
సాక్షి, అనంతపురం : తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకు గట్టి షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించగా.. ఆయన సమక్షంలో జేసీ బ్రదర్స్ ముఖ్య అనచరులు పార్టీలో చేరి ఊహించని గట్టి షాక్ ఇచ్చారు.. వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ అనంతరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకటనాయుడు, జేసీ ముఖ్య అనుచరుడు బోగాతి నారాయణరెడ్డి, సమీప బంధువు జేసీ చిత్తరంజన్ రెడ్డి, తాడిపత్రి టీడీపీ సీనియర్ నేతలు జగదీశ్వర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్, ఫయాజ్ బాషా, బ్రహ్మనందరెడ్డి, జయచంద్రారెడ్డిలు పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నియంత పాలనపై విసిగిపోయి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు వారంతా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment