సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా తాడ్రిపత్రిలో జేసీ సోదరుల ఆగడాలు మితిమీరుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఇక‍్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారపార్టీకి చెందిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులను అసభ్య పదజాలంతో తిడుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో సామాన్యులకే కాకుండా పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులతో పాటు పోలీసులకు కూడా గన్‌మెన్లను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment