
సాక్షి, అనంతపురం : పోలీసులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై అనంతపురం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులతో బూట్లు నాకిస్తానంటూ రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో జేసీ దివాకర్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మండిపడ్డ పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్.. టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
జేసీ దివాకర్ రెడ్డిపై 153, 506 సెక్షన్ల కింద అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా జేసీ దివాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై సమగ్ర విచారణ చేస్తున్నామని, ఆయనపై చాలా మంది ఫిర్యాదులు అందాయని, 153, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment