JC Prabhakara Reddy
-
నా కొ..ల్లారా.. నరుకుతా..
అనంతపురం క్రైం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి అధికారులపై విరుచుకుపడ్డారు. ‘నా కొ..ల్లారా.. ఒక్కొక్కరినీ నరుకుతా’ అంటూ బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే బండబూతులతో చెలరేగిపోయారు. రవాణా శాఖ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు తాడిపత్రి మునిసిపల్ అధికారులకు, పోలీసులకు, వైఎస్సార్సీపీ నేతలకు బహిరంగంగానే వారి్నంగ్ ఇచ్చారు. ప్రధానంగా గతంలో రవాణా శాఖ కమిషనర్‌గా చేసిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుతో పాటు అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, డీటీసీ శివరాంప్రసాద్, మహిళా అధికారిణి అత్తికానాజ్లను దుర్భాషలాడారు. ‘మీరెక్కడ దాక్కున్నా వదలను. గత ప్రభుత్వ హయాంలో నా బస్సులు, లారీలను అన్యాయంగా సీజ్ చేశారు. మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించారు. నన్ను, నా కొడుకును జైలుకు పంపారు. నిబంధనల మేరకే మేము బీఎస్–4 వాహనాలు కొన్నాం. బీఎస్–4 వాహనాలు అమ్మిన వాళ్లదే తప్పు అని సుప్రీం కోర్టు చెప్పింది. పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మిన వాహనాలను సరెండర్ చేశారు. అక్కడ రిజి్రస్టేషన్ చేసిన అధికారుల ఉద్యోగాలు పోయాయి. ఏపీలో మాత్రం వాహనాలు కొన్న మాపై కేసులు పెట్టారు. జైళ్లకు కూడా పంపారు. అందరిపై ప్రతీకారం తీర్చుకుంటా. సీజ్ చేసిన మా బస్సులు, లారీలన్నీ తుప్పు పట్టిపోయాయి. వాటిని మీరే (అధికారులే) రిపేరు చేయించి తిరిగి రోడ్డుపైకి తేవాలి. ఇందుకు పది రోజులు గడువిస్తున్నా. లేదంటే భార్య, పిల్లలతో కలసి డీటీసీ, ఎస్పీ కార్యాలయాల ముందు నిరాహార దీక్ష చేస్తా. తాడిపత్రి మునిసిపల్ ఆఫీసులో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. రేయ్.. కమిషనర్లూ మిమ్మల్ని వదలను. ‘నా కొ..ల్లారా నరికేస్తా. ఏమవుతుంది మీతో’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారులను దుర్భాషలాడారు. ‘నా ఫ్యామిలీకి 620 ఏళ్ల చరిత్ర ఉంది. నా గడ్డం ఎందుకు వదిలాననుకుంటున్నారు? చంద్రబాబు సీఎం కావాలని వదల్లేదు. ఒక్కో వెంట్రుకకు ఒక్కో కథ ఉంది. అత్తికానాజ్ ఆడదంట.. ఏమ్మా అన్నా వినలేదు. ఇంట్లో తను ఎలా ఉంటుందో తెలుసా?’ అంటూ రాయలేని భాషలో దూషించారు. వైఎస్సార్సీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నానీలను కూడా దూషించారు. బస్సులు, లారీల వ్యవహారం పూర్తిగా తన వ్యక్తిగత సమస్య అని, చంద్రబాబుకు, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. తాను సొంతంగానే పరిష్కరించుకుంటానన్నారు. అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. తాను ఊ అంటే చాలు తనకున్న జనం మరెవరికీ లేరని అన్నారు. -
జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్
-
గది ఖాళీ చేయమంటే.. చంపుతామంటున్నారు
సాక్షి, అనంతపురం: అనంతపురం నగరంలోని నందినీ హోటల్ ఎదురుగా ఉన్న జేసీ ట్రావెల్స్ గదిని ఖాళీ చేయకుండా తమను తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి బెదిరిస్తున్నారని మల్లికార్జున ఆచారి దంపతులు ఎస్పీ ఫక్కీరప్పను కలిసి కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌కు హాజరైన వారు తమ ఆవేదనను ఎస్పీకి విన్నవించుకున్నారు. గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి పిటీషన్లు స్వీకరిస్తున్న ఎస్పీ తమ షాపును 2000లో బాబాయ్య అనే వ్యక్తికి బాడుగకు ఇచ్చామని, అయితే తమ నుంచి అద్దెకు తీసుకొని అతను షాపును తాడిపత్రి జేసీ ట్రావెల్స్‌కు అద్దెకు ఇచ్చాడన్నారు. ఇప్పుడు వారిద్దరు కుమ్మక్కై నాకు బాడుగ ఇవ్వకుండా ఖాళీ చేయకుండా వేధిస్తున్నారని తెలిపారు. నేరుగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని కలిశామని, స్పందించాల్సిన పెద్దమనిషి బెదిరించారన్నారు. షాపు పగల గొడతా, మర్డర్ చేస్తానన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. స్థానిక కమలానగరులో ఇండిపెండెంట్ బిజినెస్ కన్సల్టర్ సెంటర్ (ఐబీసీసీ) పేరుతో పేద విద్యార్థులకు డబ్బు ఆశ చూపి మోసం చేస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మతి హనుమంతురెడ్డి, ఏపీఎస్ఎఫ్ అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 97 మంది నుంచి ఎస్పీ పిటీషన్లు స్వీకరించారు. అనంతం ఎస్పీ మాట్లాడుతూ ఆస్తులు కాజేయడం, కబ్జాలకు తెగబడటం, డబ్బు ఆశ చూసి చీటింగ్‌కు పాల్పడటం వంటి మోసాలకు పాల్పడివారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వంచకులపై ఫిర్యాదులు అందితే తాట తీస్తామని హెచ్చరించారు. చదవండి: (మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో..) -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈడీ ప్రశ్నల వర్షం
-
ఈడీ ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి
-
కుట్రలు 'జేసీ'.. డీఎస్పీని టార్గెట్ చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి
పోలీసులపై పెత్తనం చేసేందుకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలకు తెరలేపారు. ముఖ్యంగా డీఎస్పీ వీఎన్కే చైతన్యను టార్గెట్ చేశారు. నజరానాలకు లొంగకుండా, పొగడ్తలకు పొంగిపోకుండా నక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అనుచరులతో ప్రైవేటు కేసులు పెట్టిస్తున్నారు. డీఎస్పీ లక్ష్యంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి సాగిస్తున్న కుయుక్తులను నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. సాక్షి, తాడిపత్రి: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా పోలీసులను గుప్పిట్లో పెట్టుకునేందుకు జేసీ సోదరులు ప్రయత్నిస్తున్నారు. చెప్పినట్టు నడుచుకునే వారుంటే తమ రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కవచ్చనేది వారి ఆలోచన. ఇందు కోసం శాంతిభద్రతలకు సైతం విఘాతం కలిగిస్తున్నారు. తాజాగా డీఎస్పీ వీఎన్కే చైతన్యను తమ వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలకు తెర లేపారు. సోషల్ మీడియా వేదికగా ప్రభాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలు, దూషణలను చూస్తే డీఎస్పీని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా జేసీ సోదరులు తమ మాట వినని పోలీసు అధికారులను దారిలోకి తెచ్చుకునేందుకు అనుచరులతో ప్రైవేటు కేసులు వేయించారు. ప్రబోధాశ్రమ ఘటనలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఏకంగా పోలీస్ స్టేషన్‌కు తాళం వేసి.. పోలీసులు చేతకాని వాళ్లంటూ అప్పటి డీఎస్పీ విజయ్‌కుమార్‌పై నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. 2010–11లో జేసీ సోదరుల ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవికి అప్పటి ఎస్పీ ఎంకే సిన్హా కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన జేసీ సోదరులు పొట్టి రవితో ఎస్పీపై ప్రైవేటు కేసు వేయించారు. అదే పంథానే ఇప్పుడూ జేసీ సోదరులు కొనసాగిస్తున్నారు. తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామంలో 2018 సెప్టెంబర్ 15న వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణలకు సంబంధించి మాజీ ఎంపీ జేసీపై పోలీసులు మొదట్లో కేసు నమోదు చేయలేదు. కానీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధికారి ఆంథోనప్ప అప్పటి వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించి, నిందితుల వాంగ్మూలం మేరకు మాజీ ఎంపీపైనా కేసు నమోదు చేసి, చార్జ్‌షీట్‌లో పేరు పొందుపరిచారు. ఈ కేసుకు సంబంధించి తన అన్నను ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో ప్రస్తుత డీఎస్పీ చైతన్యపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపణలకు దిగారు. అంతేకాకుండా జఠాధర ఇండస్ట్రీస్‌కు సంబంధించిన వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై దర్యాప్తు కోసం డీఎస్పీ చైతన్య ఈ ఏడాది జూలైలో నాగాలాండ్ వెళ్లారు. అక్కడ వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించారు. ఈ కేసులో చార్జ్‌షీట్ వేయడంతో పాటు ఈడీ విచారణకు సహకరిస్తే తన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి జైలుకు వెళతారన్న భయంతో డీఎస్పీపై తన అనుచరులతో ప్రైవేట్ కేసులు వేయిస్తూ బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించారని, పార్టీలకతీతంగా విధులు నిర్వర్తించారని డీఎస్పీని ప్రశంసించిన ప్రభాకర్‌రెడ్డి ఇప్పుడు ఆయనపైనే ప్రైవేటు కేసులు పెట్టిస్తుండడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. జేసీ ప్రభాకర్ ఆగడాలకు నిదర్శనాలివిగో... ట 2020 డిసెంబర్ 12న టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ జేసీ అస్మిత్‌రెడ్డి ప్రధాన నిందితుడు. ఈ కేసులో ఎక్కడ తన కుమారుడిని అరెస్టు చేస్తారోనన్న భయంతో ప్రభాకర్‌రెడ్డి ఎలాగైనా పోలీసులను తన దారికి తెచ్చుకోవాలని బ్లాక్మెయిల్, కుట్రలకు దిగినట్లు తెలుస్తోంది. ►తాడిపత్రి పట్టణంలోకి పోలీసులు అనుమతించలేదని జేసీ సోదరుల ప్రధాన అనుచరుడు పొట్టి రవితో గత ఏడాది జూన్ 22న డీఎస్పీపై హైకోర్టులో ప్రైవేటు కేసు వేయించారు. ►ఈ ఏడాది జూన్ 11న గన్నెవారిపల్లి కాలనీలోని ఎస్టీపీ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు సంబంధించి డీఎస్పీ చైతన్య తనను స్టేషన్‌కు పిలిపించి కొట్టి, కులం పేరుతో దూషించాడని తాడిపత్రి పట్టణంలోని 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జునతో ఈ నెల 23న కోర్టులో ప్రైవేట్ కేసు వేయించారు. ఏకంగా కోర్టు ప్రాంగణంలోనే ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. డీఎస్పీపై ఆరోపణలు చేయడం గమనార్హం. ►ఇటీవల యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో యానిమేటర్ పోస్టు విషయంలో వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై జఠాధర ఇండస్ట్రీస్ యజమాని చవ్వా గోపాల్‌రెడ్డి అనుచరులు గొజ్జుల రాజు, గొజ్జుల సింహాద్రి, మరికెల రాజు తదితరులు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు యాడికి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను స్టేషన్‌కు పిలిపించి నోటీసులు జారీ చేసి ఇంటికి పంపించారు. అయితే దీన్ని ప్రభాకర్‌రెడ్డి వక్రీకరించారు. సదరు నిందితులను తన ఇంటికి పిలిపించుకుని మీడియా ఎదుట తప్పుడు ఆరోపణలు చేయించారు. విచారణ పేరుతో పోలీసులు తమను కొట్టారంటూ వారితో చెప్పించారు. అంతేకాకుండా ఈ ఏడాది సెప్టెంబర్ 6న వారితో స్థానిక కోర్టులో ప్రైవేటు కేసు వేయించారు. నాగాలాండ్‌లో వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో చార్జ్‌షీట్ వేయకుండా పక్కదారి పట్టించేందుకు ఇలా చేసినట్లు విమర్శలు ఉన్నాయి. ►ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా పెన్నా నది సమీపాన పార్కులో వినాయక మండపం ఏర్పాటుకు అనుమతివ్వాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరగా.. మున్సిపల్ స్థలంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని డీఎస్పీ నిరాకరించారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా ప్రభాకర్‌రెడ్డి డీఎస్పీపై నోరుపారేసుకున్నారు. ►శింగనమల నియోజకవర్గం పుట్లూరులో కొందరు టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ వర్గీయులకు చెందిన వ్యవసాయ పొలంలోకి వెళ్లి మద్యం తాగారు. అభ్యంతరం తెలిపిన వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడికి పాల్పడిన టీడీపీ వర్గీయులపై పుట్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో వైఎస్సార్సీపీ వర్గీయులపైనా కేసులు నమోదు చేయాలంటూ ఎ.కొండాపురానికి చెందిన చంద్ర దండు నాయకుడు ప్రకాష్‌నాయుడు ఈ నెల 23న పుట్లూరు ఎస్ఐకి వ్యతిరేకంగా పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ వ్యవహారాన్ని కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డి తనకు అనుకూలంగా మలచుకుని ప్రకాష్‌నాయుడును పోలీసులపై ఉసిగొల్పినట్లు తెలిసింది. మాట వినలేదని వైరం మున్సిపల్ ఎన్నికల అనంతరం పోలీసుల తీరును, ప్రత్యేకంగా డీఎస్పీ వీఎన్కే చైతన్య కృషిని ప్రశంసించే నెపంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి రాయబారం నెరిపారు. తన ప్రధాన అనుచరునితో బంగారు బిస్కెట్లను నజరానాగా పంపగా.. డీఎస్పీ సున్నితంగా తిరస్కరించడమే కాక తనదైన శైలిలో ‘వార్నింగ్’ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం తనకు ఫేవర్ చేయాలని మాంసాహార వంటకాల క్యారేజీలతో నెరిపిన రాయబారమూ ఫలించలేదు. రాయబేరాలు, పైరవీల కోసం మరోసారి తన కార్యాలయానికి వస్తే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించడాన్ని ప్రభాకర్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి వైరం మొదలైంది. చైతన్య ఇక్కడ ఉంటే తమ ఆటలు సాగవని.. ఎలాగైనా పంపించేయాలని కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. డీఎస్పీకి వ్యతిరేకంగా ప్రెస్మీట్లు పెట్టాలని ఒత్తిడి ‘మా నాన్న నారాయణ 2021 ఆగస్టు రెండో తేదీన ఆస్పత్రిలో గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే నాన్న మృతికి కుళ్లాయప్ప, నారాయణ, నాగరాజులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మూడో తేదీ పెద్దపప్పూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతుండగానే.. సోమవారం ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ‘మీ నాన్న విషయంలో నీకు న్యాయం జరగలేదు.. డీఎస్పీకి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టాల’ని ఒత్తిడి తెచ్చి బెదిరించాడు. ఇదే విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకొచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను’. – నాగేంద్ర, సోమనపల్లి, పెద్దపప్పూరు మండలం కౌన్సిలర్ మల్లికార్జున ఫోన్ నుంచి కాల్ పెద్దపప్పూరు మండలం సోమనపల్లికి చెందిన నాగేంద్ర తనకు వచ్చిన ఫోన్ కాల్ బెదిరింపుపై డీఎస్పీ చైతన్యకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు నాగేంద్రకు వచ్చిన ఫోన్ కాల్‌ను ట్రేస్అవుట్ చేయగా అది జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడైన తాడిపత్రి 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జునకు చెందిన ఫోన్ నంబర్‌గా తేలింది. ఇటీవల కౌన్సిలర్ మల్లికార్జున.. డీఎస్పీపై ప్రైవేటు కేసు వేశారు. సంబంధం లేని వారిని బెదిరించి ప్రెస్మీట్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్న కౌన్సిలర్ మల్లికార్జునపై కేసు నమోదు చేశాం. – ఖాజాహుసేన్, ఎస్ఐ తప్పుడు కేసులకు భయపడం బెదిరింపులు, కోర్టుల్లో తప్పుడు కేసులకు పోలీసులు భయపడరు. జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించినా, పొగడ్తలతో ముంచెత్తినా చట్ట ప్రకారమే మేం విధులు నిర్వర్తిస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే సంయమనంతో ఉన్నాం. ప్రజల ప్రశాంత జీవనానికి ఎవరు భంగం కల్గించినా కఠిన చర్యలు తీసుకుంటాం. తప్పుడు కేసులకు భయపడితే పోలీసులు ఉద్యోగం చేయలేరు. – వీఎన్కే చైతన్య, డీఎస్పీ -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు. స్క్రాప్ కింద వాహనాలు కొనుగోలు చేసి నకిలీ ఇన్వాయిస్తో జేసీ ట్రావెల్స్ నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసింది. సుమారు వందకు పైగా వాహనాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. జేసీ ముఖ్య అనుచరడు చవ్వా గోపాల్‌రెడ్డి ఇంట్లోనూ ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. చదవండి: (కర్నాటకలో ఏసీబీ అధికారుల సంచలనం) -
జేసీ ఆరోగ్యం కాపాడుకో..
సాక్షి, తాడిపత్రి : వ్యక్తిగత స్వార్థంతో పచ్చటి గ్రామాల్లో చిచ్చు రగిల్చే విధానాలను మానుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు. రైతులు ఒక్కప్పుడు అమ్మిన భూములను తిరిగి ఇప్పిస్తానంటూ మోసపూరిత రాజకీయాలకు తెరతీయడం సమంజసం కాదని అన్నారు. ఇది గ్రామాల్లో వర్గ కక్షలను ప్రేరేపించేలా ఉందని అన్నారు. మంగళవారం తాడిపత్రిలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎకరానికి రూ.20 వేలు ఎక్కువ ఇప్పిస్తా కేవలం తన చుట్టూ జనం తిరిగేలా చేసుకునేందుకే భూముల వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి తలదూర్చారని అన్నారు. ఒకసారి ఇతరులకు విక్రయించిన భూములను తిరిగి ఇప్పించడం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. జేసీ సోదరులు వారి స్వగ్రామమైన జూటూరులో రైతుల పొలాల గట్లను డోజర్లతో చదును చేయించి ఎకరాకు రూ.30 వేలు ఇచ్చి దౌర్జన్యంగా భూములను లాక్కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ భూములకు ఎకరాకు రూ.20 వేలు ఎక్కువగా తానిప్పిస్తానని, వాటిని అదే రైతులకు ఇచ్చే త్యాగబుద్ధి ఉందా అంటూ సవాల్ విసిరారు. (మూడు అంశాలే ప్రామాణికం!) స్వచ్ఛందంగా అమ్ముకున్నారు గతంలో వంగనూరు, బొందెలదిన్నె గ్రామాల సమీపంలోని భూములను రైతులు స్వచ్ఛందంగా అమ్ముకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం గండికోట ముంపు గ్రామాల ప్రజలు తాడిపత్రిలో గృహాలు నిర్మించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని, ఫలితంగా తాడిపత్రి ప్రాంతంలో భూములకు డిమాండ్ పెరిగిందన్నారు. ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి రైతులను మభ్య పెడుతూ గతంలో అమ్ముకున్న భూములను తిరిగి ఇప్పిస్తానంటూ గ్రామాల్లో చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. డబ్బు ఉంటే ఎవరైనా భూములను కొనుగోలు చేయవచ్చునని, అయితే ముందు అమ్మిన ధర కంటే ఎకరానికి రూ.20 వేలు, రూ.30 వేలు ఎక్కువ ఇస్తామనడం సరైన సంస్కృతి కాదని అన్నారు. మాయమాటలతో గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని మాజీ ఎమ్మెల్యేని హెచ్చరించారు. ఆరోగ్యం కాపాడుకో.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసి ఉంటే వారిపై మాత్రమే కేసులు నమోదవుతాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబం«ధించి కర్ణాటకలోని అధికారులు లేఖలు రాయడం జరిగిందని, వారు స్పందించకపోవడంతో లోకాయుక్తలో ఫిర్యా దు చేసినట్లు గుర్తు చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి దివాకర్ ట్రావెల్స్, జఠాధర ఇండస్ట్రీస్ యజమానులుగా ఎవరైతే ఉంటారో వారిపైన మాత్రమే కేసులు నమోదు అవుతాయన్నారు. ఈ విషయంగా ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డికి సూచించారు. -
‘జేసీ భూములు ఇప్పిస్తామనడం హాస్యాస్పదం’
సాక్షి, తాడిపత్రి: మండలంలోని వంగనూరు, బొందలదిన్నె గ్రామంలోని భూములను రైతులు స్వచ్ఛందంగా విక్రయించారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం రైతులు తమ భూములు కొనుగోలు చేయవచ్చన్నారు. అయితే ఆ భూములను రైతులకు ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసమే గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దొంగ లారీలు, దొంగ భూములు కొనుగోలు చేయడం కేవలం జేసీ సోదరులకు మాత్రమే చెందుతుందని విమర్శించారు. కర్ణాటక రవాణాశాఖ అధికారులు స్పందించకుండా ఉంటేనే లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం దివాకర్ ట్రావెల్స్ వారికే సాధ్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. -
జేసీ అనుచరుల సెప‘రేటు’ మార్గం..
సాక్షి, తాడిపత్రి : ప్రభుత్వం మారింది..అధికారం పోయింది..అయినా జేసీ సోదరుల అనుచరులు సెప‘రేటు’ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో తాడిపత్రి పట్టణం అక్రమ మద్యం విక్రయాలకు కేరాఫ్‌గా మారింది. ఉదయం 6 గంటల నుంచి మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసివేసిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. తద్వారా రూ.లక్షల్లో టర్నోవర్ చేస్తున్నారు. అయినా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేసీసోదరుల అనుచరులే అక్రమ వ్యాపారులు : జేసీ సోదరుల అనుచరులు కొందరు బస్టాండు కేంద్రంగా, మరికొన్ని ప్రాంతాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు. ఉదయం 6 గంటల నుంచి అక్రమ మద్యం వ్యాపారులు రోడ్లపై నిలబడి మద్యం జోరుగా విక్రయిస్తున్నారు. డబ్బులు ఉంటే చాలు తాడిపత్రి పట్టణంలో ఏ ప్రాంతంలోనైనా, దుకాణాలు తెరవని సమయంలోనూ మద్యం దొరుకుతోంది. ప్రభుత్వ దుకాణాల్లో కంటే క్వాటర్‌పై రూ.50 నుంచి రూ.100 అధికంగా ఇవ్వాల్సి వస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం బ్రాండ్లకు ఫుల్ బాటిల్‌పై రూ.400 నుంచి రూ.600 వరకు అదనపు ధరకు అమ్ముతున్నారు. బస్టాండు వద్ద తోపుడు బండిపై విక్రయించడానికి ఉంచిన అక్రమ మద్యం బాటిళ్లు నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు ... తాడిపత్రి పట్టణ పరిధిలో మొత్తం 8 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు సుమారుగా రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అధికార లెక్కలు చెప్తున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే కొందరితో టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారు. వారి నుంచి మద్యం తెచ్చుకొని నిల్వ ఉంచుకుంటున్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లను తెచ్చుకుంటున్నారు. మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరవక ముందు ఉదయం, మద్యం దుకాణాలను మూసి వేసిన తర్వాత రాత్రివేళలో అదును చూసి విచ్చలవిడిగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు: తాడిపత్రి ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తాడిపత్రి ప్రాంతంలో అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ఏదైనా పత్రికల్లో ప్రచురితమైనప్పుడు, జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు అందితేనే ఇక్కడి అధికారులు దాడులు చేసి, కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ మద్యం వ్యాపారుల నుంచి మమూళ్లు ముడుతుండడంతోనే అధికారులు ఏమీ ఎరుగనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దాడులు నిర్వహిస్తున్నాం అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాం. అక్రమ మద్యం స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నాం. అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందిస్తే వెంటనే దాడులు చేస్తున్నాం. ఇప్పటికే పట్టణ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నవారిని పిలిపించి, కౌన్సెలింగ్ నిర్వహించాం. ఎవరైనా అక్రమ మద్యం అమ్ముతూ రెండు సార్లకు పైబడి పట్టుబడితే వారిని బైండోవర్ చేస్తున్నాం. – గోపాల్‌నాయక్, ఎక్సైజ్ ఎస్ఐ, తాడిపత్రి -
జేసీ పవన్‌ను ముందుగానే హెచ్చరించాం
సాక్షి, తాడిపత్రి: శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు అన్నారు. పట్టణంలో 30 యాక్ట్ అమలులో ఉందని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. శనివారం పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పోలీసుల వాహన శ్రేణి కవాతుతో పాటు, ఏరియా డామినేషన్ పెట్రోలింగ్‌ను నిర్వహించారు. ఈ వాహన శ్రేణి స్థానిక గాంధీ సర్కిల్ వద్దకు చేరుకున్న అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని, అత్యవసర పరిస్థితుల్లో తప్పా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పట్టణంలోకి రాకూడదన్నారు. (మళ్లీ జైలుకు జేసీ..) ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ పవన్‌కు ముందుగానే తాము హెచ్చరికలు జారీ చేసినా వాటిని పెడచెవిన పెట్టిన కారణంగానే కడపలో నిబంధనలు ఉల్లంఘించిన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆర్ఎస్.కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్‌రెడ్డిలపై కేసులు కూడా నమోదయ్యాయన్నారు. తాడిపత్రి పోలీస్స్టేషన్ల పరిధిలో కూడా పలు కేసులు నమోదు చేశామన్నారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డి కూతురు పేరు మీద ..
కర్నూలు: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని జిల్లా పోలీసులు శుక్రవారం కస్టడీకి తీసుకుని మూడు గంటలపాటు విచారించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన చువ్వా గోపాల్‌రెడ్డి దగ్గర ఓర్వకల్లుకు చెందిన నాగన్న డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బీఎస్–3 వాహనాలను బీఎస్–4గా చూపించి కర్నూలు రవాణా శాఖ కార్యాలయంలో నాగన్న పేరు మీద మూడు వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత వాటిని ప్రభాకర్‌రెడ్డి కూతురు పేరు మీద మార్పు చేయించుకున్నారు. దీనిపై కర్నూలు డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చి 9వ తేదీన ఓర్వకల్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. కడప నుంచి కర్నూలుకు తీసుకొచ్చి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో కర్నూలు ఇన్చార్జ్ డీఎస్పీ వెంకట్రామయ్య, తాలూకా సీఐ శ్రీనాథరెడ్డి, ఓర్వకల్లు ఎస్ఐ వెంకటేశ్వర్రావు తదితరులు విచారణ చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న బోయ రవికుమార్, అంబటి నాగేశ్వర్‌రెడ్డి, జింకా నాగేంద్ర, ముత్తుకుమార్ తదితరులను కూడా అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. విచారణ అనంతరం ప్రభాకర్‌రెడ్డిని తిరిగి కడప జిల్లా జైలుకు తరలించారు. -
సుప్రీం కోర్టు నిబంధనలను జేసీ ఉల్లంఘించారు
-
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. 76 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. బీఎస్-3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్-4గా మార్పుచేసి రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు సమర్పించినట్లు అధికారుల విచారణలో తేలింది. 60 వాహనాలను రవాణా అధికారులు సీజ్ చేశారు. మిగతా 94 వాహనాలను జేసీ బ్రదర్స్ అజ్ఞాతంలో దాచిపెట్టారు. వాటిలో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నట్లు అధికారులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్ వాహనాల్లో ప్రయాణించే వారికి ఇకపై ఇన్సూరెన్స్ వర్తించదని అధికారులు తేల్చి చెప్పారు. జేసీ ట్రావెల్స్ చాలా తప్పులు చేసింది జేసీ ట్రావెల్స్ చాలా తప్పులు చేస్తూ, ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడిందని అనంతపురం డిప్యూటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాంప్రసాద్ అన్నారు. స్క్రాప్ కింద కొనుగోలు చేసిన బస్సులు, లారీలను రోడ్లపై నడపడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దమని పేర్కొన్నారు. ఈ విషయంపై జేసీ కుటుంబ సభ్యులకు నోటీసులు అందిస్తామని చెప్పారు. జేసీ ఫోర్జరీ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు శివరాంప్రసాద్ పేర్కొన్నారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరో కేసు
సాక్షి, అనంతపురం : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తాజాగా మరో కేసు నమోదైంది. జేసీ ట్రావెల్స్ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అంతకు ముందు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. బీఎస్-3 వాహనాలను బీఎస్ - 4 వాహనాలుగా మార్చి తమకు అమ్మారని.. నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లారీ ఇంజిన్ నంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ప్రభాకర్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బీఎస్-3 వాహనాలను జేసీ బ్రదర్స్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించి ప్రైవేట్ ఆపరేటర్లకు విక్రయించిన విషయం తెలిసిందే. (చదవండి : వెలుగులోకి జేసీ అవినీతి బాగోతాలు) -
కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేసిన జేసీ!
సాక్షి, అనంతపురం: అనంతపురం స్థానిక ఎన్నికలు వేడెక్కాయి. గతంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయమని చేతులెత్తేసిన జేసీ సోదరులు తాజాగా ఎన్నికల బరిలోకి అడుగుపెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి పట్టణం 30వ వార్డు నుంచి పోటీ చేయడానికి గురువారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతేగాక ఆయన అనుచరులతో కూడా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయించి అందరిని ఆశ్చర్యపరిచారు. టీడీపీకి అభ్యర్థులు దొరక్కపోవటంతో నేరుగా జేసీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తాడిపత్రి నుంచి అన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో ఉంచేందుకే జేసీ సోదరులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ ప్రభాకర్‌రెడ్డి మళ్లీ కౌన్సిలర్‌గా నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన కౌన్సిలర్‌గా నామినేషన్ వేయడంపై రాజకీయవర్గాల్లో కూడా చర్చలు మొదలయ్యాయి. తీగలాగితే డొంక కదిలింది! -
జేసీ నేర చరిత్రపై త్వరలో మూడో భాగం..
అనంతపురం సెంట్రల్: ‘అధికారాన్ని అడ్డుపెట్టుకొని జేసీ సోదరులు తాడిపత్రిలో తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించారు. చివరకు రేషన్ బియ్యం కూడా వదలని గజదొంగలు’ అని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో వైఎస్సార్సీపీ నాయకులు కందిగోపుల మురళీమోహన్‌రెడ్డి కలిసి విలేకరులతో మాట్లాడారు. 2019 సెప్టెంబర్ 10న గుత్తిలో బలరాం అనే వ్యక్తి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని, అయితే ఇందుకు సంబంధించిన రికార్డులు, కేసు పూర్వాపరాలు పోలీసులు వెల్లడించలేదన్నారు. సదరు నిందితుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి బినామీ అన్నారు. నకిలీ సర్టిఫికెట్ల దందాలో ఆంధ్ర , కర్ణాటక రాష్ట్రాల్లో పేరు మోసిన గుంతకల్లు చెందిన గ్లెయిన్ బ్రిక్స్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి మించిపోయాడని పెద్దారెడ్డి విమర్శించారు. నకిలీ సీళ్లతో ఎన్ఓసీ పొంది బెంగళూరులో విక్రయించిన లారీలన్నీ జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి పేర్ల మీద ఉన్నాయన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరుతో కేవలం 2 వాహనాలే ఉండగా, జేసీ ఉమారెడ్డి పేరుతో ఏకంగా 80 వాహనాలు, కోడలు నిఖిలారెడ్డి పేరుతో 10 వాహనాలు ఉన్నట్లు వెల్లడైందన్నారు. సదరు వాహనాలన్నీ అక్రమమేనని, ఒకే నంబర్‌తో రెండు మూడు వాహనాలు నడపడం, ఇన్సూరెన్స్ తదితర రికార్డులన్నీ నకిలీవి సృష్టించారన్నారు. వీటికి సంబంధించిన ‘మీ–సేవ’ సర్టిఫికెట్లు కూడా నకిలీవేనన్నారు. అధికారులు పట్టుకుంటే ఇబ్బందలొస్తాయనుకున్న వాహనాలన్నింటినీ కుటుంబంలోని మహిళల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించడం చూస్తే.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎంతకైనా దిగజారుతాడని అర్థమవుతోందన్నారు. సీఐ దాడి వెనుక జేసీ మంత్రాంగం జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రిలో ఎవరికీ తెలియని చికెన్‌స్కాం(అధిక రేట్లకు విక్రయించి) నడిపాడన్నారు. మట్కా నిర్వాహకున్ని అరెస్ట్ చేయడానికి కడప జిల్లా నుంచి ఓ సీఐ వస్తే అతనిపై దాడి చేయించాడన్నారు. అంతేకాకుండా మట్కా నేరస్తున్ని కాపాడేందుకు ఎమ్మెల్యే హోదాలో రోడ్డుపై ధరా>్న చేసిన నీచమైన వ్యక్తి జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రిలో జేసీ సోదరులు చేసిన నేరాలు మొత్తం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. దీన్ని తట్టుకోలేని జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడన్నారు. జేసీ తన అక్రమ సంపాదన కోసం అక్రమ రూట్లో బస్సు నడిపి గతంలో ఆత్మ డీపీడీ ప్రసాద్‌ను పొట్టనపెట్టుకున్నాడన్నారు. ఇప్పటికే జేసీ నేరచరిత్రకు సంబంధించిన రెండు భాగాలు విడుదలయ్యాయని, త్వరలో మూడో భాగం విడుదలవుతుందన్నారు. జేసీ సోదరులు యల్లనూరు మండలం యల్లుట్ల అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేయగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాను దాన్ని అడ్డుకున్నానన్నారు. రాజీకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. లేదంటే ఇప్పడు జేసీ సోదరులకు పట్టే గతే పడుతుందని హెచ్చరించారు. -
దివాకర్ ట్రావెల్స్..రాంగ్రూట్లో రైట్‌రైట్
ఆయనో పెద్ద మనిషి. మైకు దొరికితే నీతులు చెబుతుంటారు. ముఖ్యమంత్రులు, ప్రధానులకు సైతం సలహా ఇచ్చే రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ ఆయన బిజనెస్ మొత్తం అడ్డదారిలో సాగుతోంది. కొన్నేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ ట్రావెల్స్ బస్సుల ద్వారా రూ. కోట్లు కొల్లగొట్టారు. అన్నాతమ్ముడు ఏకమై పాతికేళ్లుగా ప్రైవేటు ట్రావెల్స్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతూ ఎన్నో ప్రాణాలు తీశారు. మరెంతో మందిని క్షతగాత్రులుగా మిగిల్చారు. అందుకే ఆ బస్సు చూస్తే చాలు జనం మృత్యుశకటమొచ్చనంటూ పరుగులు తీస్తున్నారు. సాక్షి, అనంతపురం: మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిలకు చెందిన దివాకర్ ట్రావెల్స్...జిల్లాలోనే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులు నడుపుతోంది. కానీ అన్నీ అడ్డదారిలోనే...పర్మిట్ ఓ రూట్లో తీసుకుని...మరో రూట్లో బస్సులు నడుపుతారు. కొన్నింటికి అసలు పర్మిటే ఉండదు. ఇలా అడ్డదారిలో అడ్డంగా తిరుగుతున్న ట్రావెల్స్‌పై ఇటీవల రవాణాశాఖ అధికారులు నిఘా వేశారు. ఆకస్మిక తనిఖీలు చేయగా.. ట్రావెల్స్ గుట్టు రట్టయ్యింది. ఇటీవల రోడ్డు రవాణాశాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లాలోనూ ఉపరవాణా కమిషనర్ శివరామప్రసాద్ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయిన అధికారులు ఈనెల 16న వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. తొలిరోజు 8, మరుసటి రెండు బస్సులను సీజ్ చేశారు. జిల్లాలో సీజన్ చేసిన వాటిలో 8 బస్సులు దివాకర్ ట్రావెల్స్‌వే కావడం గమనార్హం. ఇలా అనంతపురంలో 4, గుంతకల్లులో 3, పెనుకొండలో ఒక దివాకర్ బస్సును సీజ్ చేశారు. రవాణాశాఖ నిబంధనలను తుంగలోకి తొక్కి బస్సులు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతా అడ్డదారిలోనే... ఇంటర్‌స్టేట్ క్యారేజ్ అనుమతులు తీసుకొని జిల్లా వ్యాప్తంగా మొత్తం 196 ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. స్టేజ్ క్యారెజ్ అనుమనుతులు తీసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోనే ఉండటం గమనార్హం. అనంతపురం టూ బెంగుళూరు, అనంతపురం టూ బళ్లారి, అనంతపురం టూ చెళికర, అనంతపురం టూ హైదరాబాద్ సర్వీసుల పేరుతో పలు ట్రావెల్స్‌కు చెందిన బస్సులు తిరుగుతున్నాయి. ఒక పర్మిట్‌తో రెండు, మూడు బస్సులు ఇంటర్ స్టేజ్ వ్యవహారం వెనుక భారీ అక్రమాలు జరుగుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ అనుమతులు తీసుకున్నది ఒక రూట్ అయితే.. మరో రూట్లో బస్సులు తిప్పితున్నారు. కొన్నింటికి గడువు మీరిపోయినా అలాగా కొనసాగిస్తున్నారు. మరికొందరు అనుమతి ఒక బస్సుపై ఉంటే.. రెండు మూడు బస్సులు అదనంగా తిప్పుతున్నారు. ఇందులో దివాకర్ ట్రావెల్స్ బస్సులు కూడా మినహాయింపేమి కాదు. ఇటీవల అధికారులు సీజ్ చేసిన 8 దివాకర్ బస్సుల్లో రెండింటికీ పూర్తిగా అనుమతి లేకపోవడం, మరికొన్నింటిలో నిబంధనలకు విరుద్ధంగా సీటింగ్ కెపాసిటీ పెంచి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మరికొన్నింటిలో డ్రైవర్లు, కండెక్టర్లకు లైసెన్స్‌లు లేనట్లు అధికారులు గుర్తించారు. దీంతో (ఏపీ02టీహెచ్4220, ఏపీ02టీఈ2196, ఏపీ02టీసీ3969, ఏపీ02టీఏ6373, ఏపీ02టీఈ0135, కేఏ01ఏకే3929, కేఏ34ఏ0987, కేఏ34ఏ8874) సీజ్ చేసినట్లు రవాణాశాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వానికి రూ.కోట్లలో గండి... ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అనుమతులు లేకుండా తిరుగుతుండడంతో పాటు అనుమతి లేని రహదారులపై కూడా దర్జాగా రాకపోకలు సాగిస్తున్నాయి. తాజాగా రవాణాశాఖ అధికారుల దాడులతో బట్టబయలు అయిన వ్యవహారం జిల్లాలో కొన్నేళ్ల నుంచి జరుగుతున్నా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ట్రావెల్స్ దందా కొనసాగించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పనిచేసిన రవాణాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. రహదారులపై అడ్డదారిలో తిరగడమే కాకుండా ఏపీఎస్ ఆర్టీసీకి నష్టం కలిగించేలా కొన్ని రూట్లలో అతివేగంతో రాకపోకలు సాగిస్తూ అనేక మంది ప్రజల ప్రాణాలను కూడా జేసీ ట్రావెల్స్ బస్సులు తీశాయి. ఇటీవల రవాణా శాఖ అధికారులు సీజ్ చేసిన దివాకర్ ట్రావెల్స్ బస్సులు 8 2017 నవంబర్ 3న ఆత్మకూరు సమీపంలోని వడ్డుపల్లి వద్ద వేగంగా వచ్చిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చిన బొలొరో వాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో ‘ఆత్మ’ డీపీడీ రమణ ప్రాణాలు కోల్పోయారు. 2017 సెప్టెంబర్‌లో ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లెకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని కామారుపల్లివద్ద దివాకర్ బస్సు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సదరు ట్రావెల్స్ నిర్వాహకులు ఆస్పత్రి ఖర్చులు కూడా చెల్లించకపోవడంతో బాధితుడు గ్రామస్తుల సాయంతో ధర్నా చేశాడు. ఇలా గత నాలుగేళ్లలో దివాకర్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, చాలా మంది క్షతగాత్రులుగా మిగిలి జీవచ్ఛవాల్లో బతుకుతున్నారు. ప్రమాదాలకు కారణమైన బస్సులకు అనుమతి లేనట్లు గుర్తించినా.. అప్పటి రవాణాశాఖ అధికారులు చర్యలకు వెనుకంజ వేశారు. ఫిర్యాదుల మేరకే దాడులు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం. ఇందులో పదిబస్సులు పట్టుబడగా దివాకర్ ట్రావెల్స్‌కు చెందినవి 8 ఉన్నాయి. అనుమతులు లేకపోవడం, డ్రైవర్, కండెక్టర్లకు లైసెన్స్ లేకపోవడం, అక్రమంగా సీటింగ్ కెపాసిటీ పెంచి ప్రయాణికులను తరలిస్తుండడం తదితర కారణాలతో వాటిని సీజ్ చేశాం. ఈ దాడులు కొనసాగుతాయి. రోజూ 20 చొప్పున ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – శివరామప్రసాద్, ఉపరవాణా కమిషనర్ -
జేసీ బ్రదర్స్‌కు గట్టి షాక్!
సాక్షి, అనంతపురం : తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకు గట్టి షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించగా.. ఆయన సమక్షంలో జేసీ బ్రదర్స్ ముఖ్య అనచరులు పార్టీలో చేరి ఊహించని గట్టి షాక్ ఇచ్చారు.. వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ అనంతరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకటనాయుడు, జేసీ ముఖ్య అనుచరుడు బోగాతి నారాయణరెడ్డి, సమీప బంధువు జేసీ చిత్తరంజన్ రెడ్డి, తాడిపత్రి టీడీపీ సీనియర్ నేతలు జగదీశ్వర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్, ఫయాజ్ బాషా, బ్రహ్మనందరెడ్డి, జయచంద్రారెడ్డిలు పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నియంత పాలనపై విసిగిపోయి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు వారంతా స్పష్టం చేశారు. -
పోలీసులపై జేసీ వర్గీయుల దాడి కేసులో హైడ్రామా
సాక్షి, అనంతపురం : కడప పోలీసులపై జేసీ వర్గీయుల దాడి కేసులో హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే తనపై దాడి జరిగిందని సీఐ హమీద్ వాంగ్మూలం ఇచ్చినప్పటికి.. ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. రైడ్ చేశాక ఎమ్మెల్యే జేసీతో మాట్లాడాలని నిందితుడు రషీద్ తనకు ఫోన్ ఇచ్చాడని.. అందుకు తాను నిరాకరించటంతో రషీద్ స్వయంగా జేసీతో మాట్లాడి.. ఆయన ఆదేశాలతోనే తనపై దాడి చేశారని సీఐ హమీద్ వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఈ వాంగ్మూలాన్ని పోలీసులు పక్కన పెట్టేశారు. కానిస్టేబుల్ వాంగ్మూలం ఆధారంగా జేసీ వర్గీయులకే కేసు పరిమితం చేశారు. సీఐ, కానిస్టేబుళ్లతో మాట్లాడేందుకు మీడియాకు అనుమతులు నిరాకరించారు. వైఎస్సార్ సీపీ తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డి మాట్లాడుతూ.. సీఐ హమీద్ ఖాన్ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులపై జరిగిన దాడి ఘటనలోనూ రాజకీయాలు సరికాదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగటం సరికాదని హితవుపలికారు. జేసీ వర్గీయుల దాడిలో గాయపడి కిమ్స్ సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కడప పోలీసులను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి పరామర్శించారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డికి సీఐ భారీ విందు
అనంతపురం, తాడిపత్రి: తాడిపత్రి పోలీసుల తీరు రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. అధికారపార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఇలా ఏకపక్షంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు అధికారులపై ఇటీవల ఉన్నతాధికారులు వేటు వేసిన విషయం విదితమే. తాజాగా తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ముచ్చుకోట నుంచి పెద్దపప్పూరు వరకు చేపట్టిన పాదయాత్రకు మొదట పోలీసులు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి నిరాకరించడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ సొంత మండలంలో పెద్దారెడ్డి పాదయాత్ర చేస్తే తమ ఇమేజీ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తమ అనుంగులైన పోలీసు అధికారులను ఉసిగొల్పారు. పాదయాత్రకు సిద్ధమైన పెద్దారెడ్డిని అరెస్ట్ చేయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అధికారపార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విపక్ష నాయకులు బహిరంగంగా విమర్శలు చేశారు. శాంతిభద్రతల సమస్యలకు కారణం పోలీసులే తాడిపత్రి ప్రాంతంలో శాంతిభద్రతలు తలెత్తడానికి కారణం పోలీసులే అన్న ఆరోపణలు విపక్ష పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. తాడిపత్రిలో పోస్టింగ్‌లకు జేసీ సోదరుల సిఫార్సుల కోసం పాకులాడి పోస్టింగ్‌లు తెచ్చుకున్నపోలీసులు స్వామి భక్తి చాటుకునేందుకు వారు చెప్పిందే తడవుడా ‘జీ హుజూర్’ అంటూ తలూపి న్యాయాన్యాయాలతో పని లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో చట్టం అనేది అధికారపార్టీ నేతలకు చుట్టంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు ఏకపక్షంగా వ్యహరించడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తన నివాసంలో ఎమ్మెల్యే జేసీకి విందు ఇస్తున్న సీఐ నారాయణరెడ్డి వివాదాస్పదమైనసీఐ నారాయణరెడ్డి పనితీరు తాడిపత్రిలో రూరల్ సీఐ నారాయణరెడ్డి పనితీరు తరచూ వివాదాస్పదమవుతోంది. ఎస్ఐలకు సీఐలుగా పదోన్నతులు ఇచ్చిన తరువాత మొట్టమొదటగా నారాయణరెడ్డి పేరే పరిశీలించారు. వాస్తవానికి ఎస్ఐగా పనిచేసిన చోటే సీఐగా తొలిపోస్టింగ్ ఇవ్వరు. అలాగే సీఐగా పదోన్నతి లభిస్తే రెండేళ్ల పాటు లూప్లైన్లో ఉంచాల్సి ఉంది. ఈ మేరకు కొన్ని రోజులు నారాయణరెడ్డిని పీటీసీకి పంపిన ఉన్నతాధికారులు..ఆ వెంటనే ఆయన ఎస్ఐగా ఎక్కడ పనిచేశారో అదే స్టేషన్‌కు సీఐగా పోస్టింగ్ ఇవ్వడం చాలా విమర్శలకు తావిస్తోంది. దీనికి కారణం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సిఫార్సే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు కృతజ్ఞతగా నారాయణరెడ్డి తన సొంత గ్రామం వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం లావనూరులో సీఐ నారాయణరెడ్డి భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆహ్వానించారు. అనుచరగణంతో లావనూరుకు వెళ్లిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి సీఐ నారాయణరెడ్డి అనూహ్యరీతిలో స్వాగతం పలికారు. తన గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో సీఐ నారాయణరెడ్డి ఎమ్మెల్యే జేసీపీఆర్ ఏది చెబితే దానికి తలూపి పాటించడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోందన్నది సుస్పష్టం. మరి స్వామి భక్తి చాటుకుంటున్న సీఐ నారాయణరెడ్డి వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
సూత్రధారి జేసీనే
అనంతపురం సప్తగిరి సర్కిల్: తాడిపత్రిలోని ప్రబోధానంద ఆశ్రమంపై పథకం ప్రకారమే దాడులు జరిగాయని, వీటి వెనుక సూత్రధారి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నర్సింహయ్య ధ్వజమెత్తారు. ఆదివారం అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ స్వార్థం, ఆధిపత్యం కోసం జేసీ సోదరులు ప్రజలను పావులుగా వాడుకుని బలి చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న పొలమడ, పెద్ద పొలమడ గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. ముందస్తు జాగ్రత్తల్లోనూ విఫలం ఆశ్రమ నిర్వాహకులు, గ్రామస్తులకు మధ్య గతంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం దారుణమని పైలా పేర్కొన్నారు. దాడులు జరిగిన వెంటనే ఎస్పీ అప్రమత్తం కావడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిందన్నారు. ప్రబోధానంద స్వామి ఆశ్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన భక్తులే అధికంగా ఉన్నారన్నారు. ఆశ్రమ నిర్వాహకులను, ఆశ్రమాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని ఎమ్మెల్యే జేసీ ప్రయత్నం చేసి, విఫలమైనప్పుడు గ్రామస్తులను అడ్డం పెట్టుకుని గొడవలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై గతంలోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని పైలా అన్నారు. ఎమ్మెల్యే తాను పెద్ద రౌడీని అని చెబుతూ పోలీసులను, పోలీస్ స్టేషన్లపై దాడులను చేస్తుంటారని, ఆయన దారినే అనుచరులూ ఆచరిస్తుంటారని తెలిపారు. ఆయన మితిమీరిన ఆగడాలకు తాడిపత్రి ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ప్రజా విశ్వాసం కోల్పోయి గొడవల ద్వారా భయోత్పాతం కల్పించి సామాన్య ప్రజల జన జీవనానికి భంగం కల్గిస్తున్నారని మండిపడ్డారు. జేసీ సోదరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే తాడిపత్రిని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి, ఐపీఎస్ అధికారిని నియమించి శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ రాజారాం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, వైఎస్సార్సీపీ నాయకులు రామశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పరిటాల రవికి భయపడి జేసీ ఊరు వదిలివెళ్లలేదా?
తాడిపత్రి : మూడు దశాబ్దాలుగా తాడిపత్రిలో రౌడీ రాజ్యం నెలకొందని, ఈ ప్రాంతాన్ని జేసీ సోదరులు సర్వనాశనం చేశారంటూ వైఎస్సార్ సీపీ నేత పైలా నరసింహయ్య విమర్శించారు. స్థానిక భగత్‌సింగ్ నగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ.. జేసీ సోదరుల నీచ సంస్కృతి జిల్లావాసులకు తెలిసిందేనన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు వారు పెట్టింది పేరన్నారు. అందితే జట్టు... అందకపోతే కాళ్లు పట్టుకునే మనస్తత్వం ఉన్న జేసీ సోదరులు.. గ్రామాల్లో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోస్తూ వచ్చారన్నారు. వారి స్వార్థానికి ఎందరో బలిపశువులయ్యారన్నారు. నేటికీ తాను పెద్ద రౌడీగా చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి.. పరిటాల రవి బతికున్నప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేయకుండా ఊరు వదిలి వెళ్లిన విషయం నేటికీ తాడిపత్రి వాసులు మరిచిపోలేదన్నారు. వీరిని నమ్మి మోసపోగూడదంటూ ప్రస్తుత మున్సిపల్ వైస్ చైర్మన్ జిలాన్‌బాషా, కౌన్సిలర్ డీవీ కుమార్‌కి హితవు పలికారు. జేసీ సోదరులను నమ్ముకున్న వారిలో పొట్టి రవి తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. వైఎస్సార్ సీపీ తాడిపత్రి సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జేసీ సోదరుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతూ వస్తోందన్నారు. దీనిని జీర్ణించుకోలేక వారు మతి చలించి మాట్లాడుతున్నారన్నారు. సమావేశంలో విజయమ్మ సేవా సమితి అధ్యక్షుడు సంపత్ కుమార్, బాలరాజు, నాయకులు బాణా నాగేశ్వరరెడ్డి, కంచెం రామోహ్మన్ రెడ్డి, పేరం అమర్నాథరెడ్డి, ప్రదీప్‌రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. -
డేరాబాబా కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు..
సాక్షి, అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డేరాబాబా కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని తాడిపత్రి తెలుగుదేశం నేతలు జగదీశ్వర్ రెడ్డి, రంగనాథ్ విమర్శించారు. బుధవారం వారిక్కడ మీడియాతో మాట్లాడుతూ జేసీ వర్గీయులు విచ్చలవిడిగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాపోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తాడిపత్రిలో ప్రజలకు ఉపయోగపడని పోలీస్ స్టేషన్లను మూసివేయాలని వారి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వారి దౌర్జన్యాలను అరికట్టలేకపోతే రౌడీయిజం చేసేందుకు వారికి లైసెన్సు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. తాడ్రిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వారన్నారు. -
జేసీ సోదరులు గైర్హాజరు!
అనంతపురం: తమ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హాజరైనప్పటికీ జేసీ దివాకర రెడ్డి సోదరులు మాత్రం హాజరుకాలేదు. తాడిపత్రిలోని గెర్డావ్ స్టీల్ ఫ్యాక్టరీ కార్యక్రమానికి ఎంపి జేసీ దివాకర రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి ఇద్దరూ గైర్హాజరయ్యారు. ఈ విషయమై ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వనందునే తాము ఆ కార్యక్రమానికి హాజరుకానట్లు తెలిపారు. తాను పరిశ్రమలకు వ్యతిరేకం కాదని చెప్పారు. **