gunmans
-
ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!
నంగర్హర్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అక్కడ రోజుకో ఆంక్ష అన్నట్లే ఉంది. ఇప్పటికే ప్రజలపై ఎన్నో ఆంక్షలు విధించిన తాలిబన్ ప్రభుత్వం.. తాజాగా ట్యాక్సీ డ్రైవర్లకు పలు ఆంక్షలు విధించింది. ట్యాక్సీల్లో ముష్కరులను ఎవరినైనా తీసుకొస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తూర్పు నంగర్హార్ ప్రావిన్స్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్లను తాలిబాన్ అనుబంధ సంస్థలకు సంబంధించిన వారిని మినహాయించి ఇతర ముష్కరులను ఎవ్వరిని మీరు ట్యాక్సిల్లో ఎక్కించుకోని తీసుకురావద్దని ఆదేశించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!) ఆ ప్రావిన్స్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్ల అందుకు అంగీకరించినట్లు వెల్లడించింది. అదే సమయంలో టాక్సీలలో ఎవరైనా అనుమానాస్పద గన్మెన్లను చూసినప్పుడు అధికారులకు తెలియజేయాలని ప్రజలకు తాలిబన్లు ఆదేశించినట్లు తెలిపింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రావిన్సులలో మోహరిస్తున్న ఐఎస్ఐఎస్-కే ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు ఇలాంటి ఆదేశాలు జారిచేసిందని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. (చదవండి: ‘ప్రవేశం లేదు’ బోర్డు.. ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి!) -
పోస్టల్ బ్యాలెట్ వద్ద చింతమనేని మాజీ గన్‌మెన్ హల్చల్
-
జేసీ సోదరుల ఆగడాలు
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా తాడ్రిపత్రిలో జేసీ సోదరుల ఆగడాలు మితిమీరుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారపార్టీకి చెందిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులను అసభ్య పదజాలంతో తిడుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో సామాన్యులకే కాకుండా పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులతో పాటు పోలీసులకు కూడా గన్మెన్లను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. -
విచ్చలవిడిగా కాల్చాడు..
లాస్ ఏంజిలెస్: అమెరికాలో ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు చనిపోగా, 12 మంది గాయపడ్డారు. గాయాలపాలైనవారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుల్లో అతని రూమ్మేట్తో పాటు ఓ మహిళ ఉన్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని ఓ గ్రామీణ ప్రాంతంలో మిలిటరీ దుస్తుల్లో ఓ దుండగుడు మంగళవారం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఓ పాఠశాలతో పాటు మరికొన్ని ప్రాంతాలను అతడు లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ తరువాత భద్రతా దళాలు ఆ సాయుధుడిని హతమార్చాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని కెవిన్ నీల్గా గుర్తించారు. పొరుగింట్లో ఉంటున్న వ్యక్తిని కత్తితో పొడిచాడన్న ఆరోపణలపై అరెస్టయిన అత ను ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. అయినా నీల్‌కు ఆయుధాలు అందుబాటులో ఉండటంపై స్థానికులు సందేహం వ్యక్తం చేశారు. ఇరుగుపొరుగు వారితో గొడవలతో విసిగిపోయి అతడు కాల్పులకు దిగినట్లు అధికారులు భావిస్తున్నారు. కారులో ప్రయాణిస్తూ కాల్పులు పది రోజుల క్రితం టెక్సాస్‌లో చర్చిపై జరిగిన దాడిలో 26 మంది చనిపోయిన ఘటనను మరువక ముందే అమెరికా మరోసారి కాల్పులతో ఉలిక్కిపడింది. విస్తరిస్తున్న తుపాకీ సంస్కృతిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి రాంచో తెహమా రిజర్వుతో పాటు ఓ స్కూలు సహా ఇతర ప్రాంతాల్లోనూ నీల్ కాల్పుల పరంపర కొనసాగింది. కనిపించిన ప్రతి ఒక్కరిపై బుల్లెట్లు ఎక్కుపెట్టాడు. సొంత రూమ్మేట్పై కూడా కాల్పులు జరిపాడు. మొదట పక్కింటి వ్యక్తి కారు దొంగిలించి దానిలో ప్రయాణిస్తూనే కాల్పులకు తెగబడ్డాడు. ఆ తరువాత ఓ ఎలిమెంటరీ స్కూలులోకి చొరబడటానికి ప్రయత్నించినా దాని గేటు మూసివేసి ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో నీల్ స్కూలు నుంచి బయల్దేరి కాల్పులు కొనసాగిస్తుండగా ఓ సందర్భంలో అతని వాహనం ప్రమాదానికి గురైంది. అయినా అంతటితో ఆగకుండా మరో కారు దొంగిలించి కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. చివరికి సుమారు 100 మందితో కూడిన పోలీసుల బృందం చేతిలో హతమయ్యాడు. అతడు కారులో ప్రయాణిస్తూ విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు వివరించారు. ఆ గన్‌మన్‌కు నేరచరిత్ర ఉందని తెహమా కౌంటీ అధికారి ఫిల్ జాన్స్టన్ చెప్పారు. స్కూలు వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయని, కారులో ప్రయాణిస్తున్న ఓ విద్యార్థి తల్లి తీవ్రంగా గాయపడిందని వెల్లడించారు. -
ప్లీజ్.. గన్‌మెన్‌ను ఇవ్వరూ
సాక్షి, హైదరాబాద్: తమకు గన్మెన్లు ఇవ్వాలంటూ పలువురు రాజకీయ నేతలు చేస్తున్న ఒత్తిళ్లు.. పోలీసు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు రావడం.. వాటిలో పోటీచేస్తున్న అభ్యర్థులంతా తమకు వైరి పక్ష నుంచి హాని ఉందని, భద్రత కల్పించాలని కోరుతూ అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే జెడ్‌ప్లస్ మొదలుకుని ఎక్స్ కేటగిరి వరకు దాదాపు 800 మంది రాజకీయ ప్రముఖులకు వివిధ విభాగాలు భద్రత కల్పిస్తున్నాయి. ఇందుకోసం అదనపు ఎస్పీ ర్యాంకు అధికారి స్థాయి నుంచి కానిస్టేబుళ్ల వరకు దాదాపు ఆరున్నర వేల మంది పనిచేస్తున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిలకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎస్ఎస్జీ) నుంచి రక్షణ లభిస్తోంది. ఎంపీల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు వారికి ఉన్న ముప్ప తీవ్రతను బట్టి వివిధ కేటగిరిల కింద భద్రత కల్పిస్తున్నారు. ఇలా గన్‌మెన్ సౌకర్యం పొందినవారిలో సర్పంచ్‌లు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ఎన్నికలు రావడంతో ఇప్పటికే సెక్యూరిటీ లేని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమకు గన్మెన్లు కావాలంటూ పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు నాయకులైతే.. తమ వెంట గన్మెన్లు ఉండటం ఓ హోదాగా భావించి, తమకున్న ఆర్థిక బలంతో గన్‌మెన్ కోసం తాపత్రయపడుతున్నారని భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కావడంతో దీనిపై ఎంత పెద్దస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా, ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని తెలిసింది. కొందరి పిటిషన్లను పరిశీలించినా, వారికి సెక్యూరిటీ నిజంగా అవసరమా లేదా అనేది విచారించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటున్నారు. ఓవైపు ఎన్నికల బందోబస్తుకు, మరోవైపు ప్రచారానికి వస్తున్న వీవీఐపీలకు భద్రత కల్పించడానికే సిబ్బంది సరిపోక సతమతమవుతున్నామని పోలీసు అధికారి తెలిపారు.