
సాక్షి, అనంతపురం : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తాజాగా మరో కేసు నమోదైంది. జేసీ ట్రావెల్స్ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అంతకు ముందు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. బీఎస్-3 వాహనాలను బీఎస్ - 4 వాహనాలుగా మార్చి తమకు అమ్మారని.. నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
లారీ ఇంజిన్ నంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ప్రభాకర్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బీఎస్-3 వాహనాలను జేసీ బ్రదర్స్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించి ప్రైవేట్ ఆపరేటర్లకు విక్రయించిన విషయం తెలిసిందే. (చదవండి : వెలుగులోకి జేసీ అవినీతి బాగోతాలు)
Comments
Please login to add a commentAdd a comment