
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భవనాన్ని జేసీ బ్రదర్స్ ఆక్రమించారంటూ బాధితుడు మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున తన కుటుంబసభ్యులతో కలిసి అనంతపురంలోని జేసీ ట్రావెల్స్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా మల్లికార్జున 2009లో బాబయ్య అనే వ్యక్తికి భవనాన్ని లీజుకివ్వగా , అదే భవనంలో దివాకర్రెడ్డి జేసీ ట్రావెల్స్ కార్యలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. 2009 నుంచి భవనంకు సంబంధించిన అద్దె చెల్లించలేదని మల్లిఖార్జున ఆరోపించారు. అన్యాయంగా తమ భవనాన్ని ఆక్రమించడమే కాకుండా తమ జోలికి వస్తే చంపుతానంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారంటూ మల్లిఖార్జున వాపోయారు. తమ భవనం నుంచి జేసీ ట్రావెల్స్ కార్యాలయాన్ని తరలించేవరకు తన పోరాటం ఆగదని మల్లిఖార్జున వెల్లడించారు. వారి బండారం బట్టబయలు: రోజా
Comments
Please login to add a commentAdd a comment