ఇటీవల తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరులకు రెండు టికెట్లు ఎలా కేటాయిస్తారని రాయదుర్గం టీడీపీ ఇంఛార్జ్ దీపక్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని ప్రశ్నించారు. మంగళవారం అనంతపురంలో చంద్రబాబుపై దీపక్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
స్థానికంగా ఎంతో కాలంగా పార్టీకి అంకిత భావంతో పని చేస్తుంటే నిన్న కాక మొన్న వచ్చిన నాయకులకు సీట్లు కేటాయించడం ఎంత వరకు సమంజసమంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. రాయదుర్గం అసెంబ్లీ స్థానం కాలువ శ్రీనివాస్కు కేటాయించిన ఉరుకునే ప్రసక్తి లేదని దీపక్ రెడ్డి హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని దీపక్ రెడ్డి స్పష్టం చేశారు.