ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకు సాయాన్ని అందిస్తే చైనాపై ఆంక్షలు విధించడానికి అమెరికా రెడీ అవుతోంది. ఈ విషయమై ముఖ్యంగా జీ7 సముహంలోని దేశాల మద్దతు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే అమెరికా ఏవిధమైన ఆంక్షలు విధించాలనుకుంటదనేది స్పష్టం కాలేదు. వాస్తవానికి ఇటీవలే వాషింగ్టన్ దాని మిత్ర దేశాలు రష్యాకు ఆయుధాలు అందించడానికి చైనా యత్నిస్తున్నట్లు ఆరోపణలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలను చైనా తీవ్రంగా ఖండించింది. అలాగే ఈవిషయమై అమెరికా ఎలాంటి ఆధారాలను చూపలేదు.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశం తోపాటు యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్, చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ ఈ మధ్య జరిగిన వ్యక్తిగత సమావేశంలో కూడా వారు చైనాను నేరుగానే హెచ్చరించారు. రష్యాకు చైనా మద్దతును కట్టడి చేసేలా బైడెన్ పరిపాలన యంత్రాంగం ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తోసహా, దౌత్య స్థాయిలో చర్యలు తీసుకునేలా రంగం సిద్ధం చేసింది. దీన్ని ఏడాది క్రితమై అమలు చేసిందని, రష్యాపై ఆంక్షలకు మద్దతు ఇచ్చిన దేశాల సముహంతో బీజింగ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని అనుకున్నట్లు సమాచారం.
నిఘా వర్గాల ప్రకారం..
రష్యాకు సాధ్యమైన సైనిక సహాయాన్ని అందించడం గురించి పరిగణలోకి తీసుకుంటే చైనా గురించి వస్తున్న వాదనలను తక్కువ దేశాలే సమర్థిస్తున్నాయి. యూఎస్ మిత్ర దేశాలకు సంబంధించినంత వరుకు చైనా కచ్చితంగా సాయం చేసే అవకాశం ఉందంటూ పలు కారణాలను చెబుతున్నాయి. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడికి కొద్ది క్షణాల ముందు రష్యాతో పరిమితులు లేని భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
ఈ ప్రకటనే చైనాపై పలు అనుమానాలు వ్యక్తమయ్యేందుకు దారితీసింది. అదీగాక జీ7 ఫ్రంట్‌లో ఈ విషయమే చర్చించి చైనాపై వివరణాత్మక చర్యలు తీసుకునేలా దృష్టి సారించాలని చూస్తోంది యూఎస్. ఇదిలా ఉండగా, గత వారం చైనా సమగ్ర కాల్పుల విరమణ కోసం 12 పాయింట్ల పత్రాన్న సైతం విడుదల చేయడం గమనార్హం.
చైనాని కట్టడి చేయడం సాధ్యమేనా!
రష్యాకి యుద్ధ సామాగ్రి తక్కువగా ఉండటంతో చైనా నుంచి ఆయుధ సరఫరా రష్యాకి అనుకూలంగా మారతుందని ఉక్రెయిన్ మద్ధతుదారులు భయాపడుతున్నారు. ఐతే ఫిబ్రవరి 24 జీ7 ప్రకటనలో ఉక్రెయిన్‌పై దాడి జరిగి ఏడారి పూర్తి అయిన సందర్భంగా.. రష్యా యుద్ధానికి అవసరమైన వస్తుపరమైన సాయాన్ని అందించకూడదు లేదంటే దీనికి తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పిలుపునిచ్చింది వాషింగ్టన్.
అంతేగాదు చైనా పేరుని ప్రస్తావించకుండానే రష్యా ఆంక్షల నుంచి తప్పించుకునేలా సహాయపడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కంపెనీలపై యూఎస్ జరిమానాలు విధించింది. చైనాపై ఆంక్షలు విధించడంలో అమెరికాకు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన ఐరోపా, ఆసియాలనే ఏకతాటిపై తీసుకురావడం పెను సవాలుగా ఉంది. ఎందుకంటే.. జర్మనీ నుంచి దక్షిణ కొరియా వరుకు ఉన్న అమెరికా మిత్ర దేశాలు చైనాను దూరం పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నాయి.
(చదవండి: అందుకేనా! రష్యా భారత్ చమురు మార్కెట్ వైపే మొగ్గు చూపుతోంది)
Comments
Please login to add a commentAdd a comment