'నా అవసరం చంద్రబాబుకు చాలా ఉంది ' | JC Diwakar reddy sensational comments on Sonia Gandhi, Rahul gandhi and Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'నా అవసరం చంద్రబాబుకు చాలా ఉంది '

Published Thu, Jun 19 2014 4:00 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

'నా అవసరం చంద్రబాబుకు చాలా ఉంది ' - Sakshi

'నా అవసరం చంద్రబాబుకు చాలా ఉంది '

నా అవసరం అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు ఉందని, అలాగే ఆయన అవసరం తనకు ఉన్నాయంటూ అనంతపురం లోక్సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే తామిద్దరం ఎన్నికల మందు కలిశామని తెలిపారు. అనంతపురం జిల్లాలో తనను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేయలేరని చెప్పారు. పరిటాల సునీత పౌరసరఫరాల శాఖ మంత్రి అయిన జిల్లాలో తన మాటే నెగ్గుతుందని ఆయన స్ఫష్టం చేశారు. టీడీపీలో చేరినప్పుడు, ఎన్నికల సందర్బంగా జరిగిన ప్రచారంలో మాత్రమే పచ్చకండువా కప్పుకున్నానని ఆయన అన్నారు.

 

ఇప్పటికి తనకు పచ్చ చొక్క ఒక్కటి కూడా లేదని తెలిపారు. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైయ్యారు. అనంతరం అసెంబ్లీ లాబీలో జేసీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ,  ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శకం ముగిసిందని అన్నారు. రాజీవ్, సోనియాల కుమార్తె ప్రియాంక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహారించిన ఫలితం మాత్రం శూన్యమని జేసీ వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement