
'ఎవరికీ భయపడలేదు...భయపడం'
అనంతపురం: టీడీపీ నేతల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ...'మేం అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజలతోనే ఉంటాం. మాకు డబ్బులు, పదవులు, కాంట్రాక్టులు అవసరం లేదు. పరిటాలకు భయపడి బెంగళూరుకు పారిపోయిన చరిత్ర జేసీ దివాకర్ రెడ్డి సోదరులది. మేం ఎప్పుడు ఎవరికీ భయపడలేదు...భయపడం' అని అన్నారు.