గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగరాలి.. | mynampally Hanumantharao meets Deputy Chief Minister Mahmood Ali | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగరాలి..

Published Wed, Apr 22 2015 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగరాలి..

గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగరాలి..

సాక్షి, సిటీబ్యూరో: రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబి జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావు  మంగళవారం మర్యాద పూర్వకంగా ఉప ముఖ్యమంత్రిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను మహమూద్ అలీ అభినందించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.  

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంగా ఉంటేనే జీహెచ్‌ఎంసీపై జెండా ఎగురవేయగలమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్ కార్యకర్తలపైనే ఉందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన షాదీ ముబారక్ పథకం పేద ముస్లింలకు వరం లాంటిదని, దీనిపై విసృత ప్రచారం చేయాలన్నారు. ప్రజల్లో మమేకమయ్యేవిధంగా ముందుకు సాగాలని ఉపముఖ్యమంత్రి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement