
సాక్షి, అనంతపురం : జేసీ బ్రదర్స్ దగ్గర ఉండి తమ ఆశ్రమంపై దాడులు చెయించినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రబోదానంద స్వామి ఆశ్రమ ప్రతినిధులు విమర్శించారు. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. కోర్టు ఆదేశాలను భిన్నంగా స్థానికులను సైతం బయటకు పంపారని మండిపడ్డారు. జేసీ బ్రదర్స్‌పై తాము చేసిన ఫిర్యాదులను పోలీసులు స్వీకరించడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకూ పోస్ట్ ద్వారా 75 ఫిర్యాదులు చేశామన్నారు. ప్రబోదానంద స్వామి భక్తులపై 30 కేసులు పెట్టారు కానీ, జేసీ దివాకర్ రెడ్డి, ఆయన వర్గీయులపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. అధికారుల ఏకపక్ష వైఖరిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment