కొడుకు కోసం ఓ తల్లి మౌనదీక్ష
Published Sun, Jun 15 2014 9:51 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM
చిత్తూరు: తన కుమారుడ్ని అప్పగించాలని ఓ తల్లి మౌన దీక్ష చేపట్టింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని వి.కోటలో చోటు చేసుకుంది. మౌన దీక్ష చేపట్టిన ఉమామహేశ్వరి అనే గృహిణికి ఆమె భర్తకు మధ్య గత కొద్దికాలంగా విభేదాలు నెలకొన్నట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో కుమారుడిని తండ్రి బలవంతంగా తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే తన నాలుగేళ్ల కొడుకును తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉమామహేశ్వరి దీక్ష చేపట్టింది. తన కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లడంపై ఉమామహేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేసింది.
Advertisement
Advertisement