V.Kota
-
హడలెత్తిస్తున్న జంట ఏనుగులు
వి.కోట: వుండలంలోని అటవీ సరి హద్దు ప్రాంతాల్లో రైతులకు హడలెత్తిస్తున్న జంట ఏనుగులను పశువుల కాపరులు గుర్తించారు. నాయకనేరి సమీపంలో కల్లిబండ, చిన్నదుర్గం సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచారి స్తున్న విషయాన్ని వారు రైతులకు చేరవేశారు. నెలరోజులుగా జంట ఏనుగు లు బోయచిన్నాగనపల్లె, నాయకనేరి, లింగాపురం, రావునాథపురం, నావూలవంక, తెట్టు, చిన్నశావు, నాగి రెడ్డిపల్లె గ్రావూల సమీపానికి వచ్చి విధ్వం సం సృష్టిస్తున్నాయి. తరచూ స్థానాలు వూర్చి పొలాలపై దాడులు చేస్తున్న ఏనుగుల బెడదతో రైతులు విసిగిపోతున్నారు. ఇప్పటికే జంట ఏనుగుల విధ్వంసం వల్ల రూ. లక్షల్లో పంటనష్టం జరిగింది. అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రాత్రిళ్లు దాడు లు చేసి పగటిపూట సమీపంలోని అట వీ ప్రాంతాల గుండా కల్లిబండ, దుర్గెం అటవీ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. వీటిని తరిమేందుకు ఎలిఫెంట్ ట్రాకర్స్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. జంట ఏనుగుల బారి నుంచి పంటలు రక్షించాలని అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని రైతులు కోరుతున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిపై బాధితుల దాడి
వి. కోట: ఆస్పత్రికి వైద్యులు రావడం లేదని ఆగ్రహించిన రోగులు ప్రభుత్వ ఆస్పత్రిపై దాడి చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట ప్రభుత్వ ఆస్పత్రిలో గత ఆరు నెలలుగా వైద్యులు సరిగ్గా అందుబాటులో ఉండటం లేదని ఆగ్రహించిన బాధితులు శనివారం ఆస్పత్రిపై దాడి చేసి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. సుమారు వంద మంది ఆస్పత్రిపై దాడి చేశారు. ప్రైవేట్ ప్రాక్టీస్ల గోలలో పడి ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చిత్తూరు జిల్లాలో ఏనుగుల భీభత్సం
-
కొడుకు కోసం ఓ తల్లి మౌనదీక్ష
చిత్తూరు: తన కుమారుడ్ని అప్పగించాలని ఓ తల్లి మౌన దీక్ష చేపట్టింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని వి.కోటలో చోటు చేసుకుంది. మౌన దీక్ష చేపట్టిన ఉమామహేశ్వరి అనే గృహిణికి ఆమె భర్తకు మధ్య గత కొద్దికాలంగా విభేదాలు నెలకొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కుమారుడిని తండ్రి బలవంతంగా తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే తన నాలుగేళ్ల కొడుకును తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉమామహేశ్వరి దీక్ష చేపట్టింది. తన కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లడంపై ఉమామహేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేసింది.