సాక్షి, అనంతపురం: టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. తమను సంప్రదించిన ఈడీ అధికారులకు.. ఏపీ రవాణా శాఖ అధికారులు వివరాలు అందజేశారు. ఫోర్జరీ వ్యవహారంపై ఈడీ అధికారులకు పూర్తి వివరాలు అందజేశారు ఏపీ రవాణా శాఖ అధికారులు.
‘‘బీఎస్-3 వాహనాలు వాడొద్దని సుప్రీంకోర్టు నిషేధించింది. స్క్రాప్ కింద కొనుగోలు చేసిన 154 వాహనాలకు నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకే జేసీ ట్రావెల్స్ పై 27 క్రిమినల్ కేసులు పెట్టాం. పైగా నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్, బోగస్ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారు.
..ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ కు ప్రత్యేక నివేదిక పంపాం. ఆ వివరాల ఆధారంగానే జేసీ బ్రదర్స్ పై విచారణ జరుగుతోందని భావిస్తున్నాం. ఏఏ అంశాలపై ఈడీ విచారణ చేస్తోందో మాకు తెలియదు’’ అని ఏపీ రవాణాశాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment