కొన్ని పుట్టుమచ్చలు క్యాన్సర్స్‌గా మారే అవకాశం!  | Moles On Human Body Some Interesting Facts | Sakshi
Sakshi News home page

పుట్టుమచ్చలా...  ఈ ‘ఏ, బీ, సీ, డీ’లు గుర్తుంచుకోండి! 

Apr 5 2021 4:31 PM | Updated on Apr 5 2021 4:40 PM

Moles On Human Body Some Interesting Facts - Sakshi

కొన్ని పుట్టుమచ్చలు క్యాన్సర్స్‌గా మారే అవకాశాలు ఎక్కువ.

ప్రతి మనిషికీ పుట్టుమచ్చలు ఉండనే ఉంటాయి. సాధారణంగా పుట్టుమచ్చలేవీ ప్రమాదకరం కాదు. అయితే కొన్నిసార్లు అవి కూడా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంటుంది. అలా అవి ఎప్పుడు ప్రమాదకరంగా మారతాయి అనే విషయంలో ఓ కొండగుర్తు ఉంది. అదే... పుట్టుమచ్చల తాలూకు ‘ఏ, బీ, సీ, డీ’లు. వాటి గురించి తెలుసుకుందాం.

ఏ అంటే ఎసిమెట్రీ – చర్మంపైన మచ్చ సౌష్ఠవాన్ని (సిమెట్రీని) కోల్పోవడం. 
బీ అంటే బార్డర్‌ – మచ్చ అంచులు మారడం. అవి ఉబ్బెత్తూగా ఉండటం. 
సీ అంటే కలర్‌ వేరియేషన్‌ – మునుపు ఉన్న రంగు మారడం. 
డీ అంటే డయామీటర్‌ – దాని వ్యాసం ఆరు మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే అలాంటి కొన్ని పుట్టుమచ్చలు క్యాన్సర్స్‌గా మారే అవకాశాలు ఎక్కువ. అంటే పై ఏ, బీ, సీ, డీల జాగ్రత్తలను గమనించి ఆ మేరకు తేడాలుంటే వెంటనే డాక్టర్‌ / డర్మటాలజిస్ట్‌ను కలవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement