
సాక్షి, అనంతపురం: అనంతపురం స్థానిక ఎన్నికలు వేడెక్కాయి. గతంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయమని చేతులెత్తేసిన జేసీ సోదరులు తాజాగా ఎన్నికల బరిలోకి అడుగుపెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి పట్టణం 30వ వార్డు నుంచి పోటీ చేయడానికి గురువారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతేగాక ఆయన అనుచరులతో కూడా రెండు సెట్ల నామినేషన్‌లు దాఖలు చేయించి అందరిని ఆశ్చర్యపరిచారు. టీడీపీకి అభ్యర్థులు దొరక్కపోవటంతో నేరుగా జేసీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తాడిపత్రి నుంచి అన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో ఉంచేందుకే జేసీ సోదరులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ ప్రభాకర్‌రెడ్డి మళ్లీ కౌన్సిలర్‌గా నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన కౌన్సిలర్‌గా నామినేషన్ వేయడంపై రాజకీయవర్గాల్లో కూడా చర్చలు మొదలయ్యాయి.
తీగలాగితే డొంక కదిలింది!