ న్నారు. విద్యార్థులకు, అన్ని రంగాలవారికి మరింత మేలు జరిగేలా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేతృత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నా రు. తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉర్దూ ఉత్సవాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ భాషకు మరింత ప్రాచుర్యం, ప్రాముఖ్యత లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో పాలకులు ఉర్దూ భాషను నిర్లక్ష్యం చేశారని, తెలంగాణ ప్రభుత్వం ఉర్దూ భాషోత్సవాలను నిర్వహించడం ద్వారా భాషాభివృద్ధిని ప్రోత్సహిస్తోందన్నారు. హిందూ, ముస్లింలు రెండు కళ్ల వంటివారని అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాలలో వందల యేళ్ల నుంచి ఉర్దూ ఒక భాగంగా మారిందన్నారు.
ప్రజలు, విద్యార్థులు కోరుకున్న వాటినే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు. వర్సిటీ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. వర్సిటీ అభివృద్ధికి వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించే విషయూన్ని సీఎందృష్టికి తీసుకె ళతానని హామీ ఇచ్చారు. సచార్ కమిటీ నివేదిక ప్రకారం మైనార్టీలు దళితుల కన్నా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం షాదీముబారక్‌తోపాటు ఇతర సమగ్ర ప్రణాళికలు రూ పొందించి అమలు చేస్తోందన్నారు. దే శంలోనే నెంబరు వన్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు అధ్యాకులు, విద్యారు లు కృషి చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయరంగంలో ముందుందని, అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఉర్దూ అకాడ మీ ద్వారా తెయూలో కంప్యూటర్ సెం టర్ ప్రారంభించేలా చర్యలు తీసుకుం టామన్నారు.
వక్ఫ్‌బోర్డ్ ఆస్తులను రక్షిస్తాం
జిల్లాలో ఉన్న 5,400 ఎకరాల వక్ఫ్ బో ర్డ్ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. డిచ్‌పల్లి లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పా టు చేస్తే గ్రామీణ ప్రాంత రైతులు, ప్రజ లకు సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సూచించారు. ఉర్దూ అకాడమీ డెరైక్టర్ ఎస్‌ఏ షుకూర్ మాట్లాడుతూ ప్ర భుత్వం మైనార్టీల సంక్షేమం కోసం కొ త్త కొత్త పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. అనంతరం డిప్యూటీ సీ ఎం మహమూద్ అలీని వర్సిటీ తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ విభాగాధిపతి డాక్టర్ అఖ్తర్ సుల్తానా, అధ్యాపకులు మూసా ఇక్బాల్, గుల్-ఏ-రాణా, అబ్దుల్ ఖవి, ఎంపీపీ దాసరి ఇందిర, టీఆర్‌ఎస్ మై నార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు తారిఖ్ అన్సారీ, వక్ఫ్‌బోర్డ్ అధ్యక్షుడు జావేద్ అక్రం, వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థు లు పాల్గొన్నారు.
తెయూను అభివృద్ధి చేస్తాం
తెలంగాణ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీ ఎం మహ్మద్ మహమూద్ అలీ అన్నా రు. నిరుద్యోగ విద్యార్థి, ఇతర విద్యార్థి సంఘాల నేతృత్వంలో జరిగిన అందోళనల నేపథ్యంలో ఆయన వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న నిరుద్యోగ విద్యార్థి జే ఏసీ నాయకులు సంతోష్‌గౌడ్, రాజ్‌కుమార్‌ను డిప్యూటీ సీఎం సభ జరుగుతుండగానే పోలీసులు తెయూ సెమినా ర్ హాల్‌కు తీసుకువచ్చారు. ఈ నేపథ్యం లో విద్యార్థులను కలిసిన రిజిస్ట్రార్ వారి అందోళనను విరమింపజేసి, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించారు. వారు చెప్పిన సమస్యలు, చేసిన సూచనలు, సలహాలు విన్న తర్వాత డిప్యూటీ సీఎం మాట్లాడారు.
వర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పన, కళాశాల భవనాలు, హాస్టల్ భవనాల నిర్మాణం, ఇతర సౌకర్యాల కల్పనకు నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలుస్తానని హామీ ఇచ్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వివిధ శాఖాధిప తులతో మాట్లాడి వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు సంతోష్‌గౌడ్, రాజ్‌కుమార్, రమణ, సౌందర్య, రవికుమార్,అనుదీప్, సాయినాథ్, సం తోష్‌నాయక్, బాలాజీ, వెంకటస్వామి, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు. సమస్యలపై స్పందించి తమతో ప్రత్యేకంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలను త్వరగా పరిష్క రించాలన్నారు.
త్యాగాల ఫలితమే తెలంగాణ
Published Wed, Feb 25 2015 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement