Dharmavaram MLA Kethi Reddy Dropped Students At School In His Car - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కారులో విద్యార్థులు బడికి..

Published Sat, Oct 29 2022 11:26 AM | Last Updated on Sat, Oct 29 2022 3:17 PM

Dharmavaram MLA Kethi Reddy dropped students at school in his own vehicle - Sakshi

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కారులో వెళ్తున్న విద్యార్థినులు  

సాక్షి, ధర్మవరం రూరల్‌: సాధారణంగా ఎమ్మెల్యే కారులో ఉన్నతస్థాయి అధికారులో లేకపోతే రాజకీయ నాయకులు, వారి బంధువులు కూర్చోవడం పరిపాటి. అయితే నడిచి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులను తనకారులో ఎక్కించుకొని తానే స్వయంగా కారు నడుపుతూ వారి బడి వద్ద దిగబెట్టారు ఎమ్మెల్యే  కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.

వివరాల్లోకెళితే... శుక్రవారం ఉదయం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో 5వ వార్డులో చేపట్టారు. అయితే కార్యక్రమం ముగిసిన తరువాత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన నివాసానికి బయలు దేరారు. ఆ సమయంలో కొంత మంది విద్యార్థినులు కళాజ్యోతి సర్కిల్‌ వద్ద ఉన్న జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్నారు.

విద్యార్థినులను గమనించిన ఎమ్మెల్యే ... కారులో ఉన్న వారిని దించివేసి ఆ విద్యార్థినులను తన కారులో ఎక్కించుకొని వారి పాఠశాల వద్ద దింపారు. దీంతో ఎమ్మెల్యే కారులో పాఠశాలకు వచ్చిన ఆ విద్యార్థినులు ఎంతో ఆనందపడిపోయారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement