కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రం
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
పూడూరు: కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు.మంగళవారం మండల పరిధిలోని ప్రైవేటు కార్యక్రమానికి హాజరవడానికి వచ్చిన ఆయనను పూడూరు మండల నాయకులు సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హరీశ్వర్‌రెడ్డి జిల్లాలోనే సీనియర్ నాయకుడని, ఎన్నికల్లో కొన్ని అవాంతరాల వల్ల ఓటమి పాలయ్యారనీ, గెలిస్తే కీలకమైన శాఖ వచ్చేదని తెలిపారు. ఓడినంతమాత్రాన నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందవద్దని.. త్వరలో కీలకమైన పదవి రానుందని అన్నారు.
ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఈ నెల 15నుంచి రెండు నెలల పింఛన్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో తెలంగాణ ఉద్యమం చేపట్టిన చెన్నారెడ్డి ఇందిరాగాంధీ మాటకు తలొగ్గి ఉద్యమాన్ని నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ ఎవరు ఎన్ని నజరానాలు ప్రకటించిన తెలంగాణా రాష్ట్రమే ధ్యేయంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారని అన్నారు. వైద్యులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని కవిత, కేటిఆర్,హరీష్‌రావులకు సూచించినా వారు వెనుకడుగు వేయలేదన్నారు. హిందూముస్లీంలు గంగాయమున నదుల వలే కలిసి పోవాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడుతోం దని తెలిపారు. 2015 కల్లా రైతులకు 24గంటల విద్యుత్తును అందించేందుకు ప్రణాళికలు రూపొం దిస్తున్నారని తెలిపారు.టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పని గట్టుకుని కొన్ని పత్రికలు తెలంగాణ ప్రభుత్వంపై దుష్పచారం చేస్తున్నాయన్నారు. తెలంగాణ ఏ ఒక్కరిదో కాదు, మనందరి సొత్తన్నారు. ఈ సందర్బంగా మండల నాయకులు మహమూద్ అలీని సన్మానించారు.
అనంతరం అక్క డి నుండి హైమద్‌ఆలంఖాన్ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే సం జీవరా వు, నాయకులు హైదర్‌అలీ, పూడూరు మండల పార్టీ అధ్యక్షుడు అజీమోద్దీన్,ఎంపీపీ ఆమ్రాది భారతమ్మ, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహ్మారెడ్డి,సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్ష,ఉపాధ్యక్షులు మధుసూదన్, దయాకర్, నాయకులు మల్లేశం, సత్యనారాయణరెడ్డి, మాణిక్యంగౌడ్, శ్రీనివాస్‌గుప్త, అన్వర్ పాల్గొన్నారు.