
జేసీ ప్రభాకర రెడ్డి
అనంతపురం: తమ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హాజరైనప్పటికీ జేసీ దివాకర రెడ్డి సోదరులు మాత్రం హాజరుకాలేదు. తాడిపత్రిలోని గెర్డావ్ స్టీల్ ఫ్యాక్టరీ కార్యక్రమానికి ఎంపి జేసీ దివాకర రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి ఇద్దరూ గైర్హాజరయ్యారు.
ఈ విషయమై ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వనందునే తాము ఆ కార్యక్రమానికి హాజరుకానట్లు తెలిపారు. తాను పరిశ్రమలకు వ్యతిరేకం కాదని చెప్పారు.
**