జేసీ బ్రదర్స్ను వెంటనే అరెస్ట్ చేయాలి: ఓయూ జేఏసీ | Osmania University jac demands jc brothers arrest due to paelm bus fire accident | Sakshi
Sakshi News home page

జేసీ బ్రదర్స్ను వెంటనే అరెస్ట్ చేయాలి: ఓయూ జేఏసీ

Published Sun, Jan 5 2014 1:59 PM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

జేసీ ట్రావెల్స్ యజమానులైన జేసీ బ్రదర్స్ను వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే పాలెం బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఓయూ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

జేసీ ట్రావెల్స్ యజమానులైన జేసీ బ్రదర్స్ను వెంటనే అరెస్ట్ చేయాలని,  అలాగే పాలెం బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఓయూ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లక్డీకపూల్లో జబ్బార్ ట్రావెల్స్ ఎదుట ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన నిర్వహించింది. ఆ ఆందోళన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఓయూ విద్యార్థులు పాల్గొన్నారు. జబ్బార్ ట్రావెల్స్, జేసీ బ్రదర్స్కు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జబ్బార్ ట్రావెల్స్ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలిన ఓయూ విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాంతో పోలీసులు ఓయూ విద్యార్థులును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.



మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో ఇటీవల వోల్వో బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 46 మంది ప్రయాణికులు మరణించారు. అయితే ఆ బస్సు జబ్బార్ ట్రావెల్స్ పేరుతో తిరుగుతున్న కాగితాలు మాత్రం జేసీ బ్రదర్స్పేరుపై ఉన్నాయని దర్యాప్తులో తెలింది. దాంతో బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం వారి విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తుంది. దాంతో పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజల నుంచి ప్రభుత్వానికి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement