సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జేసీ ట్రావెల్స్‌పై నమోదైన 33 కేసుల్లో ఛార్జిషీట్ సిద్ధం చేశారు. తాడిపత్రి, అనంతపురం కోర్టుల్లో ఛార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు. టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి సహా మొత్తం 23 మందిపై ఫోర్జరీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే.
చదవండి: వైఎస్సార్‌సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం
సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. నిషేధిత 154 బస్సులు, లారీలను ఫోర్జరీ డాక్యూమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లతో బీఎస్-4 వాహనాలుగా చూపి అక్రమ రిజిస్ట్రేషన్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి పాల్పడ్డారు. నాగాలాండ్ రాష్ట్రం కోహిమా ఆర్టోవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆధారాలతో సహా కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment