మాజీ ఎంపీపీ రఘునాథరెడ్డి, టీడీపీ నాయకులు రంగారెడ్డి, రవీంద్రారెడ్డిలను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్న పెద్దారెడ్డి, నాయకులు
సాక్షి, పెద్దవడుగూరు: తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ సోదరులకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. వారి అరాచకాలు భరించలేని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎన్నికల వేళ వైఎస్సార్ సీపీకి మద్దతు తెలుపుతూ ఆపార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది వైఎస్సార్ సీపీ కండువాలు వేసుకోగా...శుక్రవారం మండల పరిధిలోని చిత్రచేడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, జేసీ సోదరుల ప్రధాన అనుచరుడు రఘునాథరెడ్డి, ఆయన కుమారులు రంగారెడ్డి, రవీంద్రారెడ్డిలతో కలసి తాడిపత్రి వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ, ఏళ్లుగా జేసీ సోదరులకు అండగా నిలిచినా...తమకు కనీస గౌరవం, గుర్తింపు ఇవ్వలేదన్నారు. పైగా టీడీపీ పాలనలో తాడిపత్రిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఇక ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదల అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అందువల్లే వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపేందుకు 150 మంది అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపునకు తనవంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment