
సాక్షి, అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డేరాబాబా కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని తాడిపత్రి తెలుగుదేశం నేతలు జగదీశ్వర్ రెడ్డి, రంగనాథ్ విమర్శించారు. బుధవారం వారిక్కడ మీడియాతో మాట్లాడుతూ జేసీ వర్గీయులు విచ‍్చలవిడిగా దౌర‍్జన్యాలకు పాల‍్పడుతున్నాపోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తాడిపత్రిలో ప్రజలకు ఉపయోగపడని పోలీస్ స్టేషన‍్లను మూసివేయాలని వారి డిమాండ్ చేశారు. ప్రభుత‍్వం వారి దౌర‍్జన్యాలను అరికట‍్టలేకపోతే రౌడీయిజం చేసేందుకు వారికి లైసెన‍్సు ఇవ‍్వాలని ఎద్దేవా చేశారు. తాడ్రిపత్రిలో ప్రజాస్వామ‍్యం ఖూనీ అయిందని వారన‍్నారు.
Comments
Please login to add a commentAdd a comment