తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జేసీ దివాకరరెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమేశ్ రెడ్డి బహిరంగం చర్చ నిర్వహించారు. జేసీ సోదరుల అరాచకాలపై ధ్వజమెత్తారు. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన జేసీ కుటుంబం ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు.