
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైడ్రామా మొదలు పెట్టారు. సోదరుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి ఈనెల నాలుగో తేదిన తాడిపత్రిలో ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే తాడిపత్రిలో 144 సెక్షన్ విధించడంతో పోలీస్ యాక్ట్ 30 అములులోకి వచ్చింది. దీంతో ఏ కార్యక్రమానికైనా పోలీసుల అనుమతి తప్పనిసరి. అయితే పోలీసులను రెచ్చగొట్టేందుకు జేసీ బ్రదర్స్ దీక్షకు సిద్ధమయ్యారు. తమపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదంటూ జేసీ బ్రదర్స్ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఇద్దరు దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆస్మిత్ రెడ్డిలపై ట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసుల నుంచి తప్పించుకునేందుకే జేసీ బ్రదర్స్ దీక్ష పేరుతో డ్రామాలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. చదవండి: తాడిపత్రిలో 144 సెక్షన్ : ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment