సాక్షి, హైదరాబాద్: దేశంలో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం మొదలు పెట్టింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బహిరంగంగా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో డబ్బు లేకపోతే జనం ఓటేయడానికి ముందుకు రావడం లేదని కూడా దివాకర్‌రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి ఈ విధంగా ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టుగా తెలుస్తోంది.
‘ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం దేశంలో మొదలు పెట్టిందే చంద్రబాబు దివాకర్ రెడ్డి గారూ. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తరువాత 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రూ. 500 నోట్లు వెదజల్లిన చరిత్ర చంద్రబాబుది. ప్రస్తుత ఎన్నికల్లో మీ పార్టీ పెట్టిన ఖర్చు రూ. 20 వేల కోట్ల పైనే. అయినా ప్రజలు టీడీపీకి కర్రు కాల్చి వాత పెట్టార’ని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం దేశంలో మొదలు పెట్టిందే చంద్రబాబు దివాకర్ రెడ్డి గారూ. వెన్నుపోటు తర్వాత 1996 లోక్ సభ ఎన్నికల్లో రూ.500 నోట్లు వెదజల్లిన చరిత్ర బాబుది. ప్రస్తుత ఎన్నికల్లో మీ పార్టీ పెట్టిన ఖర్చు రూ.20 వేల కోట్ల పైనే. అయినా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) 23 April 2019
Comments
Please login to add a commentAdd a comment