
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసుకు సంబంధించి కందిగోపుల మురళి సంచలన విషయాలు బయటపెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల రవీంద్ర హత్య కేసులో జేసీ దివాకర్ రెడ్డి పాత్ర ఉంది. హత్యకు ఉపయోగించిన తుపాకులు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సరఫరా చేశారు. హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో లభ్యమైన రివాల్వర్ కూడా జేసీ ఇచ్చిందే. నేను జేసీ వద్ద చాలాకాలం పనిచేశా. పరిటాల రవి హత్యలో జేసీ పాత్రపై విచారించాలని గతంలో మాజీ మంత్రి పరిటాల సునీత తండ్రి కొండన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు జేసీకి లేదు. జిల్లాలో ఆయన చేస్తున్న క్రిమినల్ రాజకీయాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment