
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ అరాచకాలు తీవ్రమయ్యాయని వైఎస్ఆర్‌సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. పోలీసు స్టేషన్‌లో టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్దారెడ్డి మాట్లాడుతూ.. సాక్షాత్తు పోలీసులనే బెదిరించడం జేసీ బ్రదర్స్ నిజస్వరూపానికి నిదర్శనమన్నారు.
పోలీసుల విధులను అడ్డుకున్న జేసీ బ్రదర్స్, అనుచరులపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. రక్షణ కల్పించే వారినే బెదిరించి యుద్ధ వాతావరణం సృష్టించారు. వారి దౌర్జన్యాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ఉద్దేశించి అనంతపురం మేయర్ స్వరూప బుధవారం తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment