దుర్గెం వద్ద సంచారిస్తున్న జంట ఏనుగులు
వి.కోట: వుండలంలోని అటవీ సరి హద్దు ప్రాంతాల్లో రైతులకు హడలెత్తిస్తున్న జంట ఏనుగులను పశువుల కాపరులు గుర్తించారు. నాయకనేరి సమీపంలో కల్లిబండ, చిన్నదుర్గం సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచారి స్తున్న విషయాన్ని వారు రైతులకు చేరవేశారు. నెలరోజులుగా జంట ఏనుగు లు బోయచిన్నాగనపల్లె, నాయకనేరి, లింగాపురం, రావునాథపురం, నావూలవంక, తెట్టు, చిన్నశావు, నాగి రెడ్డిపల్లె గ్రావూల సమీపానికి వచ్చి విధ్వం సం సృష్టిస్తున్నాయి. తరచూ స్థానాలు వూర్చి పొలాలపై దాడులు చేస్తున్న ఏనుగుల బెడదతో రైతులు విసిగిపోతున్నారు. ఇప్పటికే జంట ఏనుగుల విధ్వంసం వల్ల రూ. లక్షల్లో పంటనష్టం జరిగింది. అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రాత్రిళ్లు దాడు లు చేసి పగటిపూట సమీపంలోని అట వీ ప్రాంతాల గుండా కల్లిబండ, దుర్గెం అటవీ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. వీటిని తరిమేందుకు ఎలిఫెంట్ ట్రాకర్స్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. జంట ఏనుగుల బారి నుంచి పంటలు రక్షించాలని అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని రైతులు కోరుతున్నారు.