రామాయంపేట (మెదక్‌జిల్లా) : మెదక్ జిల్లా రామాయం పేటలో గురువారం వివిధ కళాశాలల విద్యార్థులు.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్నేహ, సాయికృప, వాసవి కళాశాలలకు చెందిన వందలాది మంది జూనియర్ కళాశాలల విద్యార్థులు వందల సంఖ్యలో ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో చాలా మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2014-15 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాల కోసం తాము దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఆన్‌లైన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. అనంతరం వారు స్థానిక తహశీల్దార్ శంకర్‌కు వినతిపత్రం అందజేశారు.