Dermatologist
-
వనపర్తిలో ఓ డాక్టర్ మౌనపోరాటం..
వనపర్తి: వనపర్తికి చెందిన ఒక మహిళా డాక్టర్ పట్ల ఆమె భర్త అమానుష వైఖరితో వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ మౌనపోరాటం చేస్తున్నారు. ఈ మేరకు సంబంధిత మంత్రి కల్పించుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ వనపర్తి జిలా కలెక్టరుకు లేఖ రాశారు. డా. లక్ష్మి కుమారి వనపర్తిలో ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తోన్న చర్మవ్యాధి నిపుణురాలు. ఆమె భర్త ఎం.ఎన్. ప్రమోద్ కుమార్ గృహ నిర్వహణలో ఏమాత్రం సహాయపడకపోగా తనను చాలాకాలంగా వేధిస్తున్నారని, 23 ఏళ్లుగా అతనితో నరకాన్ని అనుభవిస్తున్నానని ఆమె లేఖలో రాశారు. చిన్న క్లినిక్ నడుపుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నానని ఇప్పుడైతే భర్త వేధింపులు మరీ ఎక్కువయ్యాయని.. శారీరకంగానూ, మానసికంగానూ, మాటలతోనూ ఇబ్బంది పెడుతూ క్లినిక్ మూసివేయాలని ఒత్తిడి చేస్తూ నానా హింసలకు గురిచేస్తూ శాడిస్టులా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. నా పని నన్ను చేసుకోనీయకుండా ఇంట్లోనే ఉంచి బంధించడం, క్లినిక్ కు తాళాలు వేసేయడం వంటి పిచ్చి పనులు చేస్తున్నాడు. దీంతో నేను పేషేంట్ లకు క్లినిక్ బయట రోడ్డు మీదే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తోంది. దయచేసి సంబంధిత మంత్రిగారు కల్పించుకుని నన్ను, నా బిడ్డను కాపాడాలని కోరుతూ మౌనపోరాటం చేస్తున్నాను. ఇంతవరకు జిల్లా అధికారులు ఎవ్వరూ నా క్లినిక్ విషయమై నాకు ఎలాంటి అభయం ఇవ్వలేదని తెలిపారు. ఇది కూడా చదవండి: Karimnagar: గుండెపోటు.. వ్యక్తి ప్రాణాలు బలిగొన్న రైల్వేగేటు.. -
ఈరిస్కు.. రెడ్డీస్ డెర్మటాలజీ బ్రాండ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో ఉన్న ఈరిస్ లైఫ్‌సైన్సెస్ తాజాగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నుంచి తొమ్మిది రకాల డెర్మటాలజీ బ్రాండ్స్‌ను దక్కించుకుంది. డీల్ విలువ రూ.275 కోట్లు. చర్మ వ్యాధుల సంబంధ ఔషధ రంగంలో డీల్ తదనంతరం ఈరిస్ 7 శాతం వాటాతో మార్కె ట్లో మూడవ స్థానానికి ఎగబాకనుంది. 2022 మే నెలలో రూ.650 కోట్లతో ఓక్నెట్ హెల్త్‌కేర్‌ను చేజిక్కించుకోవడం ద్వారా డెర్మటాలజీ విభాగంలోకి ఈరిస్ ప్రవేశించింది. 2023 జనవరిలో గ్లెన్‌మార్క్ నుంచి తొమ్మిది డెర్మటాలజీ బ్రాండ్స్‌ను రూ.340 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. చర్మ వ్యాధుల సంబంధ ఔషధ విభాగాన్ని పటిష్టం చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొనుగోళ్లకు రూ.1,265 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. -
పిల్లల్లో రోజూ 80 – 100 వరకు తల వెంట్రుకలు రాలుతుంటే ఓసారి...
చిన్నపిల్లల్లో అంటే ఐదేళ్లు మొదలుకొని... ఎనిమిది, తొమ్మిదేళ్ల పిల్లల్లో జుట్టు రాలిపోవడం కాస్తంత తక్కువే అయినా మరీ అంత అరుదేమీ కాదు. నిజానికి ఆ వయసులో క్రమంగా జుట్టు దట్టమమవుతూ ఉంటుంది. అలాంటి వయసులోనూ పిల్లల్లో జుట్టు రాలుతుండటానికి కారణాలు, వాటి నివారణ మార్గాలు తెలిపే కథనమిది. జుట్టు రాలడం అనే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘టీలోజెన్ ఎఫ్లువియమ్’ అంటారు. పిల్లల్లో ఇలా జుట్టు రాలడం అనేది నిర్దిష్టంగా ఒక భాగంలో (లోకల్‌గా) జరగవచ్చు దీన్ని ‘అలోపేషియా ఏరేటా’ అంటారు. నిజానికి వెంట్రుకలు పాటించే సైకిల్ కారణంగా జుట్టులో కాస్త భాగం నిద్రాణంలోకి వెళ్లడం, మరికొంత రాలిపోవడం రోజూ సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇలా పిల్లల్లో రోజూ 30 నుంచి 40 వరకు వెంట్రుకలు రాలిపోతూ ఉంటే... దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అంతకు మించి అంటే 80 – 100 వరకు వెంట్రుకలు రాలుతుంటే మాత్రం దాన్ని కాస్త సీరియస్‌గా జుట్టురాలడం (సిగ్నిఫికెంట్ హెయిర్ లాస్)లాగే పరిగణించాలి. సాధారణ కారణాలు : ►అన్నిటికంటే పిల్లల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం పౌష్టిక ఆహార (ప్రోటిన్ మాల్న్యూట్రిషన్, ఐరన్, జింక్‌తో పాటు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్) లోపాల వల్ల కావచ్చు. ఇదే కారణమైతే పిల్లలకు ఐరన్, జింక్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే మంచి సమతులాహారంతో పరిస్థితి చక్కబడుతుంది. ►అలా కాకుండా కొన్ని మెకానికల్ సమస్యల (అంటే... జడలు బిగుతుగా వేయడం, బిగుతైన క్లిప్పులు పెట్టడం)వంటి కారణాలతోనూ జుట్టు రాలవచ్చు. ఆ వయసు పిల్లల్లో మరీ బిగుతుగా కాకుండా కాస్త తేలిగ్గా ఉండేలా జడలల్లడం వల్ల ఈ సమస్యని చాలా తేలిగ్గా నివారించవచ్చు. ►కొంతమంది పిల్లల్లో జ్వరాలు (డెంగీ, మలేరియా, కోవిడ్ వంటివి) వచ్చి తగ్గాక కూడా మూడు నుంచి నాలుగు నెలల తర్వాత జుట్టు రాలడం కూడా జరగవచ్చు. దీన్ని పోస్ట్ వైరల్ ఫీవర్ ఎఫెక్ట్‌గా పరిగణించాలి. కొన్ని నిర్దిష్ట కారణాలు ►పైన పేర్కొన్న సాధారణ కారణాలు మినహాయిస్తే... చిన్న వయసు పిల్లల్లో జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు పుట్టుకతోనే వచ్చే కారణాలు (కంజెనిటల్ కాజెస్), ఇన్ఫెక్షన్లు (అంటే... కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పయోడెర్మా లాంటివి), తలలో పేలు పడటం, ఇతర అనారోగ్యల కారణంగా మందులు వాడుతున్నప్పుడు అవి వారికి సరిపడక కూడా జుట్టు రాలిపోవచ్చు. ►ఇక మరికొందరు పిల్లల్లో హార్మోన్ల అసమతౌల్యత (హైపోథైరాయిడ్, పారాథైరాయిడ్, చైల్డ్ డయాబెటిస్) లాంటి సమస్య వల్ల కూడా జుట్టు రాలవచ్చు. వీటిని పక్కన పెడితే పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు. ఇలా పిల్లల్లో మానసిక ఒత్తిడి వల్ల కూడా జట్టు రాలిపోవచ్చు. ఏం చేయాలి? ►మంచి పౌష్టికాహారం ఇవ్వడం, పిల్లలు బాగా ఆడుకునేలా చూస్తూ... మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండేలా చేయడం వంటి సాధారణ చర్యలతోనూ సమస్య చక్కబడకపోతే, అప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. -డాక్టర్ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ చదవండి: Unwanted Hair: పై పెదవి మీద, చుబుకం కింద డార్క్ హెయిర్.. పీసీఓఎస్ వల్లేనా? పరిష్కారం? రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే.. -
డాక్టర్ నీలిమపై ఎందుకంత ప్రేమ?
అనంతపురం: అనంతపురం మెడికల్ కళాశాల డెర్మటాలజీ విభాగంలో వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న చల్లా నీలిమ బదిలీ ఉత్తర్వుల అమలులో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలంటూ ఆమెను రిలీవ్ చేయడం లేదు. గత నెల 17న జరిగిన బదిలీల్లో చల్లా నీలిమను విశాఖపట్నానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మళ్లీ ఆమెకు అందించిన ఉత్తర్వులను రద్దు చేసి, తిరిగి అనంతపురానికి కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి అనంతపురంలో డెర్మటాలజీ పోస్టు గత నెల 20న ఖాళీ కాగా.. ఇదే పోస్టులో నీలిమను నియమిస్తూ గత నెల 17వ తేదీనే ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలా నియమిస్తారంటూ అర్హులైన వైద్యులు విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఉన్నతాధికారులను ప్రశ్నించారు. దీంతో ఆమెకు అందించిన ఉత్తర్వులను రద్దు చేశారు. అనంతపురం మెడికల్ కళాశాల నుంచి వెంటనే రిలీవ్ చేయాలని గత నెల 27న డీఎంఈ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: (అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం) కానీ ఆమెను అనంతపురం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మైరెడ్డి నీరజ రిలీవ్ చేయడం లేదు. దీని వెనుక మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా... నీలిమను రిలీవ్ చేయొద్దని ఉన్నతాధికారులు మౌఖికంగా తెలిపారని సమాధానమిచ్చారు. లిఖిత పూర్వక ఉత్తర్వులను అమలు చేయాల్సిన ప్రిన్సిపాల్.. మౌఖిక ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
చిన్నారుల అరచేతుల్లో చర్మం ఊడుతోందా?
కొందరు చిన్నారుల అరచేతులు, అరికాళ్లలో పొట్టు ఒలిచిన విధంగా చర్మం ఊడి వస్తుంటుంది. అంతేకాదు విపరీతమైన దురదతోనూ బాధపడుతుంటారు. ఇందుకు ప్రధాన కారణం ఎగ్జిమా. ఇలా చర్మం ఊడిపోతూ, దురదల వంటి లక్షణాలు ఎగ్జిమాతో పాటు హైపర్కెరటోటిక్ పాల్మార్ ఎగ్జిమా, కెరటోలైసిస్ ఎక్స్ఫోలియేటా, ఎస్.ఎస్.ఎస్. సిండ్రోమ్, కన్స్టిట్యూషనల్ డిసీజెస్, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కనిపిస్తుంటాయి. తగినంత పోషకాహారం దొరకని పిల్లల్లో విటమిన్ లోపాల వల్ల కూడా అరచేతుల్లో, అరికాళ్లలో దురదలు రావడంతో పాటు చర్మం పగలడం, ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక పెద్దల్లో సైతం సోరియాసిస్, స్కార్లెట్ ఫీవర్ వంటి కారణంగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చి తగ్గిన తర్వాత కొందరు పిల్లల్లో ఈ లక్షణాలే కనిపిస్తుంటాయి. కాకపోతే మొదట్లో చాలా తీవ్రంగా కనిపించినా క్రమక్రమంగా తగ్గిపోతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఇలా అరచేతులు, అరికాళ్లలో సెకండరీ ఇన్ఫెక్షన్లా వచ్చి... ఇవే లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ‘పోస్ట్ వైరల్ ఎగ్జింథిమా’ అంటారు. ఇది రెండు నుంచి మూడు వారాల్లో పూర్తిగా తగ్గిపోతుంది. చికిత్స: పిల్లల అరచేతులు, అరికాళ్ల అంచుల్లో చర్మం ఊడుతూ... దురదలు వస్తూ తీవ్రంగా అనిపించే ఈ సమస్య... దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. చాలావరకు ప్రమాదకరం కూడా కాదు. ఉపశమనం కోసం, చేతులు తేమగా ఉంచుకోవడం కోసం మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాయవచ్చు. జింక్ బేస్డ్ క్రీమ్స్ రాయడం వల్ల కూడా చాలావరకు ప్రయోజనం ఉంటుంది. లక్షణాలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం పిల్లల డాక్టర్ / డర్మటాలజిస్ట్ సలహా మేరకు తక్కువ మోతాదు స్టెరాయిడ్స్ (మైల్డ్ స్టెరాయిడ్స్) క్రీమ్ రావడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ పైన పేర్కొన్న సూచనలు పాటించాక కూడా సమస్య తగ్గకపోయినా, చేతులు, కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చినా, లక్షణాలు మరీ ఎక్కువవుతున్నా డెర్మటాలజిస్ట్‌ను కలిసి తగు సలహా, చికిత్స తీసుకోవాలి. -
పులిపిరులు ఉన్న వాళ్లు వాడిన టవల్, సబ్బు వాడుతున్నారా? అయితే..
పులిపిరులు ఒకసారి వచ్చాయంటే వాటిని వదిలించుకోవడం చిన్నపని కాదు. మొటిమల్లాగ వాటంతట అవే వచ్చి అవే రాలిపోయే గుణం వీటికి ఉండదు. చర్మవైద్య నిపుణులను సంప్రదించి వైద్యం చేయించుకోవాల్సిందే. ఇవి ఒక ఇంట్లో ఎక్కువ మందిలో కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పులిపిరులు జన్యుపరమైన కారణాలతో వస్తాయనుకోవడం కూడా పరిపాటి. నిజానికి అది అవాస్తవం. పులిపిరులు ఉన్న వాళ్లు వాడిన టవల్‌ను, సబ్బును ఇతరులు వాడినప్పుడు వాళ్లకు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే పులిపిరి ఉన్న వ్యక్తి తగలడం ద్వారా ఒకరి చర్మం మరొకరి చర్మాన్ని తాకడం వల్ల కూడా వ్యాప్తి చెందుతాయి. మరో ముఖ్యమైన సంగతి ఏమిటంటే.. పులిపిరి ఉన్న వ్యక్తి టవల్‌తో ఒళ్లు తుడుచుకునేటప్పుడు కూడా జాగ్రత్త పాటించాలి. పులిపిరి ఉన్న చోట తుడిచిన తర్వాత అదే టవల్ దేహంలో మరొక చోట చర్మానికి తగిలినప్పుడు అక్కడ కూడా పులిపిరి వస్తుంటుంది. సర్జరీ ఎప్పుడు? పులిపిరి తీరును బట్టి తొలగించే విధానం కూడా మారుతుంది. చర్మం పెరగడం వల్ల ఏర్పడే పులిపిరిని స్కిన్ గ్రోత్ వార్ట్ అంటారు. వీటిని కాస్మటిక్ సర్జన్ తొలగిస్తారు. వాతావరణ కాలుష్యం చర్మం మీద చూపించే దుష్ప్రభావం వల్ల ఏర్పడే పులిపిర్లను వైరల్ వార్ట్స్ అంటారు. వీటికి డెర్మటాలజిస్టులు వైద్యం చేయాల్సి ఉంటుంది. చర్మం మీద సిస్ట్ ఏర్పడడం, కొవ్వు చేరడం, పుట్టుమచ్చ సైజు పెరుగుతూ పులిపిరిగా మారడం వంటి లక్షణాలను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. -
కొన్ని పుట్టుమచ్చలు క్యాన్సర్స్‌గా మారే అవకాశం!
ప్రతి మనిషికీ పుట్టుమచ్చలు ఉండనే ఉంటాయి. సాధారణంగా పుట్టుమచ్చలేవీ ప్రమాదకరం కాదు. అయితే కొన్నిసార్లు అవి కూడా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంటుంది. అలా అవి ఎప్పుడు ప్రమాదకరంగా మారతాయి అనే విషయంలో ఓ కొండగుర్తు ఉంది. అదే... పుట్టుమచ్చల తాలూకు ‘ఏ, బీ, సీ, డీ’లు. వాటి గురించి తెలుసుకుందాం. ►ఏ అంటే ఎసిమెట్రీ – చర్మంపైన మచ్చ సౌష్ఠవాన్ని (సిమెట్రీని) కోల్పోవడం. ►బీ అంటే బార్డర్ – మచ్చ అంచులు మారడం. అవి ఉబ్బెత్తూగా ఉండటం. ►సీ అంటే కలర్ వేరియేషన్ – మునుపు ఉన్న రంగు మారడం. ►డీ అంటే డయామీటర్ – దాని వ్యాసం ఆరు మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే అలాంటి కొన్ని పుట్టుమచ్చలు క్యాన్సర్స్‌గా మారే అవకాశాలు ఎక్కువ. అంటే పై ఏ, బీ, సీ, డీల జాగ్రత్తలను గమనించి ఆ మేరకు తేడాలుంటే వెంటనే డాక్టర్ / డర్మటాలజిస్ట్‌ను కలవాలి. -
సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై తాజాగా ఒక షాకింగ్ వీడియో అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా సుశాంత్ మరణానికి కారణం ఆత్మహత్య కాదు హత్య అని చెబుతున్న ఒక వీడియోను షేర్ చేశారు. దీనిపై తన వాదనలకు మద్దతుగా ఈ వీడియోలో వివరించారు. ముఖ్యంగా సుశాంత్ ముఖంపై, ఇతర ప్రదేశాల్లో గాయాల గురించి వివరించారు. అలాగే ఉరి వేసుకున్నపుడు బాధితుడి శరీరంపై మార్పులను గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. దీంతో సుశాంత్ ఆత్మహత్యపై ఇప్పటికే వ్యక్తమవుతున్నఅనుమానాలకు తోడు తాజా వీడియో ద్వారా మరింత బలం చేకూరుతోందన్న వాదన వినిపిస్తోంది. (‘సుశాంత్ హత్యకు గురయ్యారు’) మరోవైపు సుశాంత్ ది ఆత్మహత్యకాదు కచ్చితంగా హత్యే అంటూ సంచలనం రేపిన మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామి ఈ ట్వీట్ ను రీట్వీట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. (సుశాంత్ కేసు : మరో వివాదం) Shocking relevations made on Sushant’s case! PS: Sensitive Content. pic.twitter.com/r0orseM72b — Dr.Minakshi Mishra (@savethesaviours) August 2, 2020 -
ముఖంలోనే జబ్బుల లక్షణాలు
సాక్షి, న్యూఢిల్లీ : ముఖారవిందానికి అధిక ప్రాధాన్యతనిచ్చే మహిళలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవడమే కాకుండా ముఖానికి వికారంగా మొటిమలు పెరిగిపోతున్నాయంటూ స్కిన్ స్పెషలిస్టుల దగ్గరికి పరిగెత్తుతున్న మహిళల సంఖ్య కూడా పెరిగిపోవడంతో ఇటీవల డెర్మటాలజిస్టుల సంఖ్య కూడా ఏకంగా 200 శాతానికి పెరిగింది. ముఖాన మొటిమలుగానీ, గాయం లాంటి మడతలుగానీ ఊరికే రావట. శరీరంలోని అంతరావయాల్లో కలిగే మార్పులు లేదా లోపాలను ఎత్తిచూపడం కోసం అవి వస్తాయట. ఈ విషయాన్ని చైనా ఆయుర్వేద వైద్యులు ‘ఫేస్ మ్యాపింగ్’ ద్వారా ఎప్పుడో తేల్చి చెప్పారు. కళ్లు పసుపు పచ్చగా మారడాన్ని చూసి ‘జాండిస్’ జబ్బు ఉన్నట్లు వైద్యులు నిర్ధారిస్తున్న విషయం కూడా మనకు తెల్సిందే. అలాగే కుడి బుగ్గ వద్ద చీలినట్లయితే ఊపిరి తిత్తులకు సంబంధించి ఏదో సమస్య ఉన్నట్లు లెక్కట. అలాగే గుండె గురించి ముక్కు, హార్మోన్ల గురించి గడ్డం చెబుతుందట. చైనా ఆయుర్వేద వైద్యుల ఈ నమ్మకాలు నిజమేనని న్యూయార్క్‌కు చెందిన డ్యాన్ హుసు కూడా నిర్ధారిస్తున్నారు. మన ముఖంలోని ప్రతిభాగం మన శరీరంలోని ఒక్కో అవయవానికి ప్రాతినిథ్యం వహిస్తాయని ఆయన చెప్పారు. 1. కనుబొమ్మలుపైన: మొటిమలు వస్తే గాల్ బ్లాడర్, కాలేయానికి సంబంధించిన సమస్య ఉన్నట్లు లెక్క. కొవ్వు పదార్థాలు, శుద్ధి చేసిన ఆహారం తగ్గిస్తే సమస్య పరిష్కారం అవుతుందని డాక్టర్ డ్యాన్ సూచించారు. 2. రెండు కనుబొమ్మల మధ్య: మొటిమలు వస్తే ఎక్కువగా మద్యం, ధూమపానం సేవిస్తున్నట్లు సూచనట. 3. ముక్కుమీద మొటిమలు వస్తే: హృదయం, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. అంటే ఉప్పు, మసాలా ఆహార పదార్థాలకు దూరంగా ఉండమే కాకుండా బీ విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు. 4. ఇక ఎడమ బుగ్గ నేరుగా కాలేయానికి ప్రాతినిధ్యం వహిస్తుందట. అక్కడ మొటిమలు వస్తే చల్లటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలట. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలట. 5. ఇక నోరు మనలోని జీర్ణ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుందట. నోటి దగ్గర మొటిమలు లేదా కురుపులు కనిపిస్తే ఫైబర్, కూర గాయలు ఎక్కువగా తీసుకోవాలట. 6. ముఖం మీది చర్మం శీరరంలోని హార్మోన్లను సూచిస్తుందట. ఒమెగా 3 తీసుకుంటే సమతౌల్యం అవుతాయట. చైనా ఆయుర్వేద వైద్యులు ముఖంలోని మార్పులనుబట్టి శరీరంలోని లోపాలను లేదా జబ్బులను చెప్పి ఉండవచ్చు. న్యూయార్క్‌లోని ఈ డాక్టర్ మాత్రం శరీరంలోని లోపాల వల్ల మొటిమలు వస్తాయని, వాటిని ఎలా నివారించవచ్చో సూచిస్తున్నారు. -
జుట్టుపై పట్టు!
మనమేమీ పెద్దగా ప్రయాస పడకుండా, శ్రమపడకుండా, ఖర్చు పెట్టకుండా పెద్ద దాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉపయోగించే నానుడి ‘కొండకు వెంట్రుకను కట్టాం. వస్తే కొండ... పోతే వెంట్రుక’. ఈ మాట బట్టతల ఉన్నవారు రాసి ఉండరని మా సందేహం. అసలు వెంట్రుకలంటే ఆఫ్టరాల్ అని కొట్టిపారేసే విషయాలే కావు. వాటి కోసం ఒక్కొక్కరు ఎంత క్షోభపడుతుంటారో... అవి రాలిపోతున్నవారికే తెలుస్తుంది. అలాంటి జుట్టుకు హాని చేసే అంశాలు, వాటి నుంచి కురులను కాపాడుకునే పద్ధతులివి... విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్, వాహనాల నుంచి పెద్ద ఎత్తున వెలువడుతున్న పొగ వంటి కాలుష్యాలతో పాటు గాలిలో చెల్లా చెదురై ఉండే ధూళి కణాలు (సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్)... ఇవన్నీ తొలుత చర్మానికి హాని చేస్తున్నాయి. దాంతో చర్మంపై నాటుకుని ఉండే వెంట్రుకలూ వీటి ప్రభావానికి గురవుతున్నాయి. ఈ కాలుష్యాలు మేనిచర్మాన్ని అలర్జీకి గురిచేస్తాయి. ఆ అలర్జీలు వెంట్రుకలపై ప్రభావాన్ని చూపుతుంటాయి. మన చర్మంపై నిత్యం తేమ ఉంటుంది. కానీ కాలుష్యాల వల్ల ఆ తేమ కాస్తా పొడిబారిపోయి చర్మం ఎండిపోయినట్లుగా, పగుళ్లుబారినట్లుగా (స్కేలీ)గా అవుతుంది. ఒక్కోసారి కాలుష్యాల ప్రభావం తీవ్రంగా ఉంటే చర్మం ఎర్రబారడం, దురదలు రావడం కూడా ఉంటుంది. ఈ కాలుష్య ప్రభావానికి చర్మం ఎంతగా గురవుతుందో, వెంట్రుకలూ అంతే గురవుతాయి. వెంట్రుకలు రాలిపోవడం అన్నది కాలుష్యం వల్ల జరిగే చాలా సాధారణ ప్రక్రియ. అందుకే ఇలా వెంట్రుకలు రాలిపోవడం అన్నది నగరీకరణ, పారీశ్రామికీకరణ ఎక్కువగా ఉన్నచోట్ల చాలా ఎక్కువగా కనిపిస్తుండటం మన అనుభవంలోకి వచ్చే విషయమే. కాలుష్యం వల్ల వెంట్రుక బలహీనపడుతుంది. ఫలితంగా అది తేలిగ్గా తెగిపోతుంది. వెంట్రుకకు సహజంగా ఉండే మెరుపు తగ్గుతుంది. ఇక దీనికి ఈ వేసవి లాంటి సీజన్లలో వాతావరణంలోని ఉష్ణోగ్రత కూడా తోడైతే శరీరానికి అవసరమైన పోషకాలు అందడం తగ్గి ఆ ప్రభావం వెంట్రుక మీద కూడా పడుతుంది. పైగా ఈ వేసవికాలంలో శరీరంలోని లవణాలు, పోషకాలు చెమటల రూపంలో బయటకు వెళ్లిపోతుంటాయి. దాంతో వెంట్రుకలకు అందాల్సిన పోషకాలు, ఖనిజలవణాలు వంటివి వెంట్రుకలకు అందడం తగ్గిపోతుంది. పోషకాలు అందకపోవడంతో కురుల మెరుపు, నిగారింపు తగ్గిపోతాయి. దాంతో జుట్టు చింపిరిగా మారుతుంది. తేలిగ్గా విరిగి (తెగి-ఫ్రాజైల్)పోయేలా వెంట్రుక నిర్మాణంలో మార్పులు వస్తాయి. కాలుష్యాల వల్ల చుండ్రు పెరిగే అవకాశాలతో... దుమ్మూధూళి వల్ల జుట్టు తేలిగ్గా చింపిరిగా మారడంతో పాటు మాడుపైన కొన్ని దుష్పరిణామాలు రావచ్చు. ఫలితంగా చుండ్రు వంటివి పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే కాలుష్యంతో చర్మంపై అలర్జీ పెరిగి, మాడుపైనున్న చర్మం పొట్టుగా (పొలుసులుగా) రాలే సమయంలో గోళ్లతో గీరినప్పుడు అది గోళ్లలో నల్లగా కనిపిస్తుంటుంది. వీటన్నింటి సంయుక్త ప్రభావాల వల్ల వెంట్రుకలు తేలిగ్గా రాలడం వంటివి జరుగుతాయి. మహిళల్లో గర్భధారణ తర్వాత: చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు రాలి ఎక్కువగా పలచబారిపోతుంది. దీనికి వారు అనుభవించే శారీరక ఒత్తిడి కూడా ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా పోవడం కూడా మరో కారణం. తగినంత ఐరన్ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్లు జుట్టుకు అందే విధంగా చూడటం వల్ల దీన్ని అరికట్టవచ్చు. శారీరక ఒత్తిడితోనూ: నిత్యం ఉండే శారీరక ఒత్తిడులు లేదా తీవ్రంగా జబ్బు పడటం వంటివ అంశాలు జుట్టు రాలిపోయేలా చేస్తాయి. దీన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. కానీ ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. జుట్టును రాల్చే కొన్ని రకాల మందులు రకరకాల రుగ్మతలకు మందులు వాడే మందులు కొందరిలో జుట్టు రాల్చడం మామూలే. ఉదా: మొటిమల మందులు, కొన్ని యాంటీబయాటిక్స్ యాంటీ డిప్రెసెంట్స్ నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు కీమోథెరపీ మందులు. మూర్చ చికిత్సలో వాడే ఎపిలెప్సీ మందులు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్, ఇంటర్‌ఫెరాన్స్, వేగంగా మారిపోయే మూడ్స్‌ను నియంత్రించడానికి వాడే మూడ్ స్టెబిలైజేషన్ మందులు, నొప్పినివారణకు వాడే ఎన్ఎస్ఏఐడీ మందులు, స్టెరాయిడ్స్, థైరాయిడ్ మందులు... ఇవన్నీ జుట్టుపై ప్రభావం చూపేవే. ఇలా రాలే జుట్టును అరికట్టడం ఎలాగంటే... సాధారణంగా మందులు వాడటం మానేయగానే జుట్టు మళ్లీ రావచ్చు. జుట్టు రాలడం విపరీతంగా ఉంటే ప్రత్యామ్నాయ మందులు వాడటం ద్వారా కీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం ద్వారా. ఈ ప్రక్రియలో కీమోథెరపీ ఇచ్చే ముందర... ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్‌తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్‌లోకి అంతగా ప్రవేశించదు. ఇలా చల్లబరిచే ప్రక్రియ హెయిర్ ఫాలికిల్‌ను కాస్త నెమ్మదించేలా చేసి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. డాక్టర్ మేఘనారెడ్డి కె. డర్మటాలజిస్ట్, ఒలీవా అడ్వాన్స్డ్ స్కిన్ - హెయిర్ క్లినిక్,హైదరాబాద్ వెంట్రుకలను కాపాడుకునే సాధారణ పద్ధతులు... కాలుష్యాలైన పొగ, దుమ్ము, ధూళి నేరుగా తాకకుండా సాధ్యమైనంత వరకు చర్మం కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. అంటే ముఖం, చేతులను రక్షించుకోడానికి స్కార్ఫ్, గ్లవ్జ్ వంటివి తొడుక్కోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆకుపచ్చని కూరలు, తాజా పళ్లు, విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్, జింక్ పాళ్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. రోజూ రాత్రివేళ కూడా చర్మం, వెంట్రుకలు శుభ్రం అయ్యేలా స్నానం చేయాలి. క్రమం తప్పకుండా జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అయితే జుట్టును మరీ ఎక్కువగా కడగటం కూడా మంచిదికాదని గుర్తుంచుకోవాలి. అలర్జెన్స్ నేరుగా వెంట్రుకలకు తాకకుండా స్కార్ఫ్ కట్టుకోవడం, హ్యాట్ పెట్టుకోవడం చేయాలి. చుండ్రు సమస్య ఉంటే కీటోకెనజాల్ లేదా సైక్లోపిరోగ్సాలమైన్ ఉండే షాంపూలతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి వెంట్రుక చివర్లు చిట్లిపోకుండా ఉండేలా ప్రతి ఆరువారాలకు ఓమారు జుట్టును ట్రిమ్ చేసుకోవాలి. మీరు రంగు వేసుకునేవారైతే అది మీకు సరిపడుతోందా లేదా అన్నది ముందుగానే పరిశీలించుకోవాలి. -
ఆన్లైన్ వైద్యం!
సాంకేతిక వైద్యం చర్మ సమస్య వేధిస్తోందా? డాక్టర్‌ను సంప్రదించేటంత వెసులుబాటు లేనంత పని ఒత్తిడిలో ఉన్నారా? అయితే చేతిలో సెల్‌ఫోన్‌కి పని చెప్పడమే. ర్యాష్, ఎగ్జిమా వంటి ఏ రకమైన చర్య సమస్య అయినా సరే ఫొటో తీసి ఆ ఫొటోని చర్మవ్యాధి నిపుణులకు పంపించాలి. డెర్మటాలజిస్టు (చర్మవ్యాధి నిపుణులు) ఆ ఫొటో ఆధారంగా వ్యాధిని నిర్ధారించి చికిత్సను సూచిస్తారు. మొబైల్ ఫోన్లో చిన్న మెసేజ్ ద్వారా ప్రిస్కిప్షన్ పంపిస్తారు. ఆ మెసేజ్‌ని మందుల దుకాణంలో చూపించి కొనుక్కుని వాడడమే. తప్పని సరిగా స్వయంగా చూసి కానీ నిర్ధారించలేని రుగ్మత అయితే వైద్యులు అదే విషయాన్ని తెలియచేసి సంప్రదించాల్సిన సమయాన్ని(అపాయింట్మెంట్) తెలియచేస్తారు. అంతా బాగానే ఉంది కానీ ఇలా వైద్యం చేస్తూ పోతే డాక్టర్‌కు ఫీజు అందేది ఎలాగంటారా? ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయడమే. అమెరికాలో ఈ విధానంలో వైద్యం అందుబాటులోకి వచ్చేసింది. అమెరికా నుంచి దత్తత చేసుకునే అన్ని అంశాల్లాగానే దీనిని కూడా మనదేశంలో త్వరగానే స్వీకరించవచ్చు. ఇంతకీ ఇటీవల ఒక అధ్యయనంలో ఓ కొత్త విషయం తెలిసింది. ఎటోపిక్ డెర్మటైటిస్ (ఎగ్జిమా) వ్యాధి ఎక్కువ కావడానికి కారణం గంటల కొద్దీ కంప్యూటర్ ముందు, డిజిటల్ కెమెరాల ముందు గడపడమేనట.