
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చుక్కెదురైంది. త్రిసూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజ్ మంజూరు వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై జేసీ కుటుంబ స భ్యులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. త్రిసూల్ సిమెంట్ ఫ్యాక్టరీని నిర్ణీత సమయంలో నిర్మించలేదని, దానికి కేటాయించిన లైమ్ స్టోన్ గనులు రద్దు చేయాలన్న పిటిషన్‌పై హై కోర్టులో బుధవారం విచారణ జరిగింది.
ప్రతివాదులుగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమార్తె, కోడలును చేర్చి నోటీసులు జారీ చేసింది. లైమ్ స్టోన్ గనుల లీజు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని నోటీసులో పేర్కొంది. తదుపరి విచారణను న్యాయస్థానం డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. బినామీలతో జేసీ చేస్తున్న దందాపై 2011లోనే పిటిషన్ వేసినట్లు తాడిపత్రికి చెందిన మురళీప్రసాద్ రెడ్డి చెప్పారు. తమకు న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment