
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. రవాణా శాఖ అధికారులు గురువారం జరిపిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఆరు జేసీ ట్రావెల్స్ బస్సులు పట్టుబడ్డాయి. సరైన రికార్టులు లేకపోవడంతో అధికారులు ఈ బస్సులను సీజ్ చేశారు. కాగా గడిచిన పది రోజుల్లో జేసీకి చెందిన ట్రావెల్స్‌ను సీజ్ చేయడం ఇది రెండో సారి. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లలో అక్రమాలు కారణంగా ఇటీవల 36 బస్సులు.. 18 కాంట్రాక్టు బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన జేసీ బ్రదర్స్ సరైన పర్మిట్లు లేకుండా బస్సులు నడపటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment