G7 Countries
-
G7 Summit 2024: చైనా అండతోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం
రోమ్: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రెండేళ్లకుపైగా దాడులు కొనసాగించే శక్తి రష్యాకు ఎలా వచి్చంది? అమెరికాతోపాటు పశి్చమ దేశాలు డ్రాగన్ దేశం చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. చైనా అండదండలతోనే ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోందని, సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని జీ7 దేశాలు ఆరోపించాయి. ఇటలీలో సమావేశమైన జీ7 దేశాల అధినేతలు తాజాగా ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అండ చూసుకొని రష్యా రెచి్చపోతోందని ఆరోపించారు. రష్యా యుద్ధ యంత్రానికి చైనానే ఇంధనంగా మారిందని జీ7 దేశాలు మండిపడ్డారు. రష్యాకు మిస్సైళ్లు డ్రోన్లు చైనా నుంచే వస్తున్నాయని ఆక్షేపించారు. జీ7 దేశాలు సాధారణంగా రష్యాను తమ శత్రుదేశంగా పరిగణిస్తుంటాయి. ఈ జాబితాలో ఇప్పుడు చైనా కూడా చేరినట్లు కనిపిస్తోంది. మారణాయుధాలు తయారు చేసుకొనే పరిజ్ఞానాన్ని రష్యాకు డ్రాగన్ అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు చైనా నేరుగా ఆయుధాలు ఇవ్వకపోయినా ఆయుధాల తయారీకి అవసరమైన విడిభాగాలు, ముడి సరుకులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తోందని ఆక్షేపించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన ఉక్రెయిన్‌లో మారణహోమం సృష్టించేలా రష్యాకు సహకరిస్తున్న దేశాలపై, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకతప్పదని జీ7 దేశాల అధినేతలు తేలి్చచెప్పారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధమైన యుద్ధానికి మద్దతివ్వడం మానుకోవాలని హితవు పలికాయి. ఉక్రెయిన్‌పై దాడుల తర్వాత రష్యాపై పశి్చమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో తమకు అవసరమైన సరుకులను చైనా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటోంది. అలాగే రష్యా నుంచి చైనా చౌకగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహరించుకుంటున్నాయి. టిబెట్, షిన్‌జియాంగ్‌తోపాటు హాంకాంగ్‌లో చైనా దూకుడు చర్యలను జీ7 సభ్యదేశాలు తప్పుపట్టాయి. చైనా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఆరోపించాయి. మరోవైపు డ్రాగన్ దేశం అనుసరిస్తున్న వ్యాపార విధానాలను అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు తప్పుపడుతున్నాయి. ఎలక్ట్రికల్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులు, సోలార్ ప్యానెళ్ల తయారీకి చైనా ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోంది. దీంతో ఇవి చౌక ధరలకే అందుబాటులో ఉంటూ విదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా ఆయా దేశాల్లో వీటిని తయారు చేసే కంపెనీలు గిరాకీ లేక మూతపడుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల్లో కోతపడుతోంది. చైనా దిగుమతులతో పశి్చమ దేశాలు పోటీపడలేకపోతున్నాయి. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టడానికి చైనా ఉత్పత్తులపై అమెరికాతోపాటు ఈయూ దేశాలు భారీగా పన్నులు విధిస్తున్నాయి. -
జీ–7 అసంబద్ధ నిర్ణయం
పేరుకి సంపన్న దేశాలే. ప్రపంచాన్ని ఇప్పటికీ శాసిస్తున్నవే. స్వయంకృతం కావొచ్చు... అంతర్జాతీయ పరిణామాల పర్యవసానం కావొచ్చు ఆ దేశాలకూ సమస్యలుంటాయి. ఇటలీలో గురువారం ప్రారంభమైన జీ–7 దేశాల మూడురోజుల శిఖరాగ్ర సదస్సు ఈ పరిస్థితిని ప్రతిబింబించింది. చుట్టూ అనిశ్చితి, భవిష్యత్తుపై నిరాశా నిస్పృహలు వాటిని పీడిస్తున్నాయి. ఉన్న సమస్యలు చాల్లేదన్నట్టు అమెరికా అధ్యక్ష పీఠం మళ్లీ డోనాల్డ్ ట్రంప్‌కు దక్కవచ్చన్న అంచనాలు వాటిని వణికిస్తున్నాయి. మూడేళ్ల క్రితం పరిస్థితి వేరు. అప్పటికి ట్రంప్ నిష్క్రమించి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడై శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. వస్తూనే అందరికీ అభయమిచ్చారు. మళ్లీ ప్రపంచ సారథ్యాన్ని అమెరికా స్వీకరించి జీ–7కు అన్నివిధాలా అండదండలందిస్తుందని పూచీపడ్డారు. అదే బైడెన్ గురువారం సదస్సుకు హాజరైనప్పుడు వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ యుద్ధం ఎడతెగకుండా సాగుతోంది. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ సరేసరి. పాలస్తీనాపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు పాశ్చాత్య దేశాలు, అమెరికా మద్దతిస్తున్నాయన్న ఆగ్రహంతో 1973లో ఒపెక్ దేశాలు చమురు సంక్షోభం సృష్టించినప్పుడు దానికి జవాబుగా జీ–7 ఆవిర్భవించింది. యాభైయ్యేళ్లు గడిచాక ఇప్పటికీ ఇజ్రాయెల్ తీరుతెన్నులు మారలేదు. అమెరికా మాత్రం ఆయుధాలందిస్తూనే గాజాలో దాడులు నిలపాలని ఇజ్రాయెల్‌ను బతిమాలుతోంది. మరోపక్క ఇటీవలే జరిగిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎన్నికల్లో యూరొప్ రాజకీయ ముఖచిత్రం మారుతున్న వైనం వెల్లడైంది. ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీల్లో మితవాద పక్షాలు బలపడుతున్న ఆనవాళ్లు కనబడుతున్నాయి. అసలు జీ–7కు ఆతిథ్యమిస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీయే మితవాద పక్షానికి చెందినవారు. వీటన్నిటికీ అదనంగా ట్రంప్ సమస్య తోడైతే జీ–7 దేశాధినేతలు నిశ్చింతగా ఎలా ఉండగలరు?ఇలా పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయినా ఈ ఏడాది ఆఖరుకల్లా ఉక్రెయిన్‌కు 5,000 కోట్ల డాలర్ల (రూ. 4లక్షల కోట్లుపైగా) రుణం అందించాలని గురువారం జీ–7 అధినేతలు తీర్మానించక తప్పలేదు. ఇది సాధారణ సాయమైతే రష్యా కూడా ఎప్పటిలా ఇది సరికాదని ఖండించి ఊరుకునేది. కానీ తాజా నిర్ణయంపై తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే దురాక్రమణ యుద్ధం తర్వాత అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో రష్యాకున్న 30,000 కోట్ల డాలర్ల విలువైన స్థిరాస్తులతోపాటు నగదు రూపంలోవున్న సంపదను స్తంభింపజేశారు. ఇప్పుడు ఉక్రెయిన్‌కు ఆ ఆస్తులపై ఆర్జించిన వడ్డీనుంచే రుణం అందజేయబోతున్నారు. నిజానికి గత రెండేళ్లుగా అమెరికా ఈ ప్రతిపాదన చేస్తున్నా ఈయూ దేశాలు తాత్సారం చేస్తున్నాయి. ఆ పని చేస్తే రష్యాను మరింత రెచ్చగొట్టినట్టు అవుతుందనీ, పొరుగునేవున్న తమపై అది నేరుగా దాడికి దిగే ప్రమాదం ఉంటుందనీ భావించాయి. కానీ అమెరికా ఎలాగైతేనేం నచ్చజెప్పి ఒప్పించింది. ఈయూలో ఎప్పుడూ భిన్న స్వరం వినిపించే ఫ్రాన్స్ బాహాటంగానే అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించింది. జీ–7 దేశాలన్నీ విరాళాలు సమకూర్చి, ప్రపంచ దేశాలనుంచి విరాళాలు సేకరించి ఈ రుణాన్ని అందిద్దామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సూచించారు. కానీ చివరకు అమెరికా ఒత్తిడితో రష్యా ఆస్తులనుంచి వచ్చిన వడ్డీనుంచే ఇవ్వాలని తీర్మానించారు. ‘ఇది నేరపూరిత చర్య. మానుంచి దుఃఖాన్ని మిగిల్చే స్పందన చవిచూడాల్సి వస్తుంది సుమా!’ అని రష్యా హెచ్చరించింది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఏ దేశమైనా వేరే దేశం ఆస్తుల్ని స్తంభింపజేయటం పెద్ద కష్టం కాదు. కానీ వాటిని వినియోగించటానికి ఇప్పటికైతే న్యాయబద్ధమైన ప్రాతిపదికగానీ, విధానంగానీ లేవు. అమెరికా తనవరకూ చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉక్రెయిన్ పౌరుల ఆర్థిక పునర్నిర్మాణం, అవకాశాల మెరుగుదల పేరిట రెపో చట్టం తీసుకొచ్చింది. ఈయూ ఇలాంటి చట్టమేమీ లేకుండానే రష్యా ఆస్తులనుంచి వచ్చిన లాభార్జనను పక్కనబెట్టింది. ఇప్పుడు జీ–7 అమెరికా మాదిరిగా ఒక చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రాతిపదిక లేకుండా, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల ప్రమేయం లేకుండా ఏవో కొన్ని దేశాలు ఈ తరహా చర్యలకు సిద్ధపడటం అనర్థదాయకం. ఇప్పటికే అమెరికా, పాశ్చాత్య దేశాలకు రష్యా ఒక హెచ్చరిక చేసింది. అగ్రరాజ్యాలు సరఫరా చేసిన భారీ విధ్వంసక ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే దాని పర్యవసానాలను ఆ దేశాలు కూడా అనుభవించాల్సి వస్తుందన్నది ప్రకటన సారాంశం. యుద్ధం మొదలైన నాటినుంచీ రష్యా ఆస్తులను చెరబట్టిన అగ్రరాజ్యాలు ఈ రెచ్చగొట్టే చర్యకు కూడా సిద్ధపడ్డాయంటే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచటమే అవుతుంది.బైడెన్‌కూ, ట్రంప్‌కూ మధ్య ఒక్క చైనా విషయంలో మాత్రమే ఏకాభిప్రాయం ఉంది. దానిపై భారీగా సుంకాలు విధించాలన్నదే ఇద్దరి ఆలోచన. కానీ ఈయూ, నాటో, జీ–7లపై ట్రంప్ గతంలో కారాలూ మిరియాలూ నూరేవారు. 2018లో కెనడాలో జీ–7 సదస్సు జరిగినప్పుడు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందంటూ ప్రకటించిన వెంటనే ట్రంప్ అది అబద్ధమని కొట్టిపారేశారు. సంస్థలో రష్యాను చేర్చుకోవాలని ఒత్తిడి చేశారు. ఇటీవలే ఆయన నాటో దేశాలను తీవ్రంగా హెచ్చరించారు కూడా. తాను అధికారంలోకొచ్చాక నాటోనుంచి తప్పుకుంటామనీ, అటుపై రష్యా ఆ దేశాలను ఏంచేసినా పట్టించుకోబోమనీ తెలిపారు. ఇలాంటి స్థితిలో అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గటం ఎంతవరకూ సబబో జీ–7 ఆలోచించుకోవాలి. -
రష్యా చేసిన నష్టానికి రష్యా నిధులే వాడతారట.!
యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ ఆదుకునేందుకు G7 దేశాలు కొత్త వ్యూహం అనుసరిస్తున్నాయి. వేర్వేరు దేశాల్లో స్తంభింపజేసిన రష్యా నిధులను ఉక్రెయిన్‌కు కేటాయించాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి 50 బిలియన్ డాలర్లు సాయం చేయాలని నిర్ణయించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత.. 300 బిలియన్ యూరోల రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను G7 దేశాలు స్తంభింపజేశాయి. దీనిపై వచ్చిన వడ్డీలో 50 బిలియన్ డాలర్లను రుణం కింద అందించాలని ఈయూ ప్రతిపాదించింది.యుద్ధంలో ధ్వంసమైన ఉక్రెయిన్ను పునర్ నిర్మించాలంటే 486 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులనే కాకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులైన ఒలిగార్చ్ ఆస్తులను కూడా EU, G7 దేశాలు స్తంభింపజేశాయి. పడవలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆస్తుల మొత్తం విలువ 397 బిలియన్ డాలర్లుగా యుక్రేనియన్ థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ ఐడియాస్ అంచనా వేసింది.ఇక రష్యాకు చెందిన మెజార్టీ ఆస్తులను ఈయూ దేశాలు స్తంభింపచేశాయి. దాదాపు 185 బిలియన్ యూరోలు బెల్జియంలోని అంతర్జాతీయ డిపాజిట్ సంస్థ అయిన యూరోక్లియర్ జప్తు చేయగా.. మిగతా ఆస్తులను బ్రిటన్, ఆస్ట్రియా, జపాన్, స్విట్జర్లాండ్, యూఎస్ దేశాలు సీజ్ చేశాయి. ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలనే విషయంలో ఈయూ దేశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. నిజానికి.. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ డబ్బును పశ్చిమ దేశాలు జప్తు చేయకుండా అంతర్జాతీయ చట్టం నిషేధిం విధించింది. ఇప్పుడు దీని నుంచి తప్పించుకునేందుకు సీజ్ చేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే వడ్డీని ఉక్రెయిన్‌కు రుణం కింద అందించాలని భావిస్తున్నాయి.ఉక్రెయిన్‌కు రుణం అందించే విషయంలో పలు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇంతకుముందు యూఎస్ రుణాలు అందిస్తుందని భావించగా.. ఇప్పుడు G7 దేశాలు కూడా ఇందులో భాగస్వామ్యమయ్యాయి. ఈ దేశాల నుంచి ఎవరు రుణాన్ని అందిస్తారనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. రుణం మంజూరు చేయాలంటే ఈయూ సభ్య దేశాలన్నింటి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఒకవేళ యుద్ధం నుంచి రష్యా విరమించుకొని ఆస్తులను తిరిగి ఇవ్వాల్సి వస్తే ఏం జరుగుతుందనే దానిపై కూడా ఆయా దేశాల మధ్య స్పష్టత లేన్నట్లు తెలుస్తోంది. చైనా వంటి దేశాలు పశ్చిమ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. -
భారత్ చమురు ఉత్పత్తుల జోరు
న్యూఢిల్లీ: చౌక ధరలో ఆఫర్ చేస్తుండటంతో రష్యా నుంచి భారత్ చమురును భారీగా దిగుమతి చేసుకుంటోంది. దిగుమతైన చమురుతో కొంతమేర పెట్రోలియం ప్రొడక్టులను రూపొందిస్తోంది. వీటిని తిరిగి ఎగుమతి చేస్తోంది. అయితే వీటిలో మూడో వంతు ప్రొడక్టులను జీ–7 తదితర సంపన్న దేశాలకు ఎగుమతి చేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం! ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా పలు యూరోపియన్ దేశాలు రష్యన్ చమురు ధరలపై పరిమితులు విధించాయి. అయితే శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను ఆయా దేశాలు కొనుగోలు చేసేందుకు విధానాలు అనుమతిస్తున్నాయి. వెరసి చట్టబద్ధంగా భారత్ నుంచి చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. నిజానికి రష్యా చమురు కొనుగోలుపై జీ7, ఈయూ, ఆ్రస్టేలియా ఎలాంటి ఆంక్షలనూ అమలు చేయనప్పటికీ 2022 డిసెంబర్లో బ్యారల్ ధర 60 డాలర్లకు మించి కొనుగోలు చేయకుండా పరిమితి విధించుకున్నాయి. తద్వారా రష్యాకు అధిక ఆదాయం లభించకుండా అడ్డుకునేందుకు నిర్ణయించాయి. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు జోరందుకోవడంతో రష్యా అదనపు లబ్ధి చేకూరకుండా చెక్ పెట్టేందుకు తీర్మానించాయి. అయితే ఆపై భారత్ నుంచి రష్యా చమురు ద్వారా తయారైన 6.65 బిలియన్ డాలర్ల(6.16 బిలియన్ యూరోలు) విలువైన చమురు ఉత్పత్తులు ఆయా దేశాలకు ఎగుమతి అయినట్లు ఫిన్లాండ్ సంస్థ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్(సీఆర్ఈఏ) వెల్లడించింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన గుజరాత్ జామ్‌నగర్ రిఫైనరీ నుంచి 5.2 బిలియన్ యూరోల ఎగుమతులున్నట్లు ఒక నివేదికలో పేర్కొంది. -
ఇండో–పసిఫిక్ ప్రపంచ మథనం
ఈ నెల మనం వరుసగా కొన్ని ప్రపంచస్థాయి సదస్సులను చూడబోతున్నాం. జీ7; దక్షిణ పసిఫిక్ దేశాలతో భారత్, అమెరికా సమావేశాలు వంటివి వీటిలో ముఖ్యమైనవి. ఈ క్రమంలో కొత్త పొత్తులు, భౌగోళిక రాజకీయ పోటీ, ప్రపంచ సమస్యలను పరిష్కరించడం కోసం పథకాల వంటివి చోటు చేసుకోనున్నాయి. జీ7 సభ్యదేశాలన్నింటితో సహకారం పెరుగుతున్న సమయంలో, 2019 నుంచి అతిథిగా హాజరవుతున్న భారత్... తాజాగా జీ7 దేశాల సదస్సులో పాల్గొననుంది. క్వాడ్‌లో అమెరికా, జపాన్ లతో; ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (టీటీసీ) ద్వారా యూరోపియన్ యూనియన్ తో; బ్రిటన్, కెనడాలతో భారత్ ముందస్తు వాణిజ్య చర్చలు జరుపుతోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్ అంత ర్జాతీయ కార్యకలాపాలు, విస్తృతార్థంలో అంత ర్జాతీయ వ్యవస్థ మారుతున్న స్వభావాన్ని పట్టి చూపే పలు నాయకుల సదస్సులకు ఈ నెల సాక్షీభూతం కానుంది. మొత్తంగా అవి కొంత కాలంగా వ్యక్తమవుతున్న కొన్ని ధోరణుల కలయికను సూచిస్తాయి. వాణిజ్య, ఆర్థిక పరస్పర ఆధారిత విధానాలు, చైనా అంతర్జాతీయ పాత్ర, భారత్ అంతర్జాతీయ భాగస్వామ్యాల సాపేక్ష ప్రాధాన్యత, ప్రపంచ ప్రధాన రాజకీయ లోపాలు వంటివన్నీ నిర్మాణాత్మక మార్పులకు లోనయ్యాయి. అయితే, ఈ పరిణామాలు నిర్దిష్ట వ్యాఖ్యాతలతో పొసగడం లేదు. అవేమిటంటే, తప్పుడు సమానత్వా లకు అతుక్కు పోతున్న భారతీయులు. న్యూఢిల్లీతో సంబంధాలను క్రమం తప్పకుండా చిన్నచూపు చూస్తున్న అమెరికన్లు, బ్రస్సెల్స్,సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రాంతాల్లోని వ్యక్తులు లేదా సంస్థలు గత ఆర్థిక, రాజకీయ క్రమాన్ని తిరిగి పొందాలని కోరుకోవడం వంటివి. ఈ వారం హిరోషిమాలో జరగనున్న జి7 దేశాల సమావేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలకు చెందిన నాయకులు సమావేశం కానున్నారు. 1970ల నుంచి వీరు వార్షిక ప్రాతిపదికన సమావేశమవుతూ వస్తున్నారు. జి7 అజెండాలో, నేటికీ కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం ప్రధానాంశంగా ఉంటుంది, ఈ గ్రూప్ దేశాలు రష్యాపై ఆంక్షలతోపాటు ఉక్రెయిన్ ప్రభుత్వం వెనుక నిలబడటం తెలిసిందే. అయితే అమెరికా, కెనడాలను మినహాయిస్తే తక్కిన దేశాలు సాపేక్ష ఆర్థిక పతనం దశలో ఉంటున్నాయి. అమెరికా యేతర జి–7 సభ్యదేశాల సామూహిక స్థూల దేశీయోత్పత్తి 1992లో ఉన్న 52 శాతం నుంచి నేటికి 23 శాతానికి పడిపోయింది. ఒక ఉమ్మడి శక్తిగా, జీ7 ఐక్యత ఈరోజు మరింత విలువైనదైనా, వాటి బలం తక్కువగా ఉంటోంది. జీ7 సభ్యదేశాలన్నింటితో సహకారం పెరుగుతున్న సమయంలో, 2019 నుంచి అతిథిగా హాజరవుతున్న భారత్... తాజాగా జీ7 దేశాల సదస్సులో పాల్గొననుంది. క్వాడ్‌లో అమెరికా, జపాన్ తో, ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (టీటీసీ) ద్వారా యూరోపియన్ యూనియన్ తో, బ్రిటన్, కెనడాలతో భారత్ ముందస్తు వాణిజ్య చర్చలు జరుపుతోంది. సంక్లిష్టభరితమైన జనాభా, స్థూల ఆర్థికపరమైన సంధికాలంలో భారత అభివృద్ధిని, ఆర్థిక భద్రతా లక్ష్యాలను వేగవంతం చేయడం కోసం ఈ యంత్రాంగాలను ప్రభావితం చేయడం ప్రధానమైన అంశంగానే ఉంటుంది. అదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధం, భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలోనూ, అభివృద్ధి చెందిన ప్రపంచం నుంచి స్పల్ప మార్పులనే గమనిస్తున్న భారత్‌కు జాతీయ, అంతర్జాతీయ సమస్య లను లేవనెత్తే అవకాశాన్ని జీ7 సదస్సు కల్పిస్తోంది. ఈ సమస్యలు ఏమిటంటే, ఇంధన, ఆహార భద్రత; సరఫరా మార్గాల స్థితిస్థాపకత, వాతావరణం; ఆర్థిక, స్వావలంబన అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థల సంస్కరణ, రుణ స్థిరత్వం వంటివి. కాగా, అమెరికా వడ్డీరేట్లు అధికంగా ఉడటం, డిజిటల్ కరెన్సీలు, చెల్లింపుల్లో ఆవిష్కరణలు, నిలకడ లేని వాణిజ్య అసమతుల్యతలు, అంతర్జాతీయ ఆంక్షలు వంటివి రానున్న సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చుట్టుముట్ట నున్నాయి. హిరోషిమా సదస్సును దాటి చూస్తే, భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లు దక్షిణ పసిఫిక్ దేశాల నాయకులతో సమావేశాల కోసం పాపువా న్యూ గినియాను సంద ర్శిస్తారని భావిస్తున్నారు. వాటి చిన్న సైజు, చిన్నచిన్న దీవుల్లోని జనాభా కారణంగా దక్షిణ పసిఫిక్ ప్రాంతాన్ని తరచుగా చిన్నచూపు చూస్తూ వచ్చారు. కానీ ప్రపంచ భూ ఉపరితలంలో ఈ ప్రాంతం ఆరింట ఒక వంతును కలిగి ఉంది. తైవాన్ , అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలపై ప్రభావం చూపే విషయంలో చైనా పోటీ పడటాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రాంతం కూడా భౌగోళిక రాజకీయ హాట్ స్పాట్‌గా మారుతోంది. పైగా వాతావరణ సంక్షోభం, నిలకడైన రుణ విధానాలు, మత్స్య, ఖనిజ వనరులు వంటివాటికి ఈ ప్రాంతం కీలకమైనది. భారత్ విషయానికి వస్తే, ఫోరమ్ ఆన్ ఇండియా పసిఫిక్ ఐలాండ్ కో–ఆపరేషన్ (ఎఫ్ఐపీఐసీ) ద్వారా 2014–2017లో ప్రారంభమైన మహమ్మారి సంబంధిత విరామం – వ్యాప్తి తర్వాత పోర్ట్ మోర్స్బీలో జరుగనున్న సదస్సు ఒక సహజమైన కొనసాగింపు. ఈ సంవత్సరాల్లో భారత ప్రధాని ఫిజీలో 14 దక్షిణ పసిఫిక్ ప్రాంత నాయకులను కలిశారు. వారందరికీ జైపూర్‌లో ఆతిథ్యమిచ్చారు. భారతీయ అభివృద్ధి, సహాయ పథకాలను ప్రదర్శించడానికి అది ఒక అవకాశం అవుతుంది. ఫిజీ, పాపువా న్యూ గినియాలలో రుజువైనట్లే, గ్లోబల్ సౌత్‌ని ప్రభావితం చేస్తున్న కొన్ని ఉమ్మడి సవాళ్లకు ప్రస్తుత భారతీయ ప్రతిపాదనలు పరిష్కారాలు కావచ్చు. అదే సమయంలో, అమెరికా భూభాగం కాని ఒక దక్షిణ పసిఫిక్ దేశానికి బైడెన్ ప్రయాణం ఆశ్చర్యకరంగా అమెరికా అధ్యక్షుడి ప్రథమ సందర్శన కానుంది. పైగా, ఒక ముఖ్యమైన ప్రాంతంపై వాషింగ్టన్ చాలాకాలం తర్వాత దృష్టి పెట్టినట్లవుతుంది. చివరగా, ఆస్ట్రేలియాలో క్వాడ్ సదస్సుకు ఈ నెల సాక్షీభూతం కానుంది. గ్రూప్ లీడర్లు మూడోసారి వ్యక్తిగతంగా కలవనున్నారు. అమెరికా అధ్యక్షుడు వార్షిక ప్రాతిపదికన హాజరయ్యే కొన్ని అంత ర్జాతీయ గ్రూప్ సమావేశాలు ఏవంటే, జీ7, జీ20, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కో ఆపరేషన్, ఈస్ట్ ఆసియా సదస్సు, ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు. ఈ చిన్న జాబితాలో క్వాడ్ కొత్త చేరిక అన్నమాట. 2021లో అధ్యక్ష స్థాయి సమావేశంగా మొదటిసారి ఉనికిలోకి వచ్చిన క్వాడ్, మూడు కార్యాచరణ బృందాలను ఏర్పర్చింది. కానీ ఇప్పుడు దీని కార్యకలాపాలు 25 కార్యాచరణ బృందాలకు విస్తరించాయి. వీటిలో కొన్ని, క్వాడ్ ఫెలోషిప్స్ వంటి కొన్ని ఫలితాలను ఇప్పటికే ప్రదర్శించాయి. మరి కొన్ని సముద్రజలాల సమస్యలు, సైబర్ సెక్యూరిటీ, అంతర్జాతీయ రుణం వంటి అంశాల్లో సన్నిహిత సహకారానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కొన్ని కార్యాచరణ బృందాలు ఇప్పటికీ చాలా అస్థిరంగా ఉంటున్నాయి. ఇకపోతే సరఫరా చైన్లు, సంక్లిష్ట టెక్నాలజీలు వంటి ఇతర అంశాల్లో సభ్యదేశాల మధ్య ద్వైపాక్షిక ప్రయత్నాలను ముందుకు తీసుకుపోవడానికి క్వాడ్ ఒక యంత్రాంగాన్ని ఏర్పర్చింది. వీటిలో అమెరికా, భారత్‌లతో ముడి పడి ఉన్న జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని టెక్నాలజీ సంభాషణ, ఐసీఈటీ వంటివి ఉన్నాయి లేదా, ఇండో–పసిఫిక్ ఎకన మిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈపీ), మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ (టిపి– ఎమ్‌డిఎ) వంటి అంశాలపై దేశాల విస్తృత సమితిని తీసు కొచ్చాయి. ఇవి, మరికొన్ని ప్రయత్నాలు సిడ్నీలో జరగనున్న సదస్సు నాటికి కొంత ప్రగతిని చవి చూస్తాయి కూడా. (అయితే అమెరికా అంతర్గత వ్యవహారాల వల్ల జో బైడెన్ ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకోవ డంతో క్వాడ్ సమావేశం ఆఖరు నిమిషంలో వాయిదా పడింది). ఇక ఈ నెలలో జరగనున్న ఇండో–పసిఫిక్ అత్యున్నత సమావేశం సారాంశాన్ని చూస్తే, అంతర్జాతీయ వ్యవస్థలో కొన్ని కీలకమైన ప్రకంపనలను అవి ఎత్తిచూపనున్నాయి. ఈ ధోరణులను అభినందించే విషయంలో అనేక ప్రముఖ అంతర్జాతీయ వ్యాఖ్యాతలు ఘర్షించ వచ్చు. కానీ ఆర్థిక సంబంధాల నూతన పోకడలు, కొత్త రంగాలు, భౌగోళిక–రాజకీయ పోటీ రూపాలు, ఈ సమస్యలను ఎదుర్కోవడా నికి కొత్త యంత్రాంగాలు సీదాసాదాగా రూపుదిద్దుకుంటున్నాయి. ధ్రువ జైశంకర్ వ్యాసకర్త కార్యనిర్వాహక డైరెక్టర్, ఓఆర్ఎఫ్, అమెరికా (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో...) -
రష్యా రాక్షసకాండను సహించబోం.. శిక్ష తప్పదు.. జీ7 దేశాల హెచ్చరిక
టోక్యో: తైవాన్‌పై చైనా దుందుడుకు చర్యలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై జీ7 దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘తీరు మార్చుకుని అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడాలి. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు’’అని ఆ దేశాలను హెచ్చరించాయి. జీ7 దేశాలైన జపాన్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ విదేశాంగ మంత్రులు, అత్యున్నత ప్రతినిధుల మూడు రోజుల సదస్సు జపాన్‌లోని కరూయిజవాలో మంగళవారం ముగిసింది. చైనా, రష్యా, ఉత్తర కొరియాల కట్టడికి కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు. అనంతరం మంత్రులు ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. రష్యాను దారికి తీసుకురావడమే లక్ష్యంగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించబోతున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాకు శిక్ష తప్పదన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా రాక్షసకాండను సహించబోమన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగుతుందన్నారు. చైనా, తైవాన్ మధ్య శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. జీ7 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు మే లో జపాన్‌లోని హిరోషిమాలో జరగనుంది. చైనాపై జీ7 కూటమి కుట్రలు పన్నుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. -
Ukraine War: రష్యాకి చైనా మద్దతు బంద్ చేసేలా..అమెరికా రంగం సిద్ధం!
ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకు సాయాన్ని అందిస్తే చైనాపై ఆంక్షలు విధించడానికి అమెరికా రెడీ అవుతోంది. ఈ విషయమై ముఖ్యంగా జీ7 సముహంలోని దేశాల మద్దతు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే అమెరికా ఏవిధమైన ఆంక్షలు విధించాలనుకుంటదనేది స్పష్టం కాలేదు. వాస్తవానికి ఇటీవలే వాషింగ్టన్ దాని మిత్ర దేశాలు రష్యాకు ఆయుధాలు అందించడానికి చైనా యత్నిస్తున్నట్లు ఆరోపణలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలను చైనా తీవ్రంగా ఖండించింది. అలాగే ఈవిషయమై అమెరికా ఎలాంటి ఆధారాలను చూపలేదు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశం తోపాటు యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్, చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ ఈ మధ్య జరిగిన వ్యక్తిగత సమావేశంలో కూడా వారు చైనాను నేరుగానే హెచ్చరించారు. రష్యాకు చైనా మద్దతును కట్టడి చేసేలా బైడెన్ పరిపాలన యంత్రాంగం ట్రెజరీ డిపార్ట్మెంట్ తోసహా, దౌత్య స్థాయిలో చర్యలు తీసుకునేలా రంగం సిద్ధం చేసింది. దీన్ని ఏడాది క్రితమై అమలు చేసిందని, రష్యాపై ఆంక్షలకు మద్దతు ఇచ్చిన దేశాల సముహంతో బీజింగ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. నిఘా వర్గాల ప్రకారం.. రష్యాకు సాధ్యమైన సైనిక సహాయాన్ని అందించడం గురించి పరిగణలోకి తీసుకుంటే చైనా గురించి వస్తున్న వాదనలను తక్కువ దేశాలే సమర్థిస్తున్నాయి. యూఎస్ మిత్ర దేశాలకు సంబంధించినంత వరుకు చైనా కచ్చితంగా సాయం చేసే అవకాశం ఉందంటూ పలు కారణాలను చెబుతున్నాయి. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడికి కొద్ది క్షణాల ముందు రష్యాతో పరిమితులు లేని భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ప్రకటనే చైనాపై పలు అనుమానాలు వ్యక్తమయ్యేందుకు దారితీసింది. అదీగాక జీ7 ఫ్రంట్‌లో ఈ విషయమే చర్చించి చైనాపై వివరణాత్మక చర్యలు తీసుకునేలా దృష్టి సారించాలని చూస్తోంది యూఎస్. ఇదిలా ఉండగా, గత వారం చైనా సమగ్ర కాల్పుల విరమణ కోసం 12 పాయింట్ల పత్రాన్న సైతం విడుదల చేయడం గమనార్హం. చైనాని కట్టడి చేయడం సాధ్యమేనా! రష్యాకి యుద్ధ సామాగ్రి తక్కువగా ఉండటంతో చైనా నుంచి ఆయుధ సరఫరా రష్యాకి అనుకూలంగా మారతుందని ఉక్రెయిన్ మద్ధతుదారులు భయాపడుతున్నారు. ఐతే ఫిబ్రవరి 24 జీ7 ప్రకటనలో ఉక్రెయిన్‌పై దాడి జరిగి ఏడారి పూర్తి అయిన సందర్భంగా.. రష్యా యుద్ధానికి అవసరమైన వస్తుపరమైన సాయాన్ని అందించకూడదు లేదంటే దీనికి తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పిలుపునిచ్చింది వాషింగ్టన్. అంతేగాదు చైనా పేరుని ప్రస్తావించకుండానే రష్యా ఆంక్షల నుంచి తప్పించుకునేలా సహాయపడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కంపెనీలపై యూఎస్ జరిమానాలు విధించింది. చైనాపై ఆంక్షలు విధించడంలో అమెరికాకు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన ఐరోపా, ఆసియాలనే ఏకతాటిపై తీసుకురావడం పెను సవాలుగా ఉంది. ఎందుకంటే.. జర్మనీ నుంచి దక్షిణ కొరియా వరుకు ఉన్న అమెరికా మిత్ర దేశాలు చైనాను దూరం పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నాయి. (చదవండి: అందుకేనా! రష్యా భారత్ చమురు మార్కెట్ వైపే మొగ్గు చూపుతోంది) -
బ్యారెల్ @ 60 డాలర్లు.. రష్యా తిరస్కరణ.. ఎగుమతులు నిలిపేస్తామని హెచ్చరిక
బ్రసెల్స్: ఉక్రెయిన్‌పై 9 నెలలుగా రష్యా చేస్తున్న యుద్ధానికి నిధుల లభ్యతను వీలైనంత తగ్గించడం. నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలకు అడ్డుకట్ట వేయడం. ఈ రెండు లక్ష్యాల సాధనకు యూరోపియన్ యూనియన్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు ధరకు బ్యారెల్‌కు 60 డాలర్ల పరిమితి విధించింది. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఈయూ సభ్య దేశాల మధ్య చివరి నిమిషంలో ఎట్టకేలకు శుక్రవారం రాత్రి ఇందుకు అంగీకారం కుదిరింది. అమెరికా, జపాన్, కెనడా తదితర జీ 7 దేశాలు కూడా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపాయి. ఇది సోమవారం నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఈయూ, జీ 7 దేశాలకు చమురును బ్యారెల్ 60 డాలర్లు, అంతకంటే తక్కువకు మాత్రమే రష్యా విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ పరిమితిని రష్యా తిరస్కరించింది. ఈయూ తదితర దేశాలకు చమురు ఎగుమతులను నిలిపేస్తామని హెచ్చరించింది. ‘‘ఈ ఏడాది నుంచి యూరప్ రష్యా చమురు లేకుండా మనుగడ సాగించాల్సి వస్తుంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్, అంతర్జాతీయ సంస్థల్లో రష్యా శాశ్వత ప్రతినిధి మిఖాయిల్ ఉల్యనోవ్ హెచ్చరించారు. ఈయూ పరిమితితో పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదంటూ నిపుణులు కూడా పెదవి విరుస్తున్నారు. ‘‘రష్యా ఇప్పటికే భారత్, చైనా తదితర ఆసియా దేశాలకు అంతకంటే తక్కువకే చమురు విక్రయిస్తోంది. రష్యాను నిజంగా బలహీన పరచాలనుకుంటే బ్యారెల్‌కు 50 డాలర్లు, వీలైతే 40 డాలర్ల పరిమితి విధించాల్సింది’’ అని అభిప్రాయపడుతున్నారు. ఈయూ నిర్ణయం ప్రభావం రానున్న రోజుల్లో యూరప్ దేశాలపై, రష్యాపై, మిగతా ప్రపంచంపై ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది. రూటు మార్చిన రష్యా రష్యా ప్రపంచంలో రెండో అతి పెద్ద చమురు ఉత్పత్తిదారు. సగటున రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యేదాకా యూరప్ దేశాలే దానికి అతి పెద్ద చమురు మార్కెట్. వాటి కఠిన ఆంక్షల నేపథ్యంలో కథ మారింది. యూరప్ ఎగుమతుల్లో చాలావరకు భారత్, చైనాలకు మళ్లించింది. అయితే కరోనా కల్లోలం నేపథ్యంలో చైనా చమురు దిగుమతులను బాగా తగ్గించుకుంటోంది. ఇదిలాగే కొనసాగితే రష్యా తన చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి రావచ్చు. లభ్యత తగ్గి ధరలకు మళ్లీ రెక్కలు రావచ్చు. చలికాలం కావడంతో చమురు, సహజవాయువు వినియోగం భారీగా పెరిగే ఈయూ దేశాలను ఈ పరిణామం మరింతగా కలవరపెడుతోంది. ‘‘చమురు ధరలు ఏ 120 డాలర్లో ఉంటే 60 డాలర్ల పరిమితి రష్యాకు దెబ్బగా మారేది. కానీ ఇప్పుడున్నది 87 డాలర్లే. రష్యాకు ఉత్పాదక వ్యయం బ్యారెల్‌కు కేవలం 30 డాలర్లే! ’’ అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నల్ల మార్కెట్‌కూ తరలించొచ్చు... ఆర్థిక మందగమనం దెబ్బకు ఒకవేళ సమీప భవిష్యత్తులో అంతర్జాతీయంగా చమురు వాడకం తగ్గినా ఆ మేరకు ఉత్పత్తిని తగ్గించడం రష్యాకు సమస్యే అవుతుంది. ఎందుకంటే ఒకసారి చము రు ఉత్పత్తి ఆపితే పునఃప్రారంభించడం అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. కాబట్టి మధ్యేమార్గంగా ఇరాన్, వెనెజువెలా దారిలోనే రష్యా కూడా బ్లాక్ మార్కెట్లో చమురును అమ్ముకునే అవకాశాలూ లేకపోలేదని భావిస్తున్నారు. పైగా దీనిద్వారా హెచ్చు ఆదాయం కూడా సమకూరుతుంది. ఈ కోణంలో చూసినా ఈయూ పరిమితి వాటికే బెడిసికొట్టేలా కన్పిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023 తొలి త్రైమాసికాంతం నాటికి చమురు ధరలు ఒకవేళ బాగా పెరిగితే పరిమితి రష్యాపై ఎంతోకొంత ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు. -
పోలాండ్‌లో మిస్సైల్ అటాక్.. టెన్షన్లో జో బైడెన్!
ఉక్రెయిన్‌లో దాడులతో ప్రపంచదేశాలను రష్యా ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలాండ్ సరిహద్దులోకి ఓ మిస్సైల్‌ను ప్రయోగం జరగడం కలకలం సృష్టించింది. కాగా, ఈ మిస్సైల్ రష్యాకు చెందినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఈ దాడిలో ఇద్దరు మరణించారు. మరోవైపు.. ఇండోనేషియా బాలిలో జీ-20 సమావేశాలు జరగుతున్న సమయంలో పోలాండ్‌లో ఇలా జరగడం మరింత టెన్షన్‌కు గురిచేస్తోంది. కాగా, ఈ మిస్సైల్ దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బో బైడెన్ అప్రమత్తమయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బైడెన్.. జీ-7, నాటో దేశాల నేతలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. కాగా, జీ-20 సమావేశాల అనంతరం ఈ వీరితో బైడెన్ భేటీ కానున్నారు. ఫ్రాన్స్, కెనడా, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, ఇతర దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. నాటోలో పోలాండ్ సభ్య దేశంగా ఉంది. ఇక.. పోలాండ్‌లో మిస్సైల్ దాడిని నాటో సభ్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మిస్సైల్ దాడికి రష్యానే పాల్పడిందని ఆరోపిస్తూ పుతిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జీ-20 సభ్యదేశాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ దేశాధినేతలు ఓ ప్రకటనపై సంతకాలు చేయబోతున్నారు. అయితే ఈ ప్రకటనపై ఎన్ని దేశాలు సంతకం చేయబోతున్నాయో అనే దానిపై స్పష్టత లేదు. ఇక, ఈ మిస్సైల్ దాడి చేసింది.. రష్యా అనేందుకు ఆధారాలు లేవని, అయినప్పటికీ వివరణ కోరుతూ మాస్కో రాయబారికి సమన్లు జారీ చేసినట్లు పోలాండ్ ప్రకటించింది. మరోవైపు ఇదే విషయాన్ని పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు. President Biden on Missile Strike in Poland: "I'm going to make sure we figure out exactly what happened...and then we're going to collectively determine our next step as we investigate and proceed." pic.twitter.com/pY55Feq66m — CSPAN (@cspan) November 16, 2022 -
భారత్‌కు మద్దతుగా నిలిచిన చైనా.. షాక్‌లో ప్రపంచ దేశాలు!
డ్రాగన్ కంట్రీ చైనా అనూహ్యంగా భారత్‌కు మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో నిత్యవసర ధరల పెరుగుదలతో వ్యవసాయ ఉత్పత్తులపై ఎండల ప్రభావం, ఆహార భద్రత వంటి కారణాలతో గోధుమల ఎగుమతిని నిషేధించింది. ఈ సందర్భంగా ముందస్తు ఒప్పందాల వరకు మాత్రమే ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది. భవిష్యత్తు ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. కాగా, భారత్ నిర్ణయంపై జీ 7 దేశాలు తప్పుబట్టాయి. దీంతో అనూహ్యంగా భారత్‌కు డ్రాగన్ కంట్రీ చైనా మద్దతు తెలిపింది. గోధుమ ఎగుమతి నిలిపివేతపై జీ 7 దేశాలు భారత్‌ను విమర్శించడం సరికాదని వ్యాఖ్యానిస్తూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో గోధుమ ఎగుమతుల నిషేధంపై భారత్‌ను విమర్శిస్తున్నారు కరెక్టే.. అయితే జీ 7 దేశాలు తమ ఎగుమతులను పెంచడం ద్వారా ఆహార మార్కెట్ సరఫరాను స్థిరీకరించడానికి ఎందుకు ముందుకు రావడం లేదంటూ ప్రశ్నించింది. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో భారత్‌ది చిన్న వాటానే అంటూ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే ఈయూ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు గోధుమ ప్రధాన ఎగుమతిదారులంటూ కౌంటర్ ఇచ్చింది. అనంతరం గోధుమ ఎగుమతులపై భారత్‌ను విమర్శించడం మానేసి ఆహార సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలను జీ-7 దేశాలు చేపట్టాలని సూచించింది. ఇది కూడా చదవండి: రష్యాకు మరో షాక్! నాటోలో చేరనున్న మరోదేశం -
మాక్రాన్ గెలుపుతో ఉక్రెయిన్‌కు ఊరట
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోమారు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విజయం సాధించడంతో ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకుంది. అయితే గతంతో పోలిస్తే లీపెన్‌కు మద్దతు బాగా పెరిగినట్లు కనిపించింది. అతివాద నాయకురాలు లీపెన్ నెగ్గొచ్చన్న ఊహాగానాలు తొలుత యూరప్ హక్కుల సంఘాలకు, ఉక్రెయిన్ నాయకత్వానికి ఆందోళన కలిగించాయి. ఆమె బహిరంగంగా పుతిన్‌కు అనుకూలంగా మాట్లాడటం, ఈయూకు, నాటోకు వ్యతిరేకంగా గళమెత్తడంతో ఆమె అధ్యక్షురాలైతే తమకు ఒక పెద్ద అండ లోపిస్తుందని జెలెన్‌స్కీసహా ఉక్రెయిన్ నాయకత్వం భయపడింది. లీపెన్ పదవిలోకి వస్తే జీ7లాంటి కూటములు కూడా ప్రశ్నార్థకమయ్యేవని జపాన్ ఆందోళన చెందింది. లీపెన్‌పై మాక్రాన్ విజయం సాధించినప్పటికీ ఆయన్ను వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య స్వదేశంలో పెరిగిపోతోంది. ఈ అంశాన్ని గుర్తించిన మాక్రాన్ స్వదేశంలో తనను వ్యతిరేకిస్తున్నవారి ధోరణికి కారణాలు కనుగొంటానని, వారిని సంతృప్తి పరిచే చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. తాను దేశీయులందరికీ అధ్యక్షుడినన్నారు. అయితే స్వదేశం ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా విదేశీ వ్యవహారాల్లో పెద్దమనిషి పాత్ర పోషిస్తున్న మాక్రాన్‌పై స్వదేశంలో చాలామంది గుర్రుగా ఉన్నారు. తొలి నుంచి మద్దతు ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభం కావడానికి ముందే యుద్ధ నివారణకు మాక్రాన్ చాలా యత్నాలు చేశారు. వ్యక్తిగతంగా పుతిన్‌తో చర్చలు జరిపారు. యుద్ధం ఆరంభమైన తర్వాత రష్యా చర్యను ఖండించడంలో ఉక్రెయిన్‌కు సాయం అందించడంలో ముందున్నారు. అందుకే మాక్రాన్‌ను నిజమైన స్నేహితుడు, నమ్మదగిన భాగస్వామిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొనియాడారు. పుతిన్ చర్యకు వ్యతిరేకంగా రష్యాపై మాక్రాన్ ఆంక్షలను కూడా విధించారు. అలాగే రష్యా సహజవాయువు అవసరం ఫ్రాన్స్‌కు లేదని, తాము గ్యాస్ కోసం ఇతర దేశాలపై ఆధారపడతామని మాక్రాన్ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఇకపై పుతిన్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ మరింత చురుగ్గా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగిస్తామని మాక్రాన్ చెప్పారు. ఒకపక్క రష్యా చర్యను వ్యతిరేకిస్తూనే పుతిన్‌తో చర్చలకు తయారుగా ఉన్నానని ప్రకటించడం ద్వారా మాక్రాన్ హుందాగా వ్యవహరించారని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం ముదురుతున్న ఈ తరుణంలో ఫ్రాన్స్ ఈ సమతుల్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నారు. అయితే అస్తవ్యస్తంగా మారిన ఫ్రాన్స్ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టడమనే పెద్ద సవాలు ప్రస్తుతం మాక్రాన్ ముందున్నదని నిపుణులు అంటున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అదంత సులభం కాబోదంటున్నారు. ఫ్రాన్స్ పీఠం మాక్రాన్దే ఫ్రాన్స్ అధ్యక్షునిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (44) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మూడో నాయకునిగా నిలిచారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో జాతీయవాదిగా పేరున్న ఫైర్ బ్రాండ్ నాయకురాలు మరీన్ లీ పెన్ (53)పై మాక్రాన్ విజయం సాధించారు. ఇప్పటిదాకా ఐదింట నాలుగొంతుల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మాక్రాన్‌కు 56 శాతానికి పైగా ఓట్లు రాగా పెన్ 44 శాతంతో సరిపెట్టుకున్నారు. 2017లో ఆయన 66 శాతం ఓట్లు సాధించారు. గెలుపు అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితరాల నేపథ్యంలో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నానా అనుమానాలతో, పలు రకాల విభజనలతో అతలాకుతలంగా ఉన్న దేశాన్ని మళ్లీ ఒక్కతాటిపైకి తెస్తా’’ అని ప్రకటించారు. యూరప్ దేశాధినేతలంతా ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాక్రాన్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇండో–ఫ్రాన్స్ బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఆయనతో మరింతగా కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. -
దిగ్గజ టెక్ కంపెనీలపై 15 శాతం గ్లోబల్ ప్రాఫిట్ ట్యాక్స్
లండన్: ప్రపంచంలోని దిగ్గజ టెక్నాలజీ కంపెనీలపై మరొక పన్ను భారం పడనుంది. 15 శాతం గ్లోబల్ కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానానికి జీ–7 దేశాలు అంగీకరించాయి. బహుళ జాతి కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించే ప్రతి దేశంలో గ్లోబల్ ట్యాక్స్ రేట్ 15 శాతంగా ఉండాలని తీర్మానించాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్ జీ–7 దేశాల ఆర్ధిక మంత్రులతో లండన్‌లో సమావేశం జరిగింది. ఈ మేరకు ఆయా దేశాలు ఒప్పందం మీద సంతకాలు చేశాయని బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ తెలిపారు. ‘ ఈ ఒప్పందంతో సరైన కంపెనీలు సరైన పన్నులను సరైన ప్రదేశాలలో చెల్లిస్తాయి’ అని రిషి ట్వీట్‌చేశారు. ఒప్పందంలో కార్పొరేట్ పన్ను విధానంలో పోటీ ధరల తగ్గింపు నియంత్రణ ధిక్కరణలు ఉండవని అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి, శ్రామిక ప్రజలకు న్యాయం జరిగేలా ఉంటుందన్నారు. జూన్ 11–13 తేదీల్లో కార్న్‌వాల్‌లోని కార్బిస్బేలో జరగాల్సిన జీ–7 దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ముందు ఆర్ధిక మంత్రుల సమావేశం జరిగింది. అంతర్జాతీయంగా 15 శాతం కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ మద్దతు ఇవ్వడంతో.. ఈ ప్రతిపాదనకు ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు చేతులు కలిపాయి. భౌతికంగా ఉనికి లేకపోయినా సరే వ్యాపారం చేసే ఇంటర్నెట్ ఆధారిత సంస్థలకు (ఆన్లైన్ కంపెనీలు) కూడా పన్ను విధానాల సమస్యలను పరిష్కరించేందుకు జీ–7 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. చాలా వరకు ఆన్లైన్ కంపెనీలు తక్కువ లేదా నో ట్యాక్స్‌లతో కార్యకలాపాలు సాగిస్తుంటాయి. -
ఆచి తూచి అడుగేయాలి
ప్రపంచాన్ని శాసించే సంపన్న దేశాల సంస్థ ఆదరించి రమ్మని ఆహ్వానిస్తే, సభ్యత్వం తీసుకోమని అర్థిస్తే వద్దనే దేశం ఏముంటుంది? 45 ఏళ్లనాడు జీ–6గా ఏర్పడి, అనంతరం జీ–7గా, మధ్యలో కొన్నాళ్లు జీ–8గా వున్న ఏడు పారిశ్రామికాభివృద్ధి దేశాల కూటమిలోకి రావాలని మన దేశానికి అమెరికా నుంచి ఆహ్వానం అందింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనతోపాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, రష్యాలను కూడా పిలిచారు. సహజంగానే భారత్ దాన్ని అంగీకరించింది. అయితే ఇప్పుడున్న సంక్షుభిత పరిస్థితుల్లో ఏ పిలుపుల వెనకైనా ఉద్దేశాలుండక తప్పదని, వాటిని అంగీకరిస్తే ముద్రలు పడక తప్పదని ఆహ్వాన స్వీకర్తలు గ్రహించాల్సివుంటుంది. జీ–7ను విస్తృతపరచాలని నిర్ణయించడంలో ట్రంప్‌కు రెండు ఉద్దేశాలున్నాయి. అందులో యధాప్రకారం చైనాను కట్టడిచేయడం ఒకటి కాగా, రెండోది–మౌలికంగా ఆ సంస్థ సభ్యదేశాల తీరుతెన్నులపైనే ఆయనకు ఆగ్రహం కలగడం. అటు సంస్థలోని సభ్య దేశాలు కూడా ట్రంప్‌ను సమస్యగానే పరిగణిస్తున్నాయి. అందువల్లే ఇప్పుడున్న పరిస్థితుల్లో జీ–7 ఆహ్వానంపై ఆలోచించి అడుగేయమని మన పాలకులకు నిపుణులు సూచిస్తున్నారు. ఏ కూటమి అయినా నిర్దిష్టమైన వ్యూహంతో, స్పష్టమైన ప్రయోజనాలతో ఆవిర్భవిస్తుంది. జీ–7 కూడా అలా ఏర్పడిందే. ప్రపంచ పరిణామాలపై ఇష్టాగోష్టి సమావేశాలు నిర్వహించుకోవడం, పరస్పరం ముడిపడివుండే ప్రయోజనాలపై దృష్టి పెట్టడం, ప్రపంచ వ్యవహారాలను ప్రభావితం చేయడం ఈ సంస్థ ధ్యేయాలని మొదట్లో చెప్పుకున్నారు. అయితే పాశ్చాత్య దేశాలను 1973లో చమురు సంక్షోభం ముంచెత్తినప్పుడు, దాన్నుంచి బయటపడటం కోసం ఇది ఆవిర్భవించింది. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న పాశ్చాత్య దేశాలకు గుణపాఠం నేర్పాలన్న చమురు ఉత్పత్తి దేశాల సంస్థ ఒపెక్ నిర్ణయంతో అప్పట్లో అమెరికా, పాశ్చాత్య దేశాల ఆర్థికవ్యవస్థలు గజగజలాడాయి. 1920నాటికి ప్రపంచ చమురు ఉత్పత్తుల్లో మూడింట రెండువంతుల భాగాన్ని ఆక్రమించిన అమెరికా 70వ దశకంలో ఒపెక్ నిర్ణయంతో బెంబేలెత్తింది. అప్పటికి తన దగ్గరున్న చమురు నిల్వలు తగ్గడం, దేశంలో డిమాండ్ అమాంతం పెరగడం వంటి పరిణామాలు దాన్ని ఇరుకునపెట్టాయి. లీటరు 3 డాలర్లుండే చమురు కాస్తా ఒక్కసారి నాలుగు రెట్లు పెరిగి 12 డాలర్లకు చేరుకోవడంతో అమెరికా, ఇతర పారిశ్రామిక దేశాల ఆర్థిక వ్యవస్థలు పల్టీలు కొట్టడం మొదలైంది. అధిక ధరలు, ద్రవ్యోల్బణం చుట్టుముట్టాయి. ఆ సంక్షోభానికి జవాబుగా తీసుకున్న పలు నిర్ణయాల్లో జీ–7 ఒకటి. 1975లో ఆవిర్భవించినప్పుడు ఇందులో ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా మాత్రమే వున్నాయి. మరుసటి ఏడాదికి కెనడా వచ్చి చేరింది. అనంతరకాలంలో ఒపెక్ దేశాల్లో చీలిక వచ్చిన పర్యవసానంగా చమురు సంక్షోభాన్ని పాశ్చాత్య దేశాలు అధిగమించాయి. దాంతో జీ–7కు విదేశాంగ విధానం, భద్రత, ఇరాన్–ఇరాక్ ఘర్షణలు, అఫ్ఘానిస్తాన్‌లో సోవియెట్ సైన్యం తిష్ట వంటివి ప్రధానాంశాలయ్యాయి. సోవియెట్ చరమాంకంలో ఆ దేశాధ్యక్షుడిగా వున్న మిఖాయిల్ గోర్బచెవ్‌ను జీ–7 ఆహ్వానించింది. సోవియెట్ కుప్పకూలాక రష్యా అందులో కొనసాగుతోంది. కానీ 2013 లో రష్యా క్రిమియాను విలీనం చేసుకున్నాక దాన్ని బహిష్కరించారు. రష్యాను చేర్చుకోవడాన్ని ఇతర సభ్య దేశాలు వ్యతిరేకిస్తున్నా ట్రంప్ బేఖాతరు చేస్తున్నారు. దీనికి దాదాపు పోటీగా వుంటున్న చైనా ఆధ్వర్యంలోని షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ)లో మనతోపాటు రష్యా, పాకిస్తాన్లకు కూడా సభ్యత్వం వుంది. రెండేళ్లక్రితం కెనడాలోని క్యుబెక్‌లో జీ–7, చైనాలోని చింగ్దాన్లో ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులు జరిగాయి. వాటి తీరుతెన్నులు గమనిస్తే జీ–7కూ, ఎస్సీఓకూ మధ్య వున్న వ్యత్యాసాలు తెలుస్తాయి. జీ–7 పరస్పర కలహాలతో ముగిసింది. అధినేతల మధ్య అవగాహన కుదిరిందంటూ ఆ సంస్థ అప్పటి అధ్యక్షుడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ప్రకటన చేస్తే, ట్రంప్ అది అబద్ధమని ప్రకటించి జీ–7 పరువు తీశారు. దేశాధ్యక్షుడైననాటినుంచీ ‘అమెరికాకే అగ్రప్రాధాన్యం’ అంటూ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు సంస్థలోని ఇతరులకు మింగుడు పడలేదు. సన్నిహిత దేశాలుగా వుంటున్నా తమ ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించారని కెనడా, మెక్సికో, యూరప్ యూనియన్(ఈయూ) దేశాలు ఆగ్రహించాయి. వాటిని సముదాయించకపోగా, రష్యాను మళ్లీ చేర్చుకోవాలంటూ ట్రంప్ పేచీకి దిగారు. ఉక్రెయిన్‌కు సమస్య పరిష్కారం కాకుండా అదెలా సాధ్యమంటూ జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కల్ మొత్తుకున్నా ఆయన వినలేదు. అప్పుడు సాధ్యం కాని తన ప్రతిపాదనను ఇప్పుడు సంస్థ అధ్యక్ష హోదాలో సాకారం చేసుకునేందుకు ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్‌కూ, ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో సాన్నిహిత్యం వుంది. జీ–7లో భారత్‌ను చేర్చుకోవాలన్న నిర్ణయాన్ని మోదీ ప్రశంసించారు కూడా. అయితే ప్రపంచంలో మనం అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్నందుకే ఈ ఆహ్వానం అందిందని అనుకోనవసరం లేదు. తాను ప్రతిపాదిస్తున్న ఇండో–పసిఫిక్ వ్యూహంలో భారత్ అత్యంత కీలకమైన దేశమని అమెరికా భావిస్తోంది. ఈ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడానికి భారత్ ఉపయోగపడుతుందనుకుంటోంది. జీ–7లో చేరడం ద్వారా చైనాకు ఒక సందేశం పంపినట్టవుతుందని మన వ్యూహకర్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ దేనిపైనా నిలకడలేని ట్రంప్ వంటి నేతలను ఏమేరకు విశ్వసించవచ్చునో ఆలోచించాలి. అమెరికా ఇంకా పాకిస్తాన్‌కు వంతపాడటం ఆపలేదు. అఫ్గాన్‌లో అది తీసుకుంటున్న నిర్ణయాలు పాక్‌కు అనుకూలంగా, మన ప్రయోజనాలకు చేటు తెచ్చేలావున్నాయి. అదీగాక సరిహద్దు సమస్యతోసహా చైనాతో మనం తేల్చుకోవాల్సినవి చాలావున్నాయి. వీటిపై స్పష్టత లేకుండా ముందుకెళ్లడం ఇప్పటికైతే అనవసరం. స్వీయ ప్రయోజనాల సాధనే గీటురాయిగా మన విధానాలు రూపుదిద్దుకోవడమే మంచిది. -
పుతిన్‌తో భేటీ సాధ్యమే
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తాను భేటీ అవ్వవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం స్వయంగా చెప్పారు. జీ–7 కూటమిలోకి రష్యాను మళ్లీ చేర్చుకోవాలని ఆయన అన్నారు. ఈ వేసవికాలంలో పుతిన్‌ను కలుస్తారా అని విలేకరులు ప్రశ్నించగా ‘మేం కలవవచ్చు. అవును అది సాధ్యమే’ అని ట్రంప్ వెల్లడించారు. ‘ఉత్తర కొరియాలాగే ఎవరితోనైనా మనం కలిస్తే ఎంతో బాగుంటుంది’ అని ట్రంప్ అన్నారు. ఉ.కొరియా సమస్యను పరిష్కరించా ఉత్తరకొరియా అణు సమస్యను చాలా వరకు తాను పరిష్కరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ చెప్పారు. దీంతోపాటు దక్షిణకొరియాతో యుద్ధ విన్యాసాలను నిలిపివేయటం ద్వారా ఎంతో డబ్బును కూడా ఆదా చేయగలిగినట్లు తెలిపారు. కిమ్‌తో మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. -
కెనడా ప్రధానిపై ట్రంప్ గరం
క్యుబెక్: జీ–7 శిఖరాగ్ర సదస్సు అనంతరం సభ్య దేశాలు విడుదలచేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆతిథ్య కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై మండిపడ్డారు. సదస్సు ముగియడానికి ముందే సింగపూర్ బయల్దేరిన ట్రంప్ విమానంలోనే ఉమ్మడి ప్రకటనపై స్పందిం చారు. ట్రూడో విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ విలేకర్ల సమావేశంలో ట్రూడో చెప్పినవి అబద్ధాలు. నిజం ఏంటంటే అమెరికా కంపెనీలు, కార్మికులు, వ్యవసాయదారులపై కెనడా విధిస్తున్న టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రకటనను నమ్మొద్దని మా ప్రతినిధులకు చెప్పాను. జీ–7 సమావేశ సమయంలో ఎంతో అణకువ, మర్యాదగా నటించిన ట్రూడో నేను వెళ్లిన తరువాత తనను ఎవరూ భయపెట్టలేరని మీడియా ముందు చెప్పారు’ అని డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టారిఫ్‌ల పెంపునకు ట్రంప్ భద్రతను సాకుగా చూపడం.. క్లిష్ట సమయాల్లో అమెరికా మిత్ర దేశాలకు మద్దతుగా నిలిచిన కెనడా మాజీ నాయకులను అవమానించడమేనని జస్టిన్ ట్రూడో మీడియా ముందు వ్యాఖ్యానించారు. ట్రంప్ ట్వీట్లపై ట్రూడో కార్యాలయం స్పందిస్తూ.. తమ ప్రధాని ఇంతకుముందు చెప్పని కొత్త విషయాలు వేటినీ చెప్పలేదని వెల్లడించింది. -
జీ–7లోకి మళ్లీ రష్యా రావాలి
లామాల్బే(కెనడా): జీ–7 కూటమిలోకి రష్యాను తిరిగి చేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకాంక్షించారు. కెనడాలోని క్యూబెక్‌లో జీ–7 దేశాల కూటమి సదస్సుకు హాజరయ్యేందుకు బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చల్లో రష్యా ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘వాళ్లు రష్యాను కూటమి నుంచి పంపించారు. రష్యా మళ్లీ మనతో చేరాలి’ అని పరోక్షంగా ఇతర భాగస్వామ్య దేశాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రతిపాదనను కూటమిలోని యూరోపియన్ దేశాలు వ్యతిరేకించాయి. క్రిమియాను ఆక్రమించినందుకు 2014లో రష్యాను ఈ కూటమి నుంచి తొలగించారు. దీంతో అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్‌లతో జీ–7గా మారింది. శుక్రవారం ప్రారంభమైన ఈ కూటమి సదస్సులో వాణిజ్య వివాదాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. తమ ఇనుము, అల్యూమినియం ఎగుమతులపై టారిఫ్‌లు పెంచడంతో మిత్ర దేశాలు అమెరికాపై మండిపడుతున్నాయి. దీంతో సదస్సు ముగిసిన తరువాత ఏకాభిప్రాయంతో కూడిన ఉమ్మడి ప్రకటన జారీకాకపోవచ్చని తెలుస్తోంది. అగ్రరాజ్యంతో తాడోపేడో.. ‘అమెరికాతో వాణిజ్యం చేసి అన్ని దేశాలు ప్రయోజనం పొందాయి. మేము మాత్రం లోటువాణిజ్యంలో మునిగిపోతున్నాం. ఆ లెక్కను సరిచేయాలనుకుంటున్నా ’ అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తరువాత జీ–7 దేశాలు తొలిసారి పలు అంశాలపై చీలిపోయాయి. అందులో పర్యావరణం, ఇరాన్‌తో అణు ఒప్పందం లాంటివి ఉన్నాయి. టారిఫ్‌లు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించాలని మిగిలిన సభ్య దేశాలు భావిస్తున్నాయి. వాణిజ్యం విషయంలో ట్రంప్‌తో రాజీకుదరకపోతే తామూ వెనకడుగు వేయమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ తేల్చిచెప్పారు. వైట్‌హౌజ్‌కు ఆహ్వానిస్తా! వాషింగ్టన్: జూన్ 12న సింగపూర్‌లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో జరగనున్న సమావేశం సానుకూలంగా సాగితే.. ఆయన్ను శ్వేతసౌధానికి ఆహ్వానిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే, సమావేశంలో అనుకున్న లక్ష్యాలు నెరవేరని పక్షంలో వెంటనే బయటకు వచ్చేందుకు కూడా సంకోచించబోనని ఆయన స్పష్టం చేశారు. జపాన్ ప్రధాని షింజో అబేతో వైట్‌హౌజ్‌లో సమావేశమైన సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ‘ఉత్తరకొరియాతో యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశం సానుకూలంగా సాగితే కిమ్‌ను వైట్‌హౌజ్‌కు లేదా ఫ్లోరిడాలోని మారాలాగో రిసార్టుకు ఆహ్వానిస్తా. అనుకున్న లక్ష్యాల దిశగా భేటీ జరగకపోతే.. వెంటనే బయటకు వచ్చేస్తా’ అని ట్రంప్ స్పష్టం చేశారు. -
‘రష్యా దూకుడుకు కళ్లెం వేద్దాం’
క్రూయెన్(జర్మనీ): ఉక్రెయిన్ విషయంలో రష్యా అనుసరిస్తున్న ధోరణిపట్ల జీ7 దేశాలు కలసికట్టుగా వ్యవహరించి రష్యా దూకుడుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆ కూటమి దేశాల నేతలకు పిలుపునిచ్చారు. జీ7 సదస్సు కోసం క్రూయెన్ పట్టణానికి చేరుకున్న ఒబామాకు జర్మనీ శనివారం సంప్రదాయ విందు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీ8 సమ్మిట్‌గా ఉన్న తాము రష్యా అధ్యక్షుడు పుతిన్ వైదొలగడంతో జీ7గా మారామని అన్నారు. పుతిన్‌కు ఈ సమావేశం ద్వారా గట్టి సందేశం పంపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ అభ్యున్నతికి జర్మనీతో కలసి పనిచేస్తామన్నారు. కాగా, జీ7 సదస్సు జరుగుతున్న క్రూయెన్ పట్టణం ప్రపంచీకరణ వ్యతిరేకులు, పర్యావరణ వేత్తల ఆందోళనలతో అట్టుడికింది.